S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/02/2016 - 08:26

న్యూఢిల్లీ, జూన్ 1: ఐరోపాలోని లాంగ్ స్టీల్ వ్యాపార అమ్మకం పూర్తయినట్లు టాటా స్టీల్ బుధవారం ప్రకటించింది. స్కన్‌థోర్ప్ ప్లాంట్‌తోసహా మొత్తం టాటా స్టీల్ యుకె బిజినెస్‌ను గ్రేబుల్ క్యాపిటల్ ఎల్‌ఎల్‌పికి అమ్మేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఏళ్ల తరబడిగా నష్టాల్లో నడుస్తున్న టాటా స్టీల్ బ్రిటన్ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు ఈ ఏడాది మార్చిలో టాటా గ్రూప్ ప్రకటించినది తెలిసిందే.

06/02/2016 - 08:24

హైదరాబాద్, జూన్ 1: అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్.. సిలికాన్ వ్యాలీలో రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ముందుగా పాలికామ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కెటిఆర్ సందర్శించినట్లు బుధవారం విడుదలైన ఓ ప్రకటన తెలియజేసింది.

06/02/2016 - 08:22

విశాఖపట్నం, జూన్ 1: ఇప్పటి వరకూ సేంద్రియ వ్యవసాయం, కూరగాయల గురించి మాత్రమే విన్నాం. ఇక సేంద్రియ రొయ్యలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. విదేశాల్లో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపెడా) సేంద్రియ ఆక్వా కల్చర్‌పై దృష్టి సారించింది.

06/02/2016 - 08:21

న్యూఢిల్లీ, జూన్ 1: కొరియా టెక్నాలజీ దిగ్గజం ఎల్‌జి బుధవారం దేశీయ మార్కెట్‌కు మూడు కెమెరాలున్న స్మార్ట్ఫోన్‌ను పరిచయం చేసింది. జి5 పేరుతో వచ్చిన దీన్ని గుర్గావ్‌లో ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండి కిమ్ కి వాన్ ఆవిష్కరించారు. దీని ధర 52,990 రూపాయలు.

06/01/2016 - 01:34

టోక్యో, మే 31: నిర్మాణాత్మక సంస్కరణలు చేపడతామని, దేశ జిడిపి వృద్ధిరేటు బలోపేతానికి వౌలిక రంగంపై మరింత శ్రద్ధ వహిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. జపాన్ మదుపరులకు హామీ ఇచ్చారు. ఆరు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా జైట్లీ.. మంగళవారం ఇక్కడ నిక్కీ నిర్వహించిన ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఆసియా’ సదస్సులో పాల్గొన్నారు.

06/01/2016 - 01:29

జిడిపి దూకుడు

06/01/2016 - 01:28

హైదరాబాద్, మే 31: దేశంలో మొదటిసారిగా విండోస్ 10 ల్యాప్‌టాప్ కేవలం 9,999 రూపాయలకే అందుబాటులోకి తెచ్చినట్లు ఐబాల్ డైరెక్టర్, సిఇఒ సందీప్ పరశురాంపూరియా తెలిపారు. అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులకు పేరెన్నికగన్న బ్రాండ్ ఐబాల్.. ఇంటెల్, మైక్రోసాఫ్ట్‌ల భాగస్వామ్యంతో 9,999 రూపాయల తక్కువ ధరకే విండోస్ 10 ల్యాప్‌టాప్‌ను అందిస్తోంది.

06/01/2016 - 01:26

హైదరాబాద్, మే 31: సాఫ్ట్ బ్యాంకు సిఒఒ నికేష్ అరోరాతో తెలంగాణ ఐటిశాఖ మంత్రి కె తారక రామారావు అమెరికాలో మంగళవారం భేటీ అయ్యారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన ప్రయోజనాలను వివరించారు. ఆరోరాతో కెటిఆర్ రెండు గంటల పాటు చర్చలు జరపగా, తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న వివిధ అంశాలపై ఇద్దరు అభిప్రాయాలను పంచుకున్నారు.

06/01/2016 - 01:22

హైదరాబాద్, మే 31: ముప్పిరెడ్డిపల్లిలోగల ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ఏర్పాటు చేసిన నూతన కర్మాగారంలో శాంతా బయోటెక్నిక్స్ వాణిజ్య ఉత్పత్తిని మొదలు పెట్టింది.

06/01/2016 - 01:20

ముంబయి, మే 31: దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని ప్రమాదంలో పడేసిన మొండి బకాయిల సమస్యను ఎదుర్కొనేందుకు ‘బ్యాడ్ బ్యాంక్’ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. అయితే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. ఓ నిరర్థక ఆస్తుల నిధిని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉందన్న వార్తల మధ్య ఈ ‘బ్యాడ్ బ్యాంక్’కు ఎస్‌బిఐ నేతృత్వం వహిస్తుందా?

Pages