S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/10/2016 - 01:21

హైదరాబాద్, మే 9: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాపై దాఖలైన చెక్ బౌన్స్ కేసులో విచారణను సోమవారం హైదరాబాద్ సిటీ 3వ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో వారెంట్ జారీ చేసినా కోర్టు విచారణకు మాల్యా హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

05/10/2016 - 01:21

హైదరాబాద్, మే 9: వ్యవసాయ ఆర్గానిక్ ఉత్పత్తుల విభాగంలో నానో టెక్నాలజీని పరిచయం చేసిన తొలి సంస్థ జియోలైఫ్ అగ్రిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. సోమవారం నూతన శ్రేణి, అత్యున్నత ప్రతిభ కనబర్చే బయోలాజికల్ ఉత్పత్తులను ఆవిష్కరించింది.

05/10/2016 - 01:20

హైదరాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారుల కోసం కల్పించిన ఆన్‌లైన్ విధానాన్ని ఎవరైనా వ్యాపారవేత్తలు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ వి అనిల్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, రిజిస్ట్రేన్లను ఒకే రోజులో చేస్తున్నామని గుర్తు చేశారు.

05/09/2016 - 08:03

న్యూఢిల్లీ, మే 8: వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ), అలాగే పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలులు లాంటి కీలకమైన ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం దేశీయ మార్కెట్ల గతిని నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు. తదుపరి విడత నాలుగో త్రైమాసికం ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అలాగే అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌లు ఈ వారం మార్కెట్ తీరును నిర్ణయించనున్నాయి.

05/09/2016 - 08:01

న్యూఢిల్లీ, మే 8: నిలకడయిన ఆర్థికాభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ఆలోచనలు ప్రారంభించడానికి మోదీ ప్రభుత్వానికి సమయం మించి పోతోందని ప్రముఖ ఆర్థికవేత్త ఇలా పట్నాయక్ హెచ్చరిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మూల సమస్యలను పరిష్కరించే గణనీయమైన సంస్కరణల కార్యక్రమమేదీ ఇప్పటివరకు కనిపించడం లేదని అన్నారు. ఇప్పుడు కొన్ని ప్రయత్నాలయితే జరుగుతున్నాయి.. అయితే చివరి రెండేళ్లలో మరిన్ని చర్యలు అవసరం.

05/09/2016 - 07:55

న్యూఢిల్లీ, మే 8: చిన్న తరహా వ్యాపార సంస్థలు, వృత్తినిపుణులు, పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ దేశంలో అభివృద్ధిని, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు రెవెన్యూ విభాగం చేపట్టిన వివిధ చర్యలను కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వివరించింది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80-సి కింద వార్షిక పన్ను మినహాయింపు పరిమితిని లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని ఆర్థిక శాఖ ఒక స్పష్టం చేసింది.

05/09/2016 - 07:54

న్యూఢిల్లీ, మే 8: దేశంలోని వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్ల రుణాలను ఉద్ధేశ్యపూర్వకంగా ఎగ్గొట్టి విదేశానికి పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తమ దర్యాప్తు పరిధిని మరింత పెంచింది.

05/09/2016 - 07:53

న్యూఢిల్లీ, మే 8: గత వారం అత్యంత విలువైన టాప్-10 భారతీయ కంపెనీల్లో తొమ్మిది కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.47,932.69 కోట్ల మేర తగ్గిపోయింది. ఇందులో అత్యధికంగా కోల్పోయిన ఐటి దిగ్గజం టిసిఎస్ అగ్రస్థానంలో ఉంది. ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ 11,408.78 కోట్లు తగ్గిపోయి 4,87, 119.34 కోట్లకు చేరుకుంది.

05/08/2016 - 04:15

నోయిడా, మే 7: బడా సంస్థల్లో భారీగా ఫీజులు చెల్లించి పనికిమాలిన డిగ్రీలను తీసుకుని విద్యార్థులు నష్టపోతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. శనివారం ఇక్కడ శివ్‌నాడర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజన్..

05/08/2016 - 04:14

న్యూఢిల్లీ, మే 7: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రిత వ్యవస్థ సెబీ.. మదుపరుల నుంచి సేకరించిన సొమ్మును తిరిగి చెల్లించాలంటూ స్వర్ గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలను ఆదేశించింది. అక్రమ పెట్టుబడుల పథకాల ద్వారా కోటిన్నర వరకు నిధులను స్వర్ అగ్రోటెక్ ఇండియా, స్వర్ అగ్రోటెక్ అండ్ హౌసింగ్ (ఇండియా) సంస్థలు సమీకరించాయి. దీంతో ఆ నిధులను తిరిగి మదుపరులకు మూడు నెలల్లో ఇచ్చేయాలని సెబీ ఆదేశించింది.

Pages