S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/01/2016 - 01:17

న్యూఢిల్లీ, మే 31: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్).. ఆఫ్రికా చమురు రిటైల్ వ్యాపారం నుంచి బయటికొచ్చింది. గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్ (గ్యాప్కో)లో ఆర్‌ఐఎల్‌కున్న మొత్తం 76 శాతం వాటాను టోటల్ సంస్థ కొనుగోలు చేస్తోంది. ఆఫ్రికాలో పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ వ్యాపారంలో ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎస్‌ఎ అగ్రశ్రేణిలో ఉంది.

06/01/2016 - 01:14

న్యూఢిల్లీ, మే 31: గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో నిర్దేశిత ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేధించామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ‘2015-16లో ద్రవ్యలోటు జిడిపిలో 3.9 శాతంగా లేదా 5.32 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.’ అని గత ఆర్థిక సంవత్సరానికిగాను ఇక్కడ విడుదల చేసిన గణాంకాల సందర్భంగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సిజిఎ) తెలిపారు.

06/01/2016 - 01:24

విజయవాడ, మే 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 కోట్ల రూపాయల పెట్టుబడితో బ్రేక్స్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి టివిఎస్ గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేసింది. టివిఎస్ గ్రూప్ ప్రతినిధి రామానుజం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలిశా రు. ఈ యూనిట్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని, వౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు.

06/01/2016 - 01:12

ముంబయి, మే 31: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 57.64 పాయింట్లు పడిపోయి 26,667.96 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 18.40 పాయింట్లు దిగజారి 8,160.10 వద్ద నిలిచింది. హెల్త్‌కేర్, ఐటి, టెక్నాలజీ, ఎఫ్‌ఎమ్‌సిజి, చమురు, గ్యాస్, పవర్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల విలువ 1.39 శాతం నుంచి 0.67 శాతం వరకు క్షీణించింది.

06/01/2016 - 01:11

న్యూఢిల్లీ, మే 31: నాలుగో విడత పసిడి బాండ్ల పథకం జూన్ ఆఖర్లో మొదలవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) డిప్యూటి గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ‘నాలుగో దశ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ వచ్చే నెలాఖర్లో మార్కెట్‌లోకి రావచ్చు.’ అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

06/01/2016 - 01:10

న్యూఢిల్లీ, మే 31: క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. దాఖలు చేసే కేసుల పరిష్కారార్థం ఢిల్లీలోనూ ఓ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకానుంది. ఇప్పటికే ముంబయి, కోల్‌కతా, చెన్నైలలో సెబీ ప్రత్యేక కోర్టులుండగా, సకాలంలో, మరింత వేగంగా కేసులను పరిష్కరించేందుకు ఇప్పుడు ఢిల్లీలోనూ మరో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయదలిచామని, ఈ ప్రక్రియను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

05/31/2016 - 07:01

న్యూఢిల్లీ, మే 30: ఏ రంగంలోనైనా కొత్తదనంలో భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారని గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల అన్నారు. భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఆలోచనాపరంగా సత్తాను చాటుతున్నారని పేర్కొన్నారు. ఒకరోజు భారత పర్యటనలో భాగంగా సోమవారం ఇక్కడకు చేరుకున్న నాదెళ్ల..

05/31/2016 - 06:49

న్యూఢిల్లీ, మే 30: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లకు ప్రస్తుతమిస్తున్న మూడేళ్ల ట్యాక్స్ హాలిడేను ఏడేళ్లకు పెంచాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నా రు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తప్పక ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఇక్కడ తన మంత్రిత్వ శాఖ గడచిన రెండేళ్లలో సాధించిన విజయాలను ఆమె విలేఖరులకు వెల్లడించారు.

05/31/2016 - 06:48

పలాస, మే 30: అసలు బంగారంతో తెల్లబంగారంగా పిలిచే జీడిపప్పు ధరలు పోటీ పడుతుండడంతో వ్యాపారులు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జీడిపప్పుకు కేరాఫ్ అడ్రస్‌గా పలాసను చెప్పుకోవచ్చు. పలాస కేంద్రంగా జీడి పరిశ్రమలు ఏర్పడి 100 ఏళ్లు అవుతున్నా ఈ ఏడాదిలాంటి పరిణామాలు గతంలో ఎన్నడూ ఎదురు కాలేదని జీడి పరిశ్రమల యజమానులు అంటున్నారు.

05/31/2016 - 06:47

టోక్యో, మే 30: ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంపై సర్వత్రా ఆందోళనల మధ్య వచ్చే పదేళ్లకుగాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ చోదకశక్తిగా వ్యవహరించనుందని సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ టంగ్ అన్నారు. ‘ప్రపంచ దేశాల ఆశలన్నీ భారత్‌పైనే. పదేళ్ల క్రితం చైనా మాదిరిగానే ఇప్పుడు భారత్ కనిపిస్తోంది.

Pages