S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/31/2016 - 06:47

న్యూఢిల్లీ, మే 30: దేశ జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) లో 7.7 శాతంగా ఉండొచ్చని భారత పారిశ్రామిక సంఘం ఫిక్కీ అంచనా వేసింది. ఈసారి వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాల మధ్య పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో పురోగతి ఉంటుందని పేర్కొంది. అయితే మందగించిన పెట్టుబడుల ప్రవాహం తిరిగి పుంజుకోవడానికి కనీసం మరో ఆరు నెలల సమయమైనా పడుతుందని ఓ సర్వేలో ఫిక్కీ అభిప్రాయపడింది.

05/31/2016 - 06:46

ముంబయి, మే 30: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7.8 శాతం వృద్ధిరేటును నమోదు చేయవచ్చని స్విట్జర్లాండ్ ఆర్థిక సేవల దిగ్గజం క్రెడిట్ సూస్ అంచనా వేసింది. వ్యవసాయం, వినియోగం విషయంలో పురోగతి కనిపిస్తుందని ఓ నివేదికలో పేర్కొంది. అయితే ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్) కంటే, ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో జిడిపి వృద్ధి పుంజుకోవడానికి అవకాశాలున్నాయని చెప్పింది.

05/30/2016 - 07:37

న్యూఢిల్లీ, మే 29: టాటా మోటార్స్, ఎన్‌టిపిసి తదితర దిగ్గజ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, వర్ష సమాచారం ఆధారంగా ఈ వారం మదుపరులు తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మే నెలకు సంబంధించి ఆటోరంగ సంస్థలు విడుదల చేసే అమ్మకాల వివరాలు కూడా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని వారు చెబుతున్నారు.

05/30/2016 - 07:35

టోక్యో, మే 29: భారతీయ వౌలికరంగాభివృద్ధిని జపాన్ మదుపరులు దగ్గరగా గమనిస్తున్నారని, ఈ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారని, భారత్‌లోని వివిధ రంగాల్లో పెట్టుబడులతో వస్తామని చెబుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం జపాన్‌కు చేరిన జైట్లీ.. అక్కడ జపాన్ బహుళవ్యాపారరంగ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ సిఇఒ మసయోషి సన్‌తో సమావేశమయ్యారు.

05/30/2016 - 07:34

న్యూఢిల్లీ, మే 29: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో స్వల్పంగా పెరిగి 4,247.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 4,238.55 కోట్ల రూపాయలుగా ఉంది.

05/30/2016 - 07:33

న్యూఢిల్లీ, మే 29: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వచ్చే నెల 7న జరిపే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే వీలుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో మాత్రం మరో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లు తగ్గేందుకు వీలుందని అభిప్రాయపడింది.

05/30/2016 - 07:33

లక్నో, మే 29: పప్పు్ధన్యాల ధరలు పెరగడానికి కారణం.. గడచిన రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, విదేశాల నుంచి పడిపోయిన పప్పు దిగుమతులేనని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. రిటైల్ మార్కెట్‌లో పప్పు ధరలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో పాశ్వాన్ పైవిధంగా స్పందించారు. ‘పప్పు్ధన్యాల ధరలు పెరగడానికి పలు కారణాలున్నాయి.

05/29/2016 - 03:07

న్యూఢిల్లీ, మే 28: దేశీయ నిర్మాణరంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ నికర రుణాలు ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో మరింతగా పెరిగాయి. ఈ మూడు నెలల్లో దాదాపు 800 కోట్ల రూపాయలు ఎగిశాయి. నిర్మాణ రంగంలో నెలకొన్న మందగమనం మధ్య సంస్థ రుణభారం పెరిగిపోగా, 22,202 కోట్ల రూపాయలకు చేరుకుంది. నిరుడు డిసెంబర్ 31 నాటికి సంస్థ రుణాలు 21,411 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

05/29/2016 - 03:05

ముంబయి, మే 28: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం భారీ లాభాలను అందుకున్నాయి. కొనుగోళ్ల జోరుతో ఈ ఏడాదిలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అసోం అధికార పగ్గాలు తొలిసారిగా బిజెపి చేతికి చిక్కడం, రాబోయే వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి.

05/29/2016 - 02:54

ముంబయి, మే 28: అరవింద్ ఫ్యాషన్ బ్రాండ్స్.. శనివారం ట్రూ బ్లూ పేరిట ఓ ప్రీమియం మెన్స్‌వేర్, యాక్ససరీస్ బ్రాండ్‌ను ప్రారంభించింది. క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ సారథి సచిన్ తెండూల్కర్ భాగస్వామ్యంతో ఈ సరికొత్త బ్రాండ్‌ను అరవింద్ ఫ్యాషన్ ఆవిష్కరించింది. ఈ బ్రాండ్‌కు సంబంధించి రాబోయే ఐదేళ్లలో దాదాపు 30 స్టోర్లను ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది.

Pages