S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/13/2016 - 08:00

ఒంగోలు, ఏప్రిల్ 12: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకపక్క యూరప్ దేశాల్లో భవన నిర్మాణాలు తగ్గి భారీగా గ్రానైట్ ఎగుమతులు రాష్ట్రం నుండి పడిపోవటం, మరొకపక్క రాష్ట్ర ప్రభుత్వం రాయల్టీల పేరుతో 60 శాతం వసూలు చేయడంతో గ్రానైట్ వర్గాలపై పుండుమీద కారం చల్లినట్లైంది.

04/12/2016 - 04:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెల మార్చిలో 11 శాతం పెరిగాయి. 1,18,750 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు సోమవారం సంస్థ ప్రకటించింది. గత ఏడాది మార్చిలో 1,06,595 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ప్యాసింజర్ వాహనాల విభాగంలో గతంతో పోల్చితే 8 శాతం వృద్ధి నమోదైంది. 68,109 యూనిట్ల నుంచి 73,515 యూనిట్లకు చేరాయి.

04/12/2016 - 04:53

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారతీ ఎయిర్‌టెల్ మొబైల్ కామర్స్ అనుబంధ సంస్థ ఎయిర్‌టెల్ ఎమ్ కామర్స్ సర్వీసెస్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సు వచ్చింది. ఈ మేరకు సోమవారం ఎయిర్‌టెల్ తెలియజేసింది. గత ఏడాది ఆగస్టులో ఈ సంస్థకు ఆర్‌బిఐ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది.

04/12/2016 - 04:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రభుత్వరంగ సంస్థలు తమ వద్ద ఉన్న మిగులు భూములను విక్రయించటం ద్వారా వచ్చే నిధులు, ఆర్థిక వనరులను పెట్టుబడిగా పెట్టటం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచి దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపిచ్చారు. ప్రైవేట్ రంగం నుండి వస్తున్న పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వరంగ సంస్థలు తమ వనరులను సమీకరించుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు.

04/12/2016 - 04:49

ముంబయి, ఏప్రిల్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. గత వారం వరుసగా రెండు రోజులపాటు నష్టాలకే పరిమితమైన సూచీలు ఈసారి వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందన్న అంచనాల మధ్య లాభాల్లోకి వచ్చాయి. అలాగే జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఈ వారం ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు విడుదలవుతున్న క్రమంలో చివరి రెండు గంటల్లో ఐటి రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

04/12/2016 - 04:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని రాష్ట్రాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. వౌలిక రంగంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను వెచ్చించాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ఆధార్ అనుసంధానించి అందించాలని సూచించారు.

04/12/2016 - 04:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ‘పనామా పేపర్స్’ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, విదేశాల్లోని భారతీయుల ఖాతాల్లో ఏవైనా అక్రమాలున్నాయా? అన్న కోణంలో ఈ దర్యాప్తు జరుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. అలాగే విజయ్ మాల్యా తరహా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల కేసులను ఎదుర్కోడానికి న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తున్నామని అన్నారు.

04/12/2016 - 04:46

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: జైలుకు వెళ్ళడానికి కొద్ది వారాల ముందు సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ విదేశాలకు వెళ్ళాలని సుప్రీం కోర్టును కోరారనడాన్ని సహారా సోమవారం ఖండించింది. నిజానికి కోర్టు సమన్లతో విదేశాల నుంచి రాయ్ భారత్‌కు తిరిగి వచ్చేశారని, ఆ తర్వాత దేశం విడిచి వెళ్ళలేదని, కోర్టు అనుమతి ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదని చెప్పింది.

04/12/2016 - 04:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై చర్యలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకైన ఐడిబిఐ బ్యాంక్‌కు 900 కోట్ల రూపాయలకుపైగా రుణాల ఎగవేతకు పాల్పడిన కేసులో విజయ్ మాల్యా వరుసగా మూడోసారి ఇడి సమన్లను బేఖాతరు చేసినది తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యాపై తగిన చర్యలు తీసుకునే దిశగా ఇడి వెళ్తున్నట్లు సమాచారం.

04/11/2016 - 07:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల కదలికలను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి (ఐఐపి), ద్రవ్యోల్బణం గణాంకాలపై ఆధారంగా మదుపరులు తమ పెట్టుబడులపట్ల నిర్ణయానికొస్తారని అభిప్రాయపడుతున్నారు. గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా, శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని మార్కెట్లకు సెలవులు.

Pages