S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/20/2016 - 06:37

ప్రపంచంలోనే పురాతన ఫొటో స్టూడియోల్లో ఒకటైన కోల్‌కతాలోని
‘బౌర్న్ అండ్ షెఫర్డ్’ ఫొటో స్టూడియో ఇది. 176 సంవత్సరాలుగా సేవలు అందించిన ఈ స్టూడియో ప్రస్తుతం మూతబడింది. 1840లో ప్రఖ్యాత బ్రిటీష్ ఫొటోగ్రాఫర్ల ద్వారా కోల్‌కతాలో కొలువుదీరి ల్యాండ్ మార్క్‌గా పేరుగాంచిన ఈ స్టూడియో ప్రాంగణం.. ఆదివారం ఇలా బోసిపోయ కనిపించింది.
అంతర చిత్రంలో స్టూడియోలోని ప్రాచీన కెమెరాలను శుభ్రపరుస్తున్న దృశ్యం

06/20/2016 - 06:33

న్యూఢిల్లీ, జూన్ 19: ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. తమ ప్రయాణికులకు త్వరలో విమానాశ్రయానికి సకాలంలో చేరుకోవడంలో భాగంగా విమాన టిక్కెట్‌తో టాక్సీ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తేనుంది. టిక్కెట్ కొనుగోలు సమయంలో టాక్సీని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కాగా, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని కూడా సంస్థ భావిస్తోంది.

06/20/2016 - 06:33

న్యూఢిల్లీ, జూన్ 19: టమోటా ధరలు దిగివస్తున్నాయి. నిన్న, మొన్నటిదాకా రిటైల్ (చిల్లర) మార్కెట్‌లో కిలో 100 రూపాయల వరకు పలికిన టమోటా ధర.. నేడు సగానికిపైగా తగ్గుముఖం పట్టింది. టోకు (హోల్‌సేల్) మార్కెట్‌లో ధరలు శాంతిస్తుండటంతో దానికి అనుగుణంగా రిటైల్ మార్కెట్‌లోనూ ధరలు క్రిందికొస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం అజద్‌పూర్ హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో 60 రూపాయలు తాకిన టమోటా ధర..

06/20/2016 - 06:32

న్యూఢిల్లీ, జూన్ 19: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఈ నెలలో ఇప్పటిదాకా దాదాపు 4,400 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు.

06/19/2016 - 07:14

‘రాజన్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. త్వరలోనే ఆయన వారసుడిని ప్రకటిస్తాం.’
- కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
‘రాజన్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం బాధాకరం. ఆ నిర్ణయం నన్ను ఎంతో అసంతృప్తికి గురిచేసింది.’
- మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం
‘్భరత విశ్వసనీయతను, సామర్థ్యాన్ని పెంచిన ఘనత రాజన్‌ది. ఆయన స్థానంలో రాబోయేవారు కూడా ఇలాగే ఉంటారని ఆశిస్తున్నాం.’

06/19/2016 - 07:13

ముంబయి, జూన్ 18: ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా మళ్లీ నేను కొనసాగలేను. రెండో దఫా ఈ పదవిని ఆశించడం లేదు.’ అని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రాజకీయ విమర్శల మధ్య మునుపెన్నడూ లేనివిధంగా ఓ ఆర్‌బిఐ గవర్నర్ పదవి తీవ్ర చర్చనియాంశం కావడం ఇదే ప్రథమం. కేంద్ర ప్రభుత్వ వర్గాలు రాజన్‌కు వ్యతిరేకంగా, వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినది తెలిసిందే.

06/19/2016 - 07:10

న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 18: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నాడో సినీ కవి. అవును మరి.. ఇప్పుడిలాగే ఉంది మార్కెట్‌లో మార్కెట్ పరిస్థితి. సంచుల్లో డబ్బు, జేబుల్లో వంట సామాగ్రి తెచ్చుకునే దుస్థితి నేడు తలెత్తిందంటే అతిశయోక్తి కాదు. కూరగాయలు, పప్పులు, మాంసం, గుడ్లు ఇలా ఒక్కటేమిటీ అన్ని ఆహారోత్పత్తుల ధరలు రెట్టింపయ్యాయి. ఫలితంగా సామాన్యుడి బడ్జెట్ తారుమారైంది.

06/19/2016 - 07:09

ఆత్మకూర్, జూన్ 18: తెలంగాణ రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయలు వెచ్చించి రానున్న మూడేళ్లలో విద్యుదుత్పత్తిని చేయనున్నట్లు జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని దిగువ జూరాల సిబ్బందికి కొత్తగా నిర్మించిన భవన సముదాయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఆత్మకూర్ పట్టణానికి సమీపంలో 14.30 కోట్ల రూపాయల నిధులతో జెన్‌కో సిబ్బందికి భవన సముదాయాన్ని నిర్మించారు.

06/19/2016 - 07:06

న్యూఢిల్లీ, జూన్ 18: దక్షిణ కొరియాతో భారత వాణిజ్యలోటు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయం, మెరైన్, ఐటి, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో మరింతగా మార్కెటింగ్ అవకాశాలను కల్పించాల్సిందిగా దక్షిణ కొరియాను శనివారం భారత్ కోరింది. ఇరు దేశాలు తమ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇక్కడ సమీక్షించాయి. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే చర్యలపై దృష్టి సారించాలని నిర్ణయించాయి.

06/18/2016 - 06:38

ముంబయి, జూన్ 17: మదుపరులు, నిర్మాణరంగ వర్గాలను ఆకట్టుకోవడానికి మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. రియల్ ఎస్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్టు (ఆర్‌ఇఐటి లేదా రిట్)ల నిబంధనలను సరళతరం చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన బోర్డు సమావేశంలో ఆర్‌ఇఐటిలపై ఆంక్షలను తొలగించేందుకూ సెబీ ప్రతిపాదనలు చేసింది. నిర్మాణంలో ఉన్న ఆస్తుల్లో మరిన్ని పెట్టుబడులకు ఆర్‌ఇఐటిని అనుమతించింది.

Pages