S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/03/2015 - 05:31

సంగారెడ్డి, డిసెంబర్ 2: ప్రాణాంతకమైన రసాయనాలతో కూడిన జల, వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై విచారణ చేసేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు త్వరలోనే నిజనిర్ధారణ కమిటీ మెదక్ జిల్లాలో పర్యటిస్తుందన్న సమాచారంతో ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలు ముందస్తు జాగ్రతలు పాటిస్తున్నాయి. కమిటీ సభ్యులు ఆరు మాసాల పాటు జిల్లాలో మకాం వేసి కాలుష్యకారక పరిశ్రమల ఆగడాలపై అధ్యయనం చేయనున్నారు.

12/03/2015 - 05:04

హైదరాబాద్, డిసెంబర్ 2: సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మాణంలో వున్న 600/2 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో చేపట్టిన నిర్మాణ పనులపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగ సలహాదారు, ఆర్‌పి సింగ్, సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్ సంతృత్తి వ్యక్తం చేశారు. బుధవారం సింగరేణి భవన్‌లో ఎస్‌టిపిపి నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.

12/03/2015 - 05:03

హైదరాబాద్, డిసెంబర్ 2: ఫార్మా, ఐటీ కంపెనీలకు హబ్‌గా మారిన హైదరాబాద్.. భవిష్యత్తులో హెలికాప్టర్ల తయారీకి కూడా హబ్‌గా మారబోతోందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. త్వరలో హైదరాబాద్‌లో ‘అపాచి’ హెలికాప్టర్ల పరిశ్రమను స్థాపించబోతుందని ఆయన అన్నారు.

12/03/2015 - 05:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఫోక్స్‌వాగన్ కాల్యుష్య నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో రాబోయే ఆరు నెలల్లో దేశంలోని అన్ని సంస్థల డీజిల్ కార్లపై నిఘా వేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఆయా సంస్థలు కూడా నిబంధనలు పాటించాయో, లేదోననేదానిపై ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఆర్‌ఎఐ) ఈ ఆరు నెలలు అన్ని డీజిల్ ప్యాసింజర్ కార్లను పరిశీలించనుంది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి అనంత్ గీతే బుధవారం ఇక్కడ తెలిపారు.

12/03/2015 - 05:00

ముంబయి, డిసెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌వేస్తూ మదుపరులు అమ్మకాల దిశగా వెళ్ళడంతో నష్టాలు తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 51.56 పాయింట్లు పడిపోయి 26,117.85 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 23.55 పాయింట్లు కోల్పోయి 7,931.35 వద్ద నిలిచింది.

12/02/2015 - 18:22

ముంబయి: స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 26,117 వద్ద అదేవిధంగా నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 7,931 సూచీ వద్ద ముగిశాయి.

12/02/2015 - 06:32

ముంబయి, డిసెంబర్ 1: ఊహించినట్లే కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) యథాతథంగానే ఉంచింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఐదో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్‌బిఐ వెళ్ళలేదు. సెప్టెంబర్ 29న నిర్వహించిన ద్రవ్యసమీక్షలో అనూహ్యంగా రెపో, రివర్స్ రెపోలను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈసారి విరామం ప్రకటించింది.

12/02/2015 - 06:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జర్మనీ ఆటోరంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్ దేశీయంగా భారీ స్థాయిలో వాహనాలను రీకాల్ చేయనుంది. నిబంధనలను ఉల్లంఘించి కాలుష్య ప్రమాణాల్లో తిరస్కరించబడిన ఉత్పత్తులతో రూపొందిన డీజిల్ ఇంజిన్లను వాడినట్లు ప్రభుత్వ ఆదేశిత విచారణలో తేలడంతో 3.23 లక్షల వాహనాలను వెనక్కి తీసుకుంటోంది.

12/02/2015 - 06:25

విజయవాడ, డిసెంబర్ 1: ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ అధికారులు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సిగరెట్ షాపులపై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 35 రకాల విదేశీ బ్రాండెడ్ సిగరెట్లను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.

12/02/2015 - 06:25

హైదరాబాద్/కొత్తగూడెం/గోదా వరిఖని, డిసెంబర్ 1: ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్‌తో ముగిసిన మొదటి 8నెలల్లో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి సంస్థ తన చరిత్రలోనే అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపులో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

Pages