S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/04/2016 - 07:31

ముంబయి, మే 3: దేశీయ స్టాక్ మార్కెట్లను అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలు దెబ్బతీశాయి. మరోసారి యూరోజోన్ మందగమనానికి ఉన్న అవకాశాలు, చైనా ఉత్పాదక రంగం పనితీరు పేలవంగా ఉందంటూ నమోదైన గణాంకాలు.. సూచీలను నష్టపరిచాయి.

05/04/2016 - 07:30

విశాఖపట్నం, మే 3: తీవ్ర వర్షాభావ పరిస్థితులు విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరాపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. గోదావరి, ఏలేరు రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోవడంతో విశాఖ పరిశ్రమలకు నీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. గత రెండు రోజులుగా విశాఖలో ప్రధాన పరిశ్రమలకు విస్కో (విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ) నీటి సరఫరా నిలిపి వేసింది.

05/04/2016 - 07:29

న్యూఢిల్లీ, మే 3: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్లు (రెపో) తగ్గించినా ఆయా బ్యాంకులు మాత్రం ఈ తగ్గింపును సంస్థలు, ఖాతాదారులకు అందజేయటం లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు.

05/04/2016 - 07:28

న్యూఢిల్లీ, మే 3: ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడినవారిలో 50 మంది ఎగవేసిన మొత్తం విలువ 1.21 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఈ మేరకు రాజ్యసభకు ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. 2015 డిసెంబర్ నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల రుణ ఎగవేతదారుల సంఖ్య 7,686గా ఉందన్న ఆయన మూడేళ్ల క్రితం ఇది 5,554గా ఉందన్నారు.

05/03/2016 - 03:40

న్యూఢిల్లీ, మే 2: ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిశోర్ బియాని.. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. గ్రూప్ వ్యాపారాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే బియాని ఎండి పదవిని వదులుకున్నారు. అలాగే సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ పదవులకు రాకేశ్ బియాని సైతం రాజీనామా చేశారు.

05/03/2016 - 03:40

న్యూఢిల్లీ, మే 2: హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో గతంతో పోల్చితే 30.76 శాతం వృద్ధి చెందింది. 3,460.46 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ లాభం 2,646.35 కోట్ల రూపాయలుగా ఉంది.

05/03/2016 - 03:39

హైదరాబాద్, మే 2: ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు జైళ్ల శాఖ తీసుకువచ్చిన పలు సంస్కరణలు సఫలీకృతమవుతున్నాయ. ముఖ్యంగా ఖైదీలతో పనిచేయిస్తుండటం, చేతి వృత్తుల్లో అనుభవమున్న వారిని ప్రోత్సహిస్తుండటం లాభిస్తోంది. దీంతో వారిలో నైపుణ్యత, వారి ఉత్పత్తుల నాణ్యతపై జైళ్ల శాఖ దృష్టి సారిస్తోంది. ఖైదీలు తయారుచేస్తున్న పలు రకాల ఉత్పత్తులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సరసమైన ధరలకు జైళ్ల శాఖ విక్రయిస్తోంది.

05/03/2016 - 03:39

న్యూఢిల్లీ, మే 2: వౌలికరంగాల ప్రగతి ఈ ఏడాది మార్చి నెలలో 16 నెలల గరిష్ఠాన్ని తాకింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల రంగాల పనితీరు మెరుగుపడటంతో 6.4 శాతంగా నమోదైంది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఎనిమిది కీలక రంగాల వృద్ధి 2.7 శాతంగా ఉంది. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇది 4.5 శాతంగా ఉంది.

05/03/2016 - 03:38

ముంబయి, మే 2: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. సోమవారం రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో కనీస రుణ రేటు 9.20 శాతం నుంచి 9.15 శాతానికి దిగింది. కొత్త వడ్డీరేట్లు ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. ఫలితంగా గృహ, వాహన రుణాలు మరింత అందుబాటులోకి రానున్నాయ.

05/03/2016 - 03:37

ముంబయి, మే 2: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 169.65 పాయింట్లు క్షీణించి 25,436.97 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 43.90 పాయింట్లు పడిపోయి 7,805.90 వద్ద నిలిచింది.

Pages