S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/07/2016 - 07:40

హైదరాబాద్, జూలై 6: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు సాంకేతిక విప్లవం వచ్చి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తోంది. ఒకప్పుడు రీళ్లు రీళ్లుగా వచ్చే సినిమా ప్రింట్.. ఇప్పుడు చిన్న సైజ్ సీడీలో వచ్చేస్తోంది. శాటిలైట్ నుండి డైరెక్టుగా థియేటర్‌లోకి సినిమా అడుగుపెట్టింది కూడా. ఇలా రకరకాల సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న సినీ పరిశ్రమకు మరో కొత్త విధానం పరిచయం అవుతోంది.

07/07/2016 - 07:40

విజయవాడ, జూలై 6: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హెచ్‌ఓడి కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి జపాన్‌లోని మాకీ కంపెనీతో తుది దశ చర్చలు జరిపేందుకు మంత్రి నారాయణ గురువారం టోక్యోకు బయల్దేరి వెళ్తున్నారు. నారాయణతోపాటు ఐఎఎస్ అధికారి లక్ష్మీ పార్థసారథి కూడా వెళ్తున్నారు. మాకీ సంస్థ ఇచ్చిన డిజైన్లకు దేశీయ ఆర్కిటెక్ట్‌లతో సవరణలు చేయించారు. గత నెలాఖరుకు ఈ డిజైన్లు ఫైనలైజ్ కావల్సి ఉంది.

07/06/2016 - 00:48

న్యూఢిల్లీ, జూలై 5: రైతులు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) స్వల్పకాలిక రుణాలుగా 3 లక్షల రూపాయల వరకు అందుకోవచ్చు. రాయితీపై 4 శాతం వడ్డీరేటుకే ఈ రుణం లభిస్తుంది. అయితే నిర్ణీత వ్యవధిలో చెల్లించనట్లైతే ఈ వడ్డీరేటు 7 శాతానికి వెళ్తుంది. ‘కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ ఏడాది వరకు గరిష్ఠ కాలపరిమితితో స్వల్పకాలిక రుణంగా 3 లక్షల రూపాయల వరకు 4 శాతం వడ్డీరేటుకే అందించనుంది.

07/06/2016 - 00:46

హైదరాబాద్, జూలై 5: దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్ అధిపతి విజయ్ మాల్యా కేసు విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఎర్రమంజిల్ కోర్టు మంగళవారం ప్రకటించింది. తమకు విజయ్ మాల్యా ఇచ్చిన 50 లక్షల రూపాయల విలువైన చెక్‌లు బౌన్స్ అయ్యాయనే అభియోగంతో జిఎంఆర్ సంస్థ కోర్టుకు ఫిర్యాదు చేసినది తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న కోర్టు.. మాల్యాకు సమన్లు కూడా జారీ చేసింది.

07/06/2016 - 00:46

ముంబయి, జూలై 5: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. గత ఆరు రోజుల వరుస లాభాలకు సూచీలు బ్రేక్ వేశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 111.89 పాయింట్లు క్షీణించి 27,166.87 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 34.75 పాయింట్లు దిగజారి 8,335.95 వద్ద నిలిచింది.

07/06/2016 - 00:45

హైదరాబాద్, జూలై 5: దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టి హబ్ అంతర్జాతీయ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ ఏరీస్ గ్రూప్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. అవుట్ సోర్సింగ్, టెక్నాలజీ సేవలను అందించే ఏరీస్.. స్టార్టప్ సంస్థ (అంకుర సంస్థలు)లకు పెద్ద ఊతంగా ఉంటుందని టి హబ్ సిఇఒ జయకృష్ణన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెబ్, ఎంటర్‌ప్రైజ్ కంప్యూటర్ అప్లికేషన్స్‌ను నిరంతరం అంతరాయం లేకుండా ఏరీస్ సంస్థ పర్యవేక్షించనుంది.

07/06/2016 - 00:44

హైదరాబాద్, జూలై 5: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్.. వచ్చే నెల ఆగస్టులో టివిఎస్ స్కూటీ జస్ట్ 110 ‘హిమాలయన్ హైస్’ సీజన్-2ను ప్రారంభించనుంది. ఈ మేరకు ఇక్కడ మంగళవారం ఓ ప్రకటనలో ఆ సంస్థ ప్రకటించింది. నిరుడు ఆగస్టులో టివిఎస్ స్కూటీ జస్ట్ 110తో హిమాలయాల్లోని ఖార్దుంగ్ లా వరకు వెళ్లిన లక్నోకు చెందిన ఆనం హషిం ఆధ్వర్యంలో ‘హిమాలయన్ హైస్’ సీజన్-2 జరుగుతుందని స్పష్టం చేసింది.

07/06/2016 - 00:42

ఏలూరు, జూలై 5: అంబికా దర్బార్ బత్తి నుంచి మరో నాలుగు ఉత్పత్తులు మంగళవారం మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రం వద్ద అంబికా అగరుబత్తి ‘సత్యపూజ’ బ్రాండ్ అగరుబత్తీలు నాలుగు రకాలను సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంబికా రాజా విడుదల చేశారు.

07/06/2016 - 00:40

న్యూఢిల్లీ, జూలై 5: సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మంగళవారం దేశీయ మార్కెట్‌కు ఏకంగా 44 సరికొత్త స్మార్ట్ టీవీ మోడళ్లను పరిచయం చేసింది. గరిష్ఠ ధర 24 లక్షల రూపాయలు. నిరుడు 82 లక్షల టెలివిజన్లను విక్రయించి భారతీయ టీవీ మార్కెట్‌లో 31 శాతం వాటాను దక్కించుకున్న సామ్‌సంగ్ ఇండియా.. ఈ ఏడాది 35 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది.

07/06/2016 - 00:37

హైదరాబాద్, జూలై 5: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశామని పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ తెలిపారు. పెట్టుబడులకు సంబంధించి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి 26 మంది పర్యాటక రంగ పెట్టుబడిదారులు వచ్చారన్నారు.

Pages