S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/22/2016 - 00:55

విశాఖపట్నం, జూన్ 21: ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ మరింత పటిష్ఠ పరిచేందుకు వీలుగా నిర్మాణాత్మక ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఇందులోభాగంగా ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఆధ్వర్యంలో వెయ్యి కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయ. ఈ ప్రతిపాదనలను మంగళవారం ఈపిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయానికి వచ్చిన ప్రపంచ బ్యాంకు బృందం పరిశీలించింది.

06/22/2016 - 00:54

ఇండోర్, జూన్ 21: నెలకు ఐదుసార్లు మించి ఎటిఎమ్ లావాదేవీలు జరిపేవారు ఎక్కువ కావడంతో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ఎటిఎమ్ ఆదాయం 47 శాతం పెరిగింది. నెలకు ఉచితంగా ఐదుసార్లు ఎటిఎమ్‌ను వినియోగించుకునే అవకాశం ఉన్నది తెలిసిందే. అయితే ఆరోసారి వినియోగం నుంచి ఒక్కో లావాదేవీకి 20 రూపాయల చొప్పున ఖాతాదారుడి వద్ద డబ్బులు వసూలు చేస్తుంది ఎస్‌బిఐ.

06/22/2016 - 00:53

విశాఖపట్నం, జూన్ 21: సరకు రవాణాలో విశాఖపట్నం పోర్టు ట్రస్టు మరో కీలక భూమిక పోషించనుంది. ఇప్పటి వరకూ కోల్‌కతా పోర్టు నుంచి సరిహద్దు దేశం నేపాల్‌కు సరకు రవాణా జరిగేది. తాజాగా విశాఖ పోర్టును సైతం కేంద్ర ప్రభుత్వం గేట్‌వే పోర్టుగా ప్రకటించడంతో ఎగుమతి, దిగుమతుల్లో మరింత పురోగతి సాధించేందుకు ఆస్కారమేర్పడనుంది. రైలు, రోడ్డు మార్గాల అనుసంధానం ఈ మేరకు విశాఖ పోర్టుకు ఈ అవకాశాన్ని దక్కించింది.

06/22/2016 - 00:49

హిందూపురం, జూన్ 21: ఓ పక్క పాల సేకరణ నిలిపివేసిన అధికారులు.. మరోపక్క పాల ధర తగ్గించి పాడి రైతుల నోట్లో మట్టికొట్టారు. ఎపి డెయిరీల నుంచి పాలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో ఇటీవల అధికారులు పాల సేకరణ తగ్గించారు. తాజాగా ధరలు కూడా తగ్గించారు. పైగా ఈనెల 16 నుంచే కొత్త ధరలు వర్తిస్తాయని అనంతపురం జిల్లా హిందూపురంలోని పాలశీతలీకరణ కేంద్రంలో నోటీసులు అతికించడంతో రైతులు మండిపడుతున్నారు.

06/21/2016 - 05:26

ముంబయి, జూన్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సంస్కరణల ఉత్సాహంతో పరుగులు పెట్టాయి. పౌర విమానయానం, రక్షణ, ఔషధ, ఆహార రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధనలను కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సరళతరం చేయడం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ నిర్ణయంతో ఉదయం ఆరంభంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కదలాడాయి.

06/21/2016 - 05:25

న్యూఢిల్లీ, జూన్ 20: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు దేశంలో పెట్టుబడుల అవకాశాలను పెంచుతుందని, ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల రాకకు దోహదం చేస్తుందని భారత పారిశ్రామిక, వ్యాపార ప్రపంచం కొనియాడింది. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పనకు కూడా కలిసొస్తుందని అభిప్రాయపడింది.

06/21/2016 - 05:20

న్యూఢిల్లీ, జూన్ 20: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వెళ్లిపోతున్న క్రమంలో వ్యక్తమవుతున్న ఆందోళనల మధ్య విధానాలపైనేగానీ, వ్యక్తులపై ఆధారపడి రేటింగ్ చర్యలుండవని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ వ్యాఖ్యానించింది. ఈ సెప్టెంబర్ 4న మూడేళ్ల పదవీకాలం ముగుస్తున్న క్రమంలో రెండోసారి ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉండలేనంటూ గత శనివారం రాజన్ ప్రకటించినది తెలిసిందే.

06/21/2016 - 05:18

ముంబయి, జూన్ 20: తన తర్వాత వచ్చేవారు ద్రవ్యోల్బణంపై పోరును కొనసాగించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్. ఈ ఏడాది సెప్టెంబర్ 4తో రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగుస్తుండగా, రెండోసారి ఈ పదవిలో కొనసాగడం ఇష్టం లేదని గత శనివారం ప్రకటించినది తెలిసిందే.

06/21/2016 - 05:17

న్యూఢిల్లీ, జూన్ 20: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రేసులో ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ముందంజలో ఉన్నారు. గవర్నర్‌గా ఈ సెప్టెంబర్ 4న రఘురామ్ రాజన్ పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త గవర్నర్ రేసులో పలువురి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

06/20/2016 - 06:39

న్యూఢిల్లీ/ముంబయి, జూన్ 19: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా రెండోసారి ఉండలేనని రఘురామ్ రాజన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన చేపట్టిన నిర్మాణాత్మక మార్పులను దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ఇకపైనా అవలంభించాల్సిన అవసరం ఉందని భారతీయ పారిశ్రామిక రంగం అభిప్రాయపడింది.

Pages