S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/11/2016 - 07:46

న్యూఢిల్లీ, జూన్ 10: తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల పేలవ ప్రదర్శనతో ప్రారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) ఈ ఏప్రిల్ నెలలో మైనస్‌లోకి పడిపోయింది. -0.8 శాతంగా నమోదైందని కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. నిరుడు ఏప్రిల్‌లో 3 శాతం వృద్ధిని కనబరిచిన ఐఐపి.. ఈసారి మాత్రం నిరాశపరిచింది. కాగా, ఈ మూడు నెలల్లో ఇది తొలి క్షీణతవగా, ఫిబ్రవరిలో దాదాపు 2 శాతం వృద్ధిని కనబరిచింది.

06/11/2016 - 07:46

న్యూఢిల్లీ, జూన్ 10: త్వరలో ప్రారంభించబోయే పేమెంట్స్ బ్యాంక్ లోగో కోసం తపాలా శాఖ అనే్వషణాత్మక పోటీని ప్రారంభించింది. శుక్రవారం మొదలైన ఈ పోటీలో తపాలా శాఖ మెచ్చిన లోగోను అందించినవారికి 50,000 రూపాయల నగదు బహుమతి కూడా లభించనుంది.

06/11/2016 - 07:45

మదనపల్లె, జూన్ 10: చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు పరుగులు పెడుతున్నాయ. శుక్రవారం టమోటా కిలో ధర 68 రూపాయల నుంచి 73 రూపాయల వరకు పలికింది. బహిరంగ మార్కెట్‌లోనైతే కిలో ధర 80 రూపాయలకు చేరింది. మరోవైపు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒడిశా, మహారాష్ట్ర, ఢిల్లీ, పుదుచ్చేరి, పాండిచ్చేరి రాష్ట్రాలకు మదనపల్లె మార్కెట్ నుంచి టమోటాలు ఎగుమతి అవుతున్నాయి.

06/11/2016 - 07:44

హైదరాబాద్, జూన్ 10: దేశంలోని లక్షలాది మంది పొగాకు రైతులకు ఊరట కలిగించే విధంగా ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను కేంద్రం నిషేధిస్తూ తీసుకున్న చర్యలను అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య స్వాగతించింది. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి మురళి బాబు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

06/10/2016 - 07:13

ముంబయి, జూన్ 9: పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు(ఐఐపి) వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఇటీవల అంచనాలకు మించి లాభాలు ఆర్జించిన కంపెనీల స్టాక్స్‌లో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు దిగడంతో గత రెండు రోజులుగా లాభాల బాటలో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి నష్టాల్లో ముగిశాయి.

06/10/2016 - 07:13

న్యూఢిల్లీ, జూన్ 9: ప్రైవేటు విమానయాన సంస్థలు చార్జీలను ఏకపక్షంగా పెంచేస్తున్నాయంటూ ప్రయాణికులనుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విమాన చార్జీలను కట్టడి చేసే యోచచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసినట్లయితే ప్రైవేటు విమాన సంస్థల మధ్య పోటీ ఉండదని కూడా వాదిస్తోంది.

06/10/2016 - 07:11

న్యూఢిల్లీ, జూన్ 9: చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన సహారా ఇండియానుంచి తమకు రావలసిన సొమ్మును రాబట్టడానికి ఇప్పటికే ఆ సంస్థకు చెందిన సుమారు 1200 కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మకానికి పెట్టిన సెబి మరో రూ. 1900 కోట్ల విలువైన 16 ఆస్తులను వచ్చేనెల అమ్మకానికి సిద్ధం చేసింది. దీంతో ఇప్పటివరకు అమ్మకానికి పెట్టిన సహారా ఆస్తుల విలువ 3,100 కోట్లకు చేరుకుంది.

06/10/2016 - 07:10

చిత్తూరు, జూన్ 9: చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వస్తోంది. వ్యాపారులు రింగ్ అవుతూ రోజుకో ధర నిర్ణయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో మంచి ధరలు వస్తాయని ఆశించిన రైతులకు ఆశించినంత స్థాయిలో ధరలు దక్కక పోవడంతో నష్టాలకు గురికావాల్సి వస్తోంది.

06/10/2016 - 07:08

న్యూఢిల్లీ, జూన్ 9: పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై సంపూర్ణ నిషేధం విధించాలని డిఐపిపి (పారిశ్రామిక విధాన, అభివృద్ధి విభాగం) చేసిన ప్రతిపాదన పట్ల నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది.

06/10/2016 - 07:07

న్యూఢిల్లీ, జూన్ 9: దేశంలో గత నెల ప్యాసింజర్ కార్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది మే నెలలో దేశ వ్యాప్తంగా 1,60,371 ప్యాసింజర్ కార్ల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది మే నెలలో ఈ అమ్మకాలు 1,58,996 యూనిట్లకు తగ్గాయి. భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం (సియామ్) గరువారం విడుదల చేసిన తజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

Pages