S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/28/2016 - 05:26

బెంగళూరు, మే 27: ప్రభుత్వరంగంలో 8-10 కాంపిటీటివ్ బ్యాంకులు రాబోతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకులున్నాయన్న ఆయన ఈ బ్యాంకుల స్థిరీకరణ ముగిసిన తర్వాత అన్ని రకాలుగా 8-10 పోటీతత్వ బ్యాంకులు రావచ్చని అన్నారు.

05/28/2016 - 05:25

న్యూఢిల్లీ, మే 27: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) నికర లాభం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో ఏకంగా 80 శాతం క్షీణించింది. నిరుడు జనవరి-మార్చిలో 6,285.35 కోట్ల రూపాయలుగా ఉన్న సంస్థ లాభం.. ఈసారి 1,235.64 కోట్ల రూపాయలకు దిగజారింది.

05/27/2016 - 03:27

ముంబయి, మే 26: బుధవారం భారీ లాభాల్లో పరుగులు పెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా అదే ఊపును కొనసాగించాయి. దీంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు ఏడునెలల గరిష్ఠస్థాయి అయిన 26,367 పాయింట్లకు చేరుకుంది.

05/27/2016 - 03:25

న్యూఢిల్లీ, మే 26: ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సరైన దిశలోనే ముందుకు సాగుతోందని, అయితే మోదీ ప్రభుత్వానికి ప్రజలు బలమైన తీర్పు ఇచ్చినప్పటికీ భారత్‌లో సంస్కరణలు, విధాన నిర్ణయాలు పూర్తి సజావుగా ముందుకు సాగడం లేదని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ ‘డిబిఎస్’ పేర్కొంది.

05/27/2016 - 03:25

ముంబయి, మే 26: చైనా తన ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందంటూ చూపిస్తున్న గణాంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా సార్క్ దేశాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరిస్తూ, మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం ద్వారా ఆర్‌బిఐ తీవ్రమైన కరెన్సీ ఆటుపోట్ల ప్రభావాన్ని తగ్గిస్తూ వస్తోందన్నారు.

05/27/2016 - 03:24

నల్లగొండ, మే 26: పత్తి సాగు తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల రైతాంగంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత ప్రభుత్వంపై దాడికి ప్రతిపక్షాల చేతికి అస్త్రంగా మారింది. ఇప్పటికే రుణమాఫీ ప్రహసంగా మారి మాఫీ ప్రయోజనాలు తమకు ఉపయుక్తంగా లేవన్న అసంతృప్తితో ఉన్న రైతులు పత్తి సాగు నియంత్రించాలన్న ప్రభుత్వ యత్నాలపై మరింత అసహనంతో రగిలిపోతున్నారు.

05/27/2016 - 03:23

హైదరాబాద్, మే 26: వచ్చే నెల 3వ తేదీన హైదరాబాద్‌లో ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అమెరికా-్భరత్ మధ్య వాణిజ్య సంబంధాలు అంశంపై జాతీయ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభిస్తారు.

05/27/2016 - 03:23

న్యూఢిల్లీ, మే 29: ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసేవారు(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) ఇకపై సెక్యూరిటీల మార్కెట్లనుంచి నిధులను సమీకరించడానికి కానీ, స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన కంపెనీల బోర్డుల్లో పదవులు చేపట్టడానికి వీలు లేదు. ఈ సవరించిన నిబంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబి నోటిఫై చేసింది.

05/27/2016 - 03:22

న్యూఢిల్లీ, మే 26: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి గురువారం మరోసారి విరుచుకుపడ్డారు. భారత్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ప్రపంచంలోని తన సన్నిహితులకు చేరవేస్తున్నారన్న ఆరోపణతో సహా రాజన్‌పై ఆరు ఆరోపణలు చేసిన స్వామి ఆయనను పదవినుంచి తక్షణమే తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.

05/27/2016 - 03:21

న్యూఢిల్లీ, మే 26: ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ ఈ నెల 30వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఆఫ్రికా ఉత్తర ప్రాంతంలోని మొరాకో, ట్యునీషియా దేశాల్లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, కొత్త రంగాలకు సహకారాన్ని విస్తరించుకునేందుకు అవకాశాలను అనే్వషించడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటనకు వెళ్లనున్నారు.

Pages