S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/26/2016 - 00:58

హైదరాబాద్, జూన్ 25: ఈ ఏడాది ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజులపాటు ఇక్కడ హైటెక్స్‌లో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమపై ప్రదర్శన జరుగుతుందని క్రెడాయ్ సంస్థ తెలిపింది. క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి ఆర్‌కె రావు మాట్లడుతూ రాజధాని హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందన్నారు.

06/26/2016 - 00:57

హైదరాబాద్, జూన్ 25: రాబోయే రెండు, మూడేళ్ళలో దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్, గార్మెంట్స్, ఫ్యాషన్ టెక్నాలజీలో కోటి మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇందుకు ప్రణాళిక సిద్ధం అవుతున్నదని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. అయితే ఈ ఉద్యోగావకాశాల్లో తప్పనిసరిగా 75 శాతం మంది మహిళలు ఉండాలని ఆయన అన్నారు.

06/26/2016 - 00:56

విజయవాడ, జూన్ 25: ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లలో మార్పు రావటంతో మొక్కజొన్న వినియోగం పెరిగింది. మొక్కజొన్న దిగుబడిలో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఎపిలో మొక్కజొన్న హెక్టారుకు సగటు దిగుబడి 6,523 కిలోలు. ఇది జాతీయ సగటు దిగుబడి (2,498 కిలోలు) కంటే 4,025 కిలోలు ఎక్కువ.

06/26/2016 - 00:55

హైదరాబాద్/నర్సంపేట, జూన్ 25: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రాబ్యాంకు వ్యాపారంలో దూసుకెళ్తోంది. తెలంగాణ సర్కిల్ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో 26 వేల కోట్ల రూపాయలతో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 576 ఆంధ్రాబ్యాంకు బ్రాంచీలు ఉండగా, మెట్రో జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డి మినహాయిస్తే 354 బ్రాంచీలు ఉన్నాయ.

06/25/2016 - 08:08

భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలు ౄ ఈయు నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని జీర్ణించుకోలేని మదుపరులు
సెనె్సక్స్ 604, నిఫ్టీ 182 పాయింట్లు క్షీణత ౄ ఆరంభంలో విపరీతమైనా.. చివర్లో తగ్గిన నష్ట తీవ్రత
ప్రధాన దేశాల కరెన్సీల్లో తీవ్ర ఒడిదుడుకులు ౄ 31 ఏళ్ల కనిష్టానికి పౌండ్ పతనం

06/25/2016 - 08:01

హైదరాబాద్,జూన్ 24: సింగరేణి సంస్థ గత ఆర్ధిక సంవత్సరంలో 15 శాతం వృద్ధిరేటుతో ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతికి జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించినట్లు ఆ సంస్థ సిఎండి ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ జాతీయ స్థాయిలో అత్యుత్తమ పనితీరుకు ఇచ్చే సామర్థ్యపు అవార్డును ఈ ఏడాది సింగరేణికి సంస్థకు ప్రకటించినట్లు ఆయన చెప్పారు.

06/25/2016 - 08:01

న్యూఢిల్లీ, జూన్ 24: బ్రెగ్జిట్ ప్రభావం కరెన్సీ మార్కెట్లపై తీవ్రంగా పడింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం 72 పైసలు క్షీణించి 67.96 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో రూపాయికిపైగా నష్టపోయింది. ఎగుమతిదారుల నుంచి రూపాయి అమ్మకాలు పెరిగిపోయాయి. అయితే స్టాక్ మార్కెట్లు కోలుకున్నకొద్దీ రూపాయి విలువ కూడా బలపడింది. అటు అంతర్జాతీయంగా వివిధ దేశాల కరెన్సీ విలువలూ క్షీణించాయి.

06/25/2016 - 08:00

న్యూఢిల్లీ, జూన్ 24: బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగిపోయాయి. బ్రెగ్జిట్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలకు లోనుకావడంతో మదుపరులు తమ పెట్టుబడులకు బంగారాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడమే దీనికి కారణం. ఈ క్రమంలోనే 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర ఈ ఒక్కరోజే 1,205 రూపాయలు ఎగిసి 30,875 రూపాయలను తాకింది. వెండి ధర కూడా 1,000 రూపాయలు ఎగబాకి 42,300 రూపాయలకు చేరింది.

06/25/2016 - 08:00

ముంబయి, జూన్ 24: బ్రెగ్జిట్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు వాటిల్లగా, మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. బిఎస్‌ఇ సెనె్సక్స్ 604 పాయింట్లు పతనమైన క్రమంలో మదుపరుల సంపద దాదాపు 1.8 లక్షల కోట్ల రూపాయలు దిగజారింది. బిఎస్‌ఇ 100 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ నుంచి కూడా వైదొలిగింది.

06/25/2016 - 07:59

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ రాష్ట్రం వౌలిక సదుపాయాల రంగం ప్రభుత్వరంగ పెట్టుబడుల్లో దేశం మొత్తం మీద మూడవ స్థానంలో ఉందని, 36 శాతం వృద్ధిరేటు సాధించిందని, కాని విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్లు, మంచినీటి రంగంలో అనుసంధానం పెంచాల్సి ఉందని అసోచామ్ ప్రకటించింది.

Pages