S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/17/2016 - 07:38

హైదరాబాద్, మే 16: జాతీయ స్థాయి రెండు సంస్థలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు నామినేట్ అయ్యారు. జియో సైన్స్ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుడిగా ప్రొఫెసర్ జయానంద్ నియమితులయ్యారు. ఈ సలహా మండలి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అదే విధంగా సిఐఐ స్టేట్ కౌన్సిల్‌లో సభ్యుడిగా సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ వెంకటరమణ నామినేట్ అయ్యారు.

05/17/2016 - 07:37

హైదరాబాద్, మే 16: రోడ్లపై లేదా ఎక్కడైనా ఎటువంటి ప్రమాదం జరిగినా కుయ్, కుయ్‌మంటూ దూసుకెళ్ళే 108 వాహనాల సిబ్బంది పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడేందుకు 24 గంటలూ అందుబాటులో ఉంటున్న ఉద్యోగుల వెతలు చెప్పలేనంతగా ఉన్నాయి. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ గగనమైపోతోంది. ఇంటి అద్దెలు, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన ఈ రోజుల్లో 10 వేల లోపు జీతాలతో కాలం వెల్లదీస్తున్నారు మరి.

05/17/2016 - 07:35

హైదరాబాద్, మే 16: ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కీలక పథకాలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. గాయత్రీ పథకం, వశిష్ట పథకం, గరుడ పథకం పేరిట మూడు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

05/16/2016 - 07:04

న్యూఢిల్లీ, మే 15: ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ప్రకటించే త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం గణాంకాలతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

05/16/2016 - 07:02

న్యూఢిల్లీ, మే 15: మారిషస్‌తో పన్ను ఒప్పందాల సవరణ నేపథ్యంలో భారత్‌లో డబ్బు సంపాదించాలంటే మదుపరులు తప్పక పన్ను చెల్లించాల్సిందేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. కాగా, మారిషస్ ద్వారా భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపై పన్ను విధించడం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) తగ్గిపోతాయన్న వాదనను జైట్లీ కొట్టిపారేశారు.

05/16/2016 - 07:00

ముంబయి, మే 15: ఈ ఏడాది ఆరంభం నుంచి ఏప్రిల్ వరకు దేశీయ ప్రధాన స్టాక్ మార్కెట్ల టర్నోవర్ 43 శాతం క్షీణించింది. తొలి నాలుగు నెలల్లో 15.95 లక్షల కోట్ల రూపాయలకే పరిమితమైంది. నిరుడు ఇదే నాలుగు నెలల్లో 28.02 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ నమోదవడం గమనార్హం. దేశంలోని ప్రధాన స్టాక్ మార్కెట్లైన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్, ఎమ్‌సిఎక్స్-ఎస్‌ఎక్స్‌ల టర్నోవర్ వివరాలను పరిశీలిస్తే..

05/16/2016 - 07:00

కోయంబత్తూర్, మే 15: తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ నష్టాల నుంచి తిరిగి లాభాల్లోకి చేరుకుందని టెలికామ్ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. గత యుపిఎ హయాంలో బిఎస్‌ఎన్‌ఎల్ దాదాపు 8,000 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిందని, 2004లో తమ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే సమయంలో 10,000 కోట్ల రూపాయల లాభాల్లో ఉందని గుర్తుచేశారు.

05/16/2016 - 06:59

హైదరాబాద్, మే 15: ఈక్విటీ మార్కెట్‌లో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 6,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను పెట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. అయితే ఈ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ట్రస్టీస్ తర్వాతి సమావేశంలో ఈ నిర్ణయం వెలువడుతుందన్నారు.

05/16/2016 - 06:58

ముంబయి, మే 15: రుణ పీడిత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) పట్టు బిగిస్తోంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ఉన్నతోద్యోగుల ఆర్థిక లావాదేవీల వివరాలను తెలియపరచాలని దాదాపు ఆరు బ్యాంకులకు ఇడి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం.

05/16/2016 - 06:58

న్యూఢిల్లీ, మే 15: సుప్రీం కోర్టు సూచనల నేపథ్యంలో బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ)పై త్వరలో ఓ కమిటీని వేయనుంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. మొండి బకాయిలకు సంబంధించిన అన్ని అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుందన్నారు.

Pages