S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/05/2016 - 07:00

కోల్‌కతా, జూన్ 4: కాలుష్య ఉద్గారాల నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో జర్మనీ ఆటోరంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్.. భారత్‌లో 1.9 లక్షల కార్లను రీకాల్ చేయనుంది. జూలై నుంచి ఈ రీకాల్ మొదలవుతుంది. కాలుష్య ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను ఈ కార్లలో బిగించనుంది ఫోక్స్‌వాగన్. ఈ రీకాల్ స్వచ్చంధంగా జరుగుతోందని ఫోక్స్‌వాగన్ ఇండియా మార్కెటింగ్ అధిపతి కమల్ బసు పిటిఐకి తెలిపారు.

06/04/2016 - 08:01

న్యూఢిల్లీ, జూన్ 3: హౌజింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సికి చెందిన జీవిత బీమాయేతర సంస్థ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో.. ఎల్‌అండ్‌టి జనరల్ ఇన్సూరెన్స్‌ను సొంతం చేసుకుంటోంది. మొత్తం నగదు లావాదేవీల్లో జరిగే ఈ కొనుగోలులో 551 కోట్ల రూపాయలకు ఎల్‌అండ్‌టి జనరల్ ఇన్సూరెన్స్.. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హస్తగతమవనుంది. ‘బీమా వ్యాపారంలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రంగంలో ఏకీకరణలు అనివార్యం.

06/04/2016 - 07:58

న్యూఢిల్లీ, జూన్ 3: వంటగ్యాస్ (ఎల్‌పిజి) వినియోగదారులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కొత్తగా 10 వేల మంది పంపిణీదారులను నియమించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది ఎల్‌పిజి పంపిణీదారులున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌పిజి పంపిణీదారుల సంఖ్య సుమారు 26 వేలకు చేరనుందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

06/04/2016 - 07:57

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరాని (2015-16)కి సంబంధించి అత్యధికంగా వాణిజ్య పన్ను చెల్లించిన సంస్థల జాబితాను వాణిజ్య పన్నుల శాఖ శుక్రవారం విడుదల చేసింది. అత్యధిక పన్ను చెల్లించిన జాబితాలో తయారీ రంగం నుంచి ఐటిసి లిమిటెడ్, హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్, హిందుస్తాన్ కోకకోలా బేవరెజస్, ఏషియన్ పేయంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ ఉన్నాయి.

06/04/2016 - 07:57

న్యూయార్క్, జూన్ 3: అమెరికాలో మరోసారి భారీగా కార్ల రీకాల్‌కు ఆటోరంగ సంస్థలు పిలుపునిచ్చాయి. దాదాపు 25 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ఆరు అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి. ఎయిర్ బ్యాగుల్లో లోపాల కారణంగానే ఈ రీకాల్‌కు దిగుతున్నట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

06/04/2016 - 07:55

ముంబయి, జూన్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఎక్కడివక్కడే ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో చివరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ అతి స్వల్పంగా 0.11 పాయింట్లు తగ్గి 26,792.07 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం స్వల్పంగా 1.85 పాయింట్లు పెరిగి 8,220.80 వద్ద నిలిచింది.

06/04/2016 - 07:55

ముంబయి, జూన్ 3: గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో బ్యాంకుల ఆర్థిక ఫలితాలు ఎంత పేలవంగా నమోదయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వరంగ బ్యాంకులైతే నష్టాల్లో సరికొత్త రికార్డులు సృష్టించాయి. కొన్నైతే వేల కోట్ల రూపాయల నష్టాలను ప్రకటించాయి. దీనంతటికీ కారణం మొండి బకాయిలే (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ).

06/04/2016 - 07:54

న్యూఢిల్లీ, జూన్ 3: మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది బ్యాంకర్ల పరిస్థితి. ఇప్పటికే విజయ్ మాల్యా వంటి బడా కార్పొరేట్ల మొండి బకాయిలతో తలబొప్పి కట్టించుకున్న బ్యాంకులకు ఇప్పుడు జేపీ గ్రూప్ సంస్థలు మరింత తలపోటులా మారాయి. 4,460 కోట్ల రూపాయల రుణాలు, చెల్లింపులపై ఈ సంస్థలు విఫలమయ్యాయి మరి.

06/03/2016 - 06:36

ముంబయి, జూన్ 2: గురువారం లావాదేవీల ప్రారంభంనుంచి దాదాపు చివరిదాకా ఆటుపోట్లతో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చివరి గంటలో భారీగా పుంజుకోవడంతో సెనె్సక్స్ 129 పాయింట్లు లానపడగా, నిఫ్టీ 8,200 పాయింట్లను దాటిపోయింది. ఐరోపా మార్కెట్లు ప్రారంభంలోనే లాభాలతో మొదలు కావడంతో మదుపరులు భారీ ఎత్తున కొనుగోళ్లు జరిపారు. దీంతో లోహాలు, పిఎస్‌యు, బ్యాంకింగ్ రంగాలకు చెందిన స్టాక్స్ మెరిశాయి.

06/03/2016 - 06:34

కొత్తగూడెం, జూన్ 2: సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి ప్రచండభానుడి ప్రతాపంతో ఆటంకం ఏర్పడింది. ఏప్రిల్, మే రెండుమాసాలలో 90శాతం ఉత్పాదకరేటును మాత్రమే సంస్థ సాధించగలిగింది. రెండుమాసాలలో ఒకకోటి 4లక్షల 28వేల టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 93లక్షల 49వేల 605 టన్నులు సాధించి 90శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకుంది.

Pages