S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/09/2016 - 06:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఉత్పాదక, వ్యవసాయ రంగాల్లో మెరుగైన పరిస్థితుల మధ్య ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) భారత జిడిపి వృద్ధిరేటు ఐదేళ్ల గరిష్ఠాన్ని తాకుతూ 7.6 శాతంగా నమోదు కావచ్చని సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదైందన్న సిఎస్‌ఒ..

02/09/2016 - 06:15

మదనపల్లె, ఫిబ్రవరి 8: ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె నీరుగట్టువారిపల్లె హనుమాన్ జంక్షన్‌లోని శ్రీ చౌడేశ్వరీ కల్యాణ మండపంలో జరిగిన చేనేత కార్మికుల సదస్సుకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

02/09/2016 - 06:13

చెన్నై: తమిళనాడు మీదుగా వెళ్లే గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌పై నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జయలలిత సోమవారం ఓ లేఖను రాశారు.

02/09/2016 - 06:12

ముంబయి, ఫిబ్రవరి 8: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 329.55 పాయింట్లు పతనమై 24,287.42 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 101.85 పాయింట్లు క్షీణించి 7,387.25 వద్ద స్థిరపడింది.

02/08/2016 - 05:26

సంగారెడ్డి: విద్యుదుత్పత్తికి అవసరమైన నీరు, థర్మల్ వనరులు తగ్గిపోవడంతో కరెంటు కష్టాలు మొదలైన నేపథ్యంలో సౌర విద్యుత్ కేంద్రాలు ఆదుకుంటున్నాయి. కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వివిధ కంపెనీలు మెదక్ జిల్లాలో సౌర విద్యుత్ కేంద్రాలను విస్తరించడం ద్వారా రోజుకు 150 మెగావాట్ల విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.

02/08/2016 - 05:27

పారదీప్ (ఒడిషా): ప్రధాన మంత్రి ముద్ర యోజన క్రింద చిన్న వ్యాపారులకు దాదాపు లక్ష కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇక్కడ తెలియజేశారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసేలా ఉండకూడదని, ఉద్యోగాలు ఇచ్చేలా తయారవ్వాలన్నదే ప్రభుత్వ ఆశయం అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి)..

02/08/2016 - 05:21

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: విదేశీ మదుపరులు ఈ నెల తొలి వారంలో దేశీయ క్యాపిటల్ మార్కెట్లలోకి 2,500 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య గత నెల జనవరిలో భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. గత వారం మాత్రం పెట్టుబడులకు ఆసక్తి కనబరచడం విశేషం.

02/08/2016 - 05:17

హైదరాబాద్, ఫిబ్రవరి 7: రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7.64 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలంటే ముందుగా భూమి లభ్యత ఉండాలన్నది తెలిసిందే. దీన్ని బాగా అర్థం చేసుకున్న ఏపి సర్కారు ఆ దిశగా దృష్టి సారించింది.

02/08/2016 - 05:16

న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను ప్రకటించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జిడిపి, పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారం విడుదల కానున్నాయి.

02/07/2016 - 06:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: కేంద్ర ప్రభుత్వం దాదాపు 74 ఔషధాలకున్న పన్ను మినహాయింపు సౌకర్యాన్ని ఉపసంహరించింది. ఇందులో ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, హెచ్‌ఐవిలకు వినియోగించే ఔషధాలు కూడా ఉండటం గమనార్హం. ఫలితంగా వాటికి సంబంధించిన వ్యాధిగ్రస్తులపై ఇక ఆర్థిక భారం పడనుంది.

Pages