S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

,
06/28/2016 - 00:22

విజయవాడ, జూన్ 27: విశాఖ, విజయవాడ, తిరుపతిల్లోని ప్రధాన విమానాశ్రయాల నుంచి వివిధ దేశాలకు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు ప్రముఖ విదేశీ విమానయాన సంస్థ ఇతిహాద్ ముందుకొచ్చింది. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండోరోజు సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. టియాంజిన్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొని పలువురు పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు.

06/27/2016 - 07:46

ముంబయి, జూన్ 26: బ్రెగ్జిట్ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పుంజుకుంటున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ఆఖరుకల్లా 10 గ్రాముల పుత్తడి ధర 33,500 రూపాయలను తాకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలగడంతో భారత్‌తోసహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్, కరెన్సీ మార్కెట్లు పతనమవుతున్నాయి. దీంతో మదుపరులు తమ పెట్టుబడులకు సరైన చోటు బంగారమేనని భావిస్తున్నారు.

06/27/2016 - 07:44

ముంబయి, జూన్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలగడంతో శుక్రవారం భారత్‌తోసహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలకు లోనైనది తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఈ ఒక్కరోజే 604 పాయింట్లు పతనమవగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 182 పాయింట్లు పడిపోయింది.

06/27/2016 - 07:43

బెర్లిన్, జూన్ 26: ఐరోపా యూనియన్‌నుంచి నిష్క్రమించే అధికారిక ప్రక్రియను ఈ వారంలోనే ప్రారంభించాలని యూరోపియన్ పార్లమెంటు అధ్యక్షుడు బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్‌ను కోరారు. యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ వైదొలిగితే మరింత అనిశ్చితి తలెత్తుతుందని, ఫలితంగా ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయనే భయాలు తలెత్తే కాలం పోయిందని మార్టిన్ షుల్జ్ ప్రముఖ జర్మనీ వార్తాపత్రిక ‘బిల్డ్‌యామ్ సోన్‌టాగ్’తో అన్నారు.

06/27/2016 - 07:43

బీజింగ్, జూన్ 26: ప్రపంచ ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవాలంటే వౌలికాభివృద్ధి ముఖ్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. రాబోయే పదేళ్లలో భారత వౌలిక రంగంలో లక్షన్నర కోట్ల డాలర్ల పెట్టుబడులకు అవకాశాలున్నాయన్నారు. ‘ప్రపంచ మందగమనంలో నిలకడైన వృద్ధిరేటుకు వౌలికరంగాభివృద్ధే మార్గం. భారత వౌలిక రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి.’ అని చైనా పర్యటనలో ఉన్న జైట్లీ అన్నారు.

06/27/2016 - 07:42

ముంబయి, జూన్ 26: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాల వివరాలను బ్యాంకుల నుంచి తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐఒ) సేకరిస్తోంది. ‘కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఎంతెంత రుణం ఇచ్చారన్న సమగ్ర వివరాలను బ్యాంకుల నుంచి ఎస్‌ఎఫ్‌ఐఒ కోరుతోంది. రుణాల మంజూరు సమయంలో అన్ని మార్గదర్శకాలను బ్యాంకర్లు పాటించారా? లేదా?

06/27/2016 - 07:42

న్యూఢిల్లీ, జూన్ 26: విదేశీ మదుపరులు దేశీయ రుణ మార్కెట్లంటేనే దూరంగా ఉంటున్నారు. మదుపునకు జంకుతున్నారు. గతంలో పెట్టిన పెట్టుబడులను సైతం లాగేసుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి 11,500 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు మరి. ఈ నెలలోనే ఇప్పటిదాకా 6,189 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ)..

06/26/2016 - 01:04

న్యూఢిల్లీ, జూన్ 25: అంతా ఊహిస్తున్నట్లుగా బ్రెగ్జిట్‌తో కొంప మునిగిపోయేంత ముప్పేమీ లేదని మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర అన్నారు. ఈయు నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని (బ్రెగ్జిట్) ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఓ సునామీ హెచ్చరికగా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు.

06/26/2016 - 01:02

బీజింగ్, జూన్ 25: భారత్‌లో పెట్టుబడులకు ఆకాశమే హద్దు అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ నిలకడైన వృద్ధిరేటుతో ముందుకెళ్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆసియా వౌలికరంగ పెట్టుబడుల బ్యాంక్ (ఎఐఐబి) నిర్ణయాలపై భారత వౌలికరంగ ప్రాజెక్టుల భవితవ్యం ఆధారపడి ఉందన్నారు.

06/26/2016 - 01:01

బెర్లిన్, జూన్ 25: యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) నేపథ్యంలో ఈయు వ్యవస్థాపక సభ్య దేశాలు శనివారం ఇక్కడ సమావేశమయ్యాయి. జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మియర్ పిలుపు మేరకు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇటలీ, బెల్జియం, లగ్జెంబర్గ్ దేశాల విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Pages