S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/13/2016 - 05:50

న్యూఢిల్లీ, జూన్ 12: ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్ష సమాచారం, అంతర్జాతీయ పరిణామాలు కూడా ముఖ్యమేనని చెబుతున్నారు. ‘కీలకమైన అంతర్జాతీయ పరిణామాలు, వర్షాల ప్రగతి సమాచారం ఈ వారం మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయి.

06/13/2016 - 05:48

విశాఖపట్నం, జూన్ 12: పర్యాటకంగా విస్తృత స్థాయిలో దేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశీ దర్శన్’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పర్యాటక రంగానికి ప్రత్యేకించి నిధులు కేటాయిస్తున్నారు.

06/12/2016 - 03:21

న్యూఢిల్లీ, జూన్ 11: దేశీయ ప్రముఖ ఔషధరంగ సంస్థ, హైదరాబాద్ ఆధారిత డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. అమెరికాలో ఎనిమిది అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ల (ఎఎన్‌డిఎ)ను కొనుగోలు చేస్తోంది. నగదు రూపంలో జరిగే ఈ లావాదేవీ కోసం దాదాపు 2,300 కోట్ల రూపాయల (350 మిలియన్ డాలర్లు)ను వెచ్చిస్తోంది. ఈ మేరకు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ శనివారం ఓ ప్రకటనలో తెలియజేసింది.

06/12/2016 - 03:20

న్యూఢిల్లీ, జూన్ 11: తపాలా శాఖ త్వరలో ఆరంభించే పేమెంట్స్ బ్యాంక్ శాఖలు దేశంలోని అన్ని ప్రధాన జిల్లాల్లో ఉంటాయని కేంద్ర టెలికామ్, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌కల్లా 650 శాఖలను ఏర్పాటు చేయాలని తపాలా శాఖ యోచిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని అన్ని ప్రధాన జిల్లా కేంద్రాల్లో శాఖలు ఏర్పాటవుతాయని ప్రసాద్ చెప్పారు. 800 కోట్ల రూపాయల పెట్టుబడితో తపాలా శాఖ..

06/12/2016 - 03:20

న్యూఢిల్లీ/టోక్యో, జూన్ 11: మారుతున్న వ్యాపార ఆలోచనలు.. సాగుబడి విధానాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. రవాణాకు అనువైనట్లుగా పంట రూపురేఖలను మార్చేస్తున్నారు మరి. విదేశాల్లో ముఖ్యంగా జపాన్‌లో వివిధ రకాల పండ్లు, కూరగాయలను అనేక ఆకృతుల్లో పండించి ఔరా అనిపిస్తున్నారు అక్కడి వ్యవసాయ శాస్తవ్రేత్తలు, రైతులు. ఏదైనా పండు, కూరగాయల పేరు చేబితే టక్కున దాని రూపం మన మదిలో మెదులుతుంది.

06/12/2016 - 03:16

హైదరాబాద్, జూన్ 11: కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్‌టిపిసికి మెర్రీగో రౌండ్ రైలు మార్గం ద్వారా మరో 35 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసేందుకుగానూ ఒప్పందం జరిగింది. సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త సమక్షంలో ఎన్‌టిపిసి, సింగరేణి, రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

06/12/2016 - 03:12

న్యూఢిల్లీ, జూన్ 11: విమాన ప్రయాణ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులను ప్రతిపాదించింది. ప్రయాణీకులకు ఊరటనిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలను శనివారం ఇక్కడ పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఓ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. భారత్‌కు చెందిన విమానయాన సంస్థలు నడిపే దేశ, విదేశీ విమాన సర్వీసులకు మార్పులు వర్తిస్తాయని ప్రకటించారు.

,
06/12/2016 - 03:07

ముంబయి, జూన్ 11: ‘కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్’గా వెలుగొందిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్యాడ్ టైమ్స్ మొదలయ్యాయి. దేశీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాకు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నుంచి దెబ్బ పడింది.

06/12/2016 - 03:03

ముంబయి, జూన్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం నష్టాలపాలయ్యాయి. వరుసగా రెండు వారాలపాటు లాభాల్లో కొనసాగిన సూచీలు గడచిన వారం మాత్రం నిరాశపరిచాయి. అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య మదుపరుల ఊగిసలాటతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 207.28 పాయింట్లు క్షీణించి 26,635.75 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 8,200 స్థాయికి దిగువన 50.75 పాయింట్లు పడిపోయి 8,170.05 వద్ద నిలిచింది.

06/11/2016 - 07:53

వాషింగ్టన్, జూన్ 10: అన్ని విధాలుగా సులువైన కోళ్లను పెంచడం, వాటి ఉత్పత్తుల్ని విక్రయించడం ద్వారానే పేదరికం పోతుంది తప్ప కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌తో కాదని మైక్రోసాఫ్ట్ అధినేత. ప్రపంచ శ్రీమంతుల్లో ఒకరైన బిల్ గేట్స్ అన్నారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు కోళ్ల పెంపకం వల్ల ఆర్థిక సాధికారికత లభిస్తుందని, తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం ఉంటుందని చెప్పారు.

Pages