S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/05/2016 - 07:11

న్యూఢిల్లీ, మే 4: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జెఎస్‌పిఎల్) ఏకీకృత నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 371 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే వ్యవధిలో నష్టం 519 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 4,874 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 4,558 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది.

05/05/2016 - 07:10

కాకినాడ, మే 4: రాష్ట్రంలోని అన్ని ఓడ రేవుల్లో (పోర్టులు) సరుకుల అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ కస్టమ్స్ కమిషనర్ (ప్రివెంటివ్) ఎస్‌కె రహమాన్ వెల్లడించారు. అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా 68 మంది ప్రత్యేక అధికారులను రాష్టవ్య్రాప్తంగా నియమించామన్నారు. వీరిలో ఒక జాయింట్ కమిషనర్, ఇరువురు సహాయక కమిషనర్లు ఉన్నారని తెలిపారు.

05/05/2016 - 07:09

ముంబయి, మే 4: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులను అమ్మబోయి బొక్కబోర్లా పడుతున్న బ్యాంకర్లు.. పకడ్బందీ ప్రణాళిక దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకసారి కింగ్‌ఫిషర్ హౌస్‌ను విక్రయించాలని ప్రయత్నించి దెబ్బతిన్న నేపథ్యంలో దాని అసలు విలువను సరిగ్గా అంచనా వేసే పనిలో ఇప్పుడు బ్యాంకులు నిమగ్నమయ్యాయి.

05/05/2016 - 07:08

ముంబయి, మే 4: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల పతనానికితోడు బుధవారం కూడా సూచీలు క్షీణించాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 127.97 పాయింట్లు నష్టపోయి 25,101.73 వద్ద ముగియగా, గత నెల ఏప్రిల్ 11 నుంచి గమనిస్తే ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 40.45 పాయింట్లు కోల్పోయి 7,706.55 వద్ద నిలిచింది.

05/05/2016 - 07:08

విశాఖపట్నం, మే 4: కర్మాగారం ఏర్పాటు ద్వారా పర్యావరణంపై ఎటువంటి ప్రభావం ఉండబోదని నిర్ధారించిన తర్వాతే అనుమతులు మంజూరవుతాయని స్టేట్ లెవెల్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ ఎసెస్‌మెంట్ అథారిటీ (ఎస్‌ఇఐఎఎ) ఏషియన్ పెయింట్స్ యాజమాన్యానికి స్పష్టం చేసింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడి వద్ద రూ.

05/04/2016 - 07:34

హైదరాబాద్, మే 3: ఈ నగరానికి ఏమైంది...ఒక పక్క నుసి..మరో పక్క పోగ, ఎవరూ నోరుమెదపరేం...అనే ప్రకటన క్యాన్సర్ వ్యాధికి సంబంధించిందే అయినా కాలుష్యం ముప్పు ఎంత తీవ్రమైందో తేటతెల్లం చేస్తుంది.. ఒకప్పుడు అభివృద్ధి చెంది న దేశాల్లోని మహానగరాల్లో ఉన్న వాయు కాలుష్యం ఇపుడు గ్రేటర్ నగరాలకు, మున్సిపల్ కార్పొరేషన్లకూ వ్యాపిస్తోంది. ఈ క్రమంలో స్వచ్ఛమైన గాలికి కూడా కొరత ఏర్పడింది.

05/04/2016 - 07:32

బీజింగ్, మే 3: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వంటి నిర్మాణాత్మక సంస్కరణలు, భూ, కార్మిక విధానాలు.. భారత వృద్ధిరేటు పురోగతికి అత్యంత కీలకమైనవని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) పేర్కొంది. ‘్భరత వృద్ధి అవకాశాలు బాగున్నాయి. కీలక నిర్మాణాత్మక సంస్కరణల అమలు జరగకున్నా..

05/04/2016 - 07:31

ముంబయి, మే 3: దేశీయ స్టాక్ మార్కెట్లను అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలు దెబ్బతీశాయి. మరోసారి యూరోజోన్ మందగమనానికి ఉన్న అవకాశాలు, చైనా ఉత్పాదక రంగం పనితీరు పేలవంగా ఉందంటూ నమోదైన గణాంకాలు.. సూచీలను నష్టపరిచాయి.

05/04/2016 - 07:30

విశాఖపట్నం, మే 3: తీవ్ర వర్షాభావ పరిస్థితులు విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరాపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. గోదావరి, ఏలేరు రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోవడంతో విశాఖ పరిశ్రమలకు నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. గత రెండు రోజులుగా విశాఖలో ప్రధాన పరిశ్రమలకు విస్కో (విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ) నీటి సరఫరా నిలిపి వేసింది.

05/04/2016 - 07:29

న్యూఢిల్లీ, మే 3: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్లు (రెపో) తగ్గించినా ఆయా బ్యాంకులు మాత్రం ఈ తగ్గింపును సంస్థలు, ఖాతాదారులకు అందజేయటం లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు.

Pages