S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/21/2016 - 06:25

హైదరాబాద్, జనవరి 20: ప్రముఖ విదేశీ ఆటోరంగ సంస్థ ఫోర్డ్.. హైదరాబాద్‌లో బుధవారం తమ కొత్త కారును ఆవిష్కరించింది. సరికొత్త ఎండీవర్ ఎస్‌యువి కారును పరిచయం చేసింది. రెండు రకాల శక్తివంతమైన, ఇంధన పొదుపు సామర్థ్యం కలిగిన ఇంజిన్లతో ఎండీవర్‌ను డిజైన్ చేసినట్లు ఈ సందర్భంగా ఫోర్డ్ తెలియజేసింది. 2.2 లీటర్, 3.2 లీటర్ ఇంజిన్లతో ఇవి అందుబాటులో ఉంటాయని వివరించింది.

01/21/2016 - 08:12

రాజమహేంద్రవరం, జనవరి 20: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసి.. రాజమహేంద్రవరం పరిసరాల్లోగల చమురు, సహజవాయువు నిక్షేపాలను కనుగొనడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. కొత్త నిక్షేపాలను కనుగొనడానికి ప్రస్తుతం జరుగుతున్న అనే్వషణ కార్యక్రమాల్లో వేగం పెంచేందుకు ఇప్పుడున్న ఏర్పాట్లను రెట్టింపు చేయాలని ఒఎన్‌జిసి భావిస్తోంది.

01/21/2016 - 06:22

హైదరాబాద్, జనవరి 20: సింగరేణి ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు సింగరేణిలోని అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ సిఎండి ఎన్ శ్రీధర్ తెలిపారు. ఒక్కో ప్రాంతంలో రెండు రోజులపాటు మేళా జరుగుతుందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

01/21/2016 - 06:21

ముంబయి, జనవరి 20: ప్రపంచ వృద్ధిరేటుపై నెలకొన్న ఆందోళనలు బుధవారం భారతీయ స్టాక్ మార్కెట్లను భారీ నష్టాలకు గురిచేశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ ఉదయం ప్రారంభం నుంచే నష్టాల్లో కదలాడాయి. చివరిదాకా ఇదే తీరు కొనసాగగా, ఒకానొక దశలో సెనె్సక్స్ దాదాపు 650 పాయింట్లు, నిఫ్టీ సుమారు 200 పాయింట్లు క్షీణించాయి.

01/20/2016 - 07:27

వాషింగ్టన్, జనవరి 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16) గాను భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) యథాతథంగానే ఉంచింది. ఇంతకుముందు వేసినట్లుగానే 7.3 శాతంగా ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) జిడిపి వృద్ధిని సైతం 7.5 శాతంగానే ఉంచింది. అయితే చైనా వృద్ధిరేటును మాత్రం ఈ ఏడాది 6.3 శాతంగా, వచ్చే ఏడాది 6 శాతంగా అంచనా వేసింది.

01/19/2016 - 16:36

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారంనాడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడి 24,479 వద్ద ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 7,435 పాయింట్ల వద్ద ముగిసింది.

01/18/2016 - 16:48

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారంనాడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 267 పాయింట్లునష్టపోయి 24,188 వద్ద ముగిసింది. నిఫ్టీ 87 పాయింట్లునష్టపోయి 7,351 పాయింట్ల వద్ద ముగిసింది.

01/18/2016 - 07:51

న్యూఢిల్లీ, జనవరి 17: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయంగా చోటుచేసుకునే పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

01/17/2016 - 08:33

బీజింగ్, జనవరి 16: ఆసియా వౌలికాభివృద్ధి బ్యాంక్ (ఎఐఐబి)ను శనివారం ఇక్కడ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఘనంగా ప్రారంభించారు. భారత్, మరో 56 దేశాలు వ్యవస్థాపక సభ్యులుగా వ్యవహరిస్తున్న ఈ బ్యాంక్‌ను గత నెల 25న బీజింగ్‌లో చైనా స్థాపించినది తెలిసిందే.

01/15/2016 - 08:37

న్యూఢిల్లీ, జనవరి 14: దేశంలో లగ్జరీ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని, పెద్ద నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ప్రజల కొనుగోలు శక్తితో పాటు బ్రాండెడ్ వస్తువుల పట్ల యువతలో అవగాహన పెరగడంతో ఈ ఏడాది లగ్జరీ మార్కెట్ దాదాపు 20 శాతం వృద్ధిచెంది 18.3 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక విభాగం అసోచామ్ తన అధ్యయనం ద్వారా వెల్లడించింది.

Pages