S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/22/2016 - 07:40

ముంబయి, ఏప్రిల్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 36.20 పాయింట్లు పుంజుకుని 25,880.38 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా 2.70 పాయింట్లు కోల్పోయి 7,912.05 వద్ద నిలిచింది. ఉదయం ఆరంభంలో భారీ లాభాల్లోనే కదలాడిన సూచీలు మార్కెట్లు ముగిసే సమయానికి మాత్రం డీలాపడ్డాయి.

04/22/2016 - 07:39

లండన్, ఏప్రిల్ 21: బ్రిటన్‌లోని టాటా స్టీల్ వ్యాపారంలో 25 శాతాన్ని కొనుగోలు చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే టాటా స్టీల్.. నష్టాల ఊబిలో కూరుకుపోయినది తెలిసిందే. ఈ క్రమంలో టాటా స్టీల్ ప్లాంట్ల కొనుగోలుకు ముందుకొచ్చేవారికి చేయూతనిచ్చేలా 25 శాతం వాటాను కొనుగోలు చేస్తామని బ్రిటీష్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

04/22/2016 - 07:38

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 21: విదేశీ జీడిపప్పు స్వదేశీ మార్కెట్‌ను ముంచెత్తుతోంది. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో స్వదేశీ అవసరాలకు విదేశాల నుండి పెద్దయెత్తున జీడిపప్పు దిగుమతి అవుతోంది. విదేశీ జీడిపప్పుతో అవసరాలు తీరుతున్నా స్వయం సమృద్ధికి మాత్రం విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో జీడిమామిడి తోటలు అంతరించిపోతున్నాయి. పంట భూములు కోస్తా జిల్లాల్లో రియల్ ఎస్టేట్లుగా రూపాంతరం చెందుతున్నాయి.

04/21/2016 - 10:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తమ టవర్ విభాగం ఇన్‌ఫ్రాటెల్‌లో 5 శాతం వాటాను ఓ బహిరంగ మార్కెట్ వాణిజ్య ఒప్పందం ద్వారా అమ్మాలని చూస్తోంది. ఈ మేరకు సంస్థ సన్నిహిత వర్గాల అందిస్తున్న సమాచారం. ఈ అమ్మకం ద్వారా ఎయిర్‌టెల్‌కు దాదాపు 3,500 కోట్ల రూపాయల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు నిధులు దక్కనున్నాయి. ఇన్‌ఫ్రాటెల్‌లో ఎయిర్‌టెల్‌కు 71.70 శాతం వాటా ఉంది.

04/21/2016 - 10:06

హోస్టన్, ఏప్రిల్ 20: మైక్రోప్రాసెసర్ తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ఇంటెల్.. భారీగా ఉద్యోగులను తొలగించనుంది. దాదాపు 12,000 మంది ఉద్యోగులను తీసేసేందుకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇంటెల్ ఉద్యోగుల సంఖ్య 1,07,300గా ఉంది. కాగా, ఈ సంఖ్యలో సుమారు 11 శాతం మందిని 2017 మధ్య నాటికి తొలగించాలని ఇంటెల్ భావిస్తోంది.

04/21/2016 - 10:06

పుణె, ఏప్రిల్ 20: భారత ఆర్థిక వ్యవస్థ బలంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

04/21/2016 - 10:04

బెంగళూరు, ఏప్రిల్ 20: దేశీయ ఐటిరంగంలో మూడో అతిపెద్ద సంస్థ విప్రో ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 1.6 శాతం పడిపోయింది. 2,235 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 2,272 కోట్ల రూపాయల లాభాన్ని విప్రో అందుకుంది.

04/21/2016 - 10:03

న్యూయార్క్, ఏప్రిల్ 20: తీసుకున్న రుణాలను ఏ వ్యక్తీ లేదా సంస్థ ఎగవేసి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా 17 బ్యాంకుల నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరిట 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలు తీసుకుని, లండన్‌కు గుట్టుచప్పుడు కాకుండా చేరుకున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

04/21/2016 - 10:02

నల్లగొండ, ఏప్రిల్ 20: రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు నల్లగొండ జిల్లాలో సమస్యాత్మకంగా మారా య. ధాన్యం కొనుగోలు సజావుగా సాగక, కొనుగోలు జరిగిన ధాన్యానికి సకాలంలో డబ్బులు రాక రైతు లు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. రైతుకు 48 గంటల్లోగా ఆన్‌లైన్ ద్వారా ధాన్యం డబ్బులు చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు ఆచరణలో విఫలమ య్యాయ.

04/21/2016 - 10:02

కాకినాడ, ఏప్రిల్ 20: రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు కోనసీమ కొబ్బరికాయలను ఎగుమతి చేసేందుకు మార్కెటింగ్ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. కొబ్బరికాయలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కోనసీమ కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది.

Pages