S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/07/2016 - 06:56

హైదరాబాద్, మే 6: ఎలక్ట్రికల్ వస్తువుల తయారీ సంస్థ హావెల్స్ ఇండియా లిమిటెడ్ ఆటోమేషన్, స్మార్ట్ సొల్యూషన్ వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అగ్రగామి ఆటోమేషన్ సంస్థగా గుర్తించబడిన హెచ్‌డిఎల్ ఆటోమేషన్‌తో కలిసి ఈ నూతన శ్రేణిని తన ప్రీమియం బ్రాండ్ ‘క్రాబ్‌ట్రీ’ కింద ఆవిష్కరించింది.

05/06/2016 - 01:50

గురువారం న్యూఢిల్లీలో హోండా కార్స్ ఇండియా సరికొత్త హోండా బిఆర్-వి కారును దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ సందర్భంగా నూతన మోడల్‌తో సంస్థ భారతీయ విభాగం అధ్యక్షుడు, సిఇఒ
యోయచిరో యుఎనో (ఎడమ). భారత్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో రూ. 1,500 కోట్ల కంపోనెంట్స్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు యుఎనో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఎగుమతులు రూ. 1,000 కోట్లుగా ఉన్నాయ.

05/06/2016 - 01:48

విదేశీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గిని గురువారం ముంబయలో భారతీయ మార్కెట్‌కు కొత్త హరికేన్ స్పైడర్ కారును పరిచయం చేసింది. దీని ధర 3.89 కోట్ల రూపాయలు. ఇటలీకి చెందిన ఈ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ముంబయలో ఈ సందర్భంగా ఓ షోరూంను కూడా ప్రారంభించింది. 2014 జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ఈ కారును ప్రదర్శించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

05/06/2016 - 01:45

ముంబయి/న్యూఢిల్లీ, మే 5: ర్యాన్‌బాక్సీ లాబొరేటరీస్ లిమిటెడ్ మాజీ ప్రమోటర్లు మల్విందర్ మోహన్ సింగ్, శివిందర్ మోహన్ సింగ్‌లపై భారీ జరిమానా పడినట్లు తెలుస్తోంది. 2008లో జపాన్‌కు చెందిన దైచీ సాంక్యో లిమిటెడ్‌కు ర్యాన్‌బాక్సీలోని తమ వాటాను విక్రయించే సమయంలో ఈ ఇరువురు నిజాలను మరుగున పెట్టారన్న దానిపై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ రూ. 2,500 కోట్ల జరిమానా విధించినట్లు సమాచారం.

05/06/2016 - 01:45

న్యూఢిల్లీ, మే 5: లోక్‌సభలో దివాళా బిల్లు ఆమోదం పొందడంపట్ల వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, ఆర్థిక నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత దివాళా బిల్లు భారత్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో సమస్యాత్మక ఆస్తులకున్న అడ్డంకులు తొలగిపోతాయని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా అన్నారు.

05/06/2016 - 01:44

హైదరాబాద్, మే 5: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) విధానాల్లో భాగంగా చేయూతనివ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర అభివృద్ధికి దోహదప డాలని మంత్రి కోరారు.

05/06/2016 - 01:41

నల్లగొండ రూరల్, మే 5: సమభావన మహిళా పొదుపు సంఘాలు బ్యాంకు రుణాలు తీసుకుని ఎగవేత ధోరణితో చెల్లింపునకు నిరాకరిస్తుండటంతో వాటి రికవరి కోసం నల్లగొండ మండలం అప్పాజిపేట కెనరా బ్యాంకు మేనేజర్ రావు గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామ పంచాయతీ వద్దగల శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడి ముందు మేనేజర్‌తోపాటు ముగ్గురు సిబ్బంది రిలే దీక్ష చేపట్టారు.

05/06/2016 - 01:38

ముంబయి, మే 5: అరకొర నిధులతో వచ్చే ఏ కొత్త కమాడిటీ ఫ్యూచర్లను ట్రేడింగ్‌కు అనుమతించేది లేదని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ స్పష్టం చేసింది. నేషనల్ స్పాట్ ఎక్స్‌చేంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఇఎల్) కుంభకోణం మదుపరులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన నేపథ్యంలో పైవిధంగా సెబీ చైర్మన్ యుకె సిన్హా తేల్చిచెప్పారు. గురువారం ఇక్కడ జరిగిన థామ్సన్ రాయిటర్స్ రిస్క్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు.

05/06/2016 - 01:37

ముంబయి, మే 5: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజులు నష్టపోయిన సూచీలు.. మదుపరుల కొనుగోళ్లతో తిరిగి లాభాలను అందుకోగలిగాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 160.48 పాయింట్లు పుంజుకుని 25,262.21 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 28.95 పాయింట్లు పెరిగి 7,735.50 వద్ద నిలిచింది.

05/06/2016 - 01:36

న్యూఢిల్లీ, మే 5: దేశీయ ఆటోరంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో గణనీయంగా పెరిగింది. 70.85 శాతం ఎగిసి 814.16 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 476.53 కోట్ల రూపాయలుగా ఉంది.

Pages