S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/21/2016 - 10:03

న్యూయార్క్, ఏప్రిల్ 20: తీసుకున్న రుణాలను ఏ వ్యక్తీ లేదా సంస్థ ఎగవేసి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా 17 బ్యాంకుల నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరిట 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలు తీసుకుని, లండన్‌కు గుట్టుచప్పుడు కాకుండా చేరుకున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

04/21/2016 - 10:02

నల్లగొండ, ఏప్రిల్ 20: రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు నల్లగొండ జిల్లాలో సమస్యాత్మకంగా మారా య. ధాన్యం కొనుగోలు సజావుగా సాగక, కొనుగోలు జరిగిన ధాన్యానికి సకాలంలో డబ్బులు రాక రైతు లు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. రైతుకు 48 గంటల్లోగా ఆన్‌లైన్ ద్వారా ధాన్యం డబ్బులు చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు ఆచరణలో విఫలమ య్యాయ.

04/21/2016 - 10:02

కాకినాడ, ఏప్రిల్ 20: రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు కోనసీమ కొబ్బరికాయలను ఎగుమతి చేసేందుకు మార్కెటింగ్ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. కొబ్బరికాయలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కోనసీమ కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది.

04/21/2016 - 10:01

హైదరాబాద్, ఏప్రిల్ 20: చెక్ బౌన్స్ కేసులో హైదరాబాద్ నగర మూడవ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు.. రాజ్యసభ సభ్యుడు, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు వారెంట్‌ను జారీ చేసింది. వచ్చేనెల 5న కోర్టు ఎదుట హాజరై తన వాదనను వినిపించాలని ఆదేశించింది. కాగా, చెక్ బౌన్స్ కేసును జిఎంఆర్ సంస్థ దాఖలు చేసింది. హైదరాబాద్ జిఎంఆర్ విమనాశ్రయాన్ని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉపయోగించుకుంది. దీనికి రూ.

04/21/2016 - 10:01

ముంబయి, ఏప్రిల్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 27.82 పాయింట్లు పెరిగి 25,844.18 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ యథాతథంగా ముగిసింది. అతి స్వల్పంగా 0.05 పాయింట్ల మార్పుతో 7,914.75 వద్ద స్థిరపడింది.

04/21/2016 - 10:00

విశాఖపట్నం, ఏప్రిల్ 20: ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు నీటి సమస్య వచ్చిపడింది. ఉత్పత్తికి అవసరమైన నీటిని సరఫరా చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లే వ్యవహరిస్తోంది. దీంతో నీటి కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకునే దుస్థితి నెలకొంది. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణకు నిత్యం 35 ఎంజిడి (మిలియన్ గేలన్స్ ఫర్ ఎ డే) నీరు అవసరం.

04/20/2016 - 06:27

ముంబయి, ఏప్రిల్ 19: భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేట్ బకాయిలు వణికిస్తున్నాయి. మొత్తం దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఉనికికే మొండి బకాయిలు పెను ప్రమాదంగా మారడం కార్పొరేట్ల చలవే. దేశీయ బ్యాంకింగ్ రుణాల్లో 16.1 శాతం ఇప్పుడు చిక్కుల్లో ఉండగా, ఇవన్నీకూడా కార్పొరేట్ వర్గాలకిచ్చినవే కావడం గమనార్హం. వీటి విలువ దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు. అవును..

04/20/2016 - 06:24

న్యూయార్క్, ఏప్రిల్ 19: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని, వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిపై స్పందిస్తూ ‘గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను ఉన్నవాడే రాజు’ అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో జైట్లీ పైవిధంగా ప్రతిస్పందించారు.

04/20/2016 - 06:23

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 19: కృష్ణా గోదావరి (కెజి) బేసిన్ పరిధిలో 617 కిలోమీటర్ల గ్యాస్ పైపులైను పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) జిఎం ఎంవి అయ్యర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పైపులైను పునరుద్ధరణ పనులు రెండు దశలుగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా ఇవి పూర్తికానున్నాయన్నారు.

04/20/2016 - 06:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: నానాటికి పడిపోతున్న ఎగుమతులను వృద్ధిపథంలో తీసుకెళ్ళాలని, అందుకు కావాల్సిన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఇఒ) మంగళవారం డిమాండ్ చేసింది. వరుసగా 16వ నెల క్షీణిస్తూ గత నెల మార్చిలోనూ ఎగుమతులు పతనమైనది తెలిసిందే. సోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం మార్చిలో 5.47 శాతం దిగజారి భారత ఎగుమతుల విలువ 22.71 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

Pages