S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/05/2020 - 23:40

ముంబయి, మార్చి 5: దేశంలోని దాదాపు అన్ని ఆరోగ్య బీమా పాలసీలు కరోనా వైరస్ సహా అన్ని అంటు వ్యాధులను కవర్ చేస్తాయని జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ గురువారం నాడు వెల్లడించింది.

03/05/2020 - 23:39

న్యూఢిల్లీ, మార్చి 5: స్టాక్ మార్కెట్‌లో మోసపూరితమయిన లావాదేవీలకు పాల్పడినందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నాలుగు సంస్థలను రెండేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్‌లో పాల్గొనకుండా నిషేధం విధించింది. శేషసాయి పేపర్ అండ్ బోర్డ్స్ లిమిటెడ్ (ఎస్‌పీబీఎల్) షేర్లలో మోసపూరితంగా భారీ పరిమాణంలో క్రయవిక్రయాలు జరిపినందుకు ఈ నాలుగు సంస్థలపై సెబీ చర్య తీసుకుంది.

03/05/2020 - 23:37

ముంబయి, మార్చి 5: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం సెషన్‌లో ఆర్జించిన మంచి లాభాలను దేశంలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా మదుపరులు ఆచితూచి వ్యవహరించడం తో తరువాత నిలబెట్టుకోలేక పోయాయి. దీంతో స్వల్ప లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 61.13 పాయింట్లు మాత్రమే లాభపడింది.

03/05/2020 - 06:07

న్యూఢిల్లీ: సులభతర వ్యాపారం కోసం కంపెనీల చట్టంలో పెను మార్పులు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. పెద్ద నేరాలకు పాల్పడే వారిని శిక్షించే 35 సెక్షన్‌లను యథాతథంగా ఉంచుతూ కంపౌండింగ్ నేరాల సెక్షన్లలోని జైలు శిక్ష విధించే అంశాన్ని సవరించాలని నిర్ణయించింది.

03/05/2020 - 05:27

న్యూఢిల్లీ, మార్చి 4:పన్ను బకాయిలు చెల్లించే గడువును ఈనెల 31వ తేదీవరకు పెంచే బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 31వ తేదీలోగా పన్ను బకాయిలను చెల్లించడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా 4.83 లక్షల పన్ను బకాయిల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

,
03/04/2020 - 23:45

తడ/వరదాయపాళెం , మార్చి 4: జాతీయ భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని పారిశ్రామిక భద్రతకు పిలుపునిస్తూ శ్రీసిటీ హెచ్‌ఆర్ ఫోరం ఆధ్వర్యంలో శ్రీసిటీలో తలపెట్టిన ఇండస్ట్రియల్ సేఫ్టీ వాకతాన్ 2020 విజయవంతంగా నిర్వహించారు. అత్యధికంగా మహిళా కార్మికులతో భద్రత నినాదాల నడుమ ఎంతో ఉత్సాహంతో ఈ వాకతాన్ నిర్వహించారు.

03/04/2020 - 23:41

ముంబయి, మార్చి 4: కరోనా వైరస్ బుధవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో దేశీయ మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ బుధవారం తీవ్ర అనిశ్చితిలో కొనసాగి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 214 పాయింట్ల దిగువన ముగిసింది.

03/04/2020 - 23:38

న్యూఢిల్లీ, మార్చి 4: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను తగ్గించే అంశాన్ని పరిశీలించవలసిన అవసరం ఉందని ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నివేదిక పేర్కొంది. రుణాల వృద్ధిని తిరిగి పెంచడానికి ఆర్‌బీఐ తన వంతుగా ప్రస్తుత ప్రాధాన్యతలను వెల్లడించిందని ఐడీఎఫ్‌సీ ‘కరోనా వైరస్, వెల్లడయిన ప్రాధాన్యతలు’ అనే తన నివేదికలో పేర్కొంది.

03/03/2020 - 23:48

ముంబయి, మార్చి 3: అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శించిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు గత ఎనిమిది రోజుల లావాదేవీల్లో ఎదుర్కొంటున్న నష్టాలకు మంగళవారం తెరపడింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెన్సెక్స్ 479.68 పాయింట్లు మెరుగుపడి, 38,523.70 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 170.55 పాయింట్లు లాభపడి, 11,303.30 పాయింట్లకు చేరుకుంది.

03/03/2020 - 05:00

న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్‌లో తాము ప్రవేశపెట్టిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం ఆదాయం పన్ను కేసుల పరిష్కారానికి ఎంతగానో తోడ్పడుతోందని, సమయంతోపాటు డబ్బూ ఆదా అవుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. ముఖ్యంగా ప్రత్యక్ష పన్నుల వివాదాల పరిష్కారానికి ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తోందని అన్నారు.

Pages