S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/09/2016 - 05:07

అమరావతి, జనవరి 8: ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో.. శుక్రవారం ఇక్కడ ఎల్‌వైఎఫ్ చౌక 4జి మొబైల్ ఫోన్లను ఆవిష్కరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. ఎల్‌వైఎఫ్ బ్రాండ్ క్రింద తక్కువ ధరతో 4జి మొబైల్ ఫోన్లను తీసుకొస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే వీటిని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హోర్డింగుల ద్వారా ఆవిష్కరించింది.

01/09/2016 - 05:05

హైదరాబాద్, జనవరి 8: జిఎంఆర్ గ్రూప్‌నకు ప్రతిష్టాకరమైన బులంద్ భారత్ అవార్డు లభించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన అఖిల భారత బిల్డర్స్ సదస్సులో ఈ అవార్డును జిఎంఆర్ సిఇవో ఎస్‌జికె కిషోర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రదానం చేసి సత్కరించారు. ఈ అవార్డు తమ సంస్థకు లభించడం పట్ల జిఎం రావు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

01/09/2016 - 05:03

ముంబయి, జనవరి 8: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. 19 నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 82.50 పాయింట్లు పెరిగి 24,934.33 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 33.05 పాయింట్లు లాభపడి 7,601.35 వద్ద నిలిచింది. అంతకుముందు నాలుగు వారాల్లో సెనె్సక్స్ 1,309.07 పాయింట్లు పతనమైంది.

01/09/2016 - 05:02

హైదరాబాద్, జనవరి 8: రెండు తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ ఎగుమతుల జోన్లు ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశం మొత్తం మీద రెండవ స్థానం సాధించాయని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) సర్వేలో వెల్లడైంది.

01/09/2016 - 05:01

రాజమహేంద్రవరం, జనవరి 8: పర్యావరణ అనుమతులు పొంది ప్రస్తుతం నడుస్తున్న రీచ్‌ల్లో తవ్వగా మిగిలిన ఇసుకకే వేలం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను మహిళా పొదుపు సంఘాల పర్యవేక్షణలో నడిపించాలన్న నిర్ణయంలో భాగంగా పర్యావరణ అనుమతులు పొందిన రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతున్న సంగతి విదితమే.

01/08/2016 - 08:04

న్యూఢిల్లీ, జనవరి 7: అంతర్జాతీయ ఐటి దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు తన ‘సర్ఫేస్’ శ్రేణి ట్యాబ్లెట్లను భారత మార్కెట్‌కు తీసుకొచ్చింది. వీటిలో అత్యాధునిక వెర్షన్ అయిన ‘సర్ఫేస్ ప్రో-4’ ట్యాబ్లెట్ ధర రూ.89,990 నుంచి ప్రారంభమవుతుంది.

01/08/2016 - 08:01

వాషింగ్టన్, జనవరి 7: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మున్ముందు కూడా మెరుగైన స్థానంలోనే కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. వచ్చే (2016-17) ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ చైనా కంటే ఒక పర్సెంటేజీ పాయింట్ అధికంగా 7.8 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై తాజాగా విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

01/08/2016 - 08:01

ముంబయి, జనవరి 7: ఆర్థిక వృద్ధి మందగమనాన్ని తట్టుకోవడం కోసం చైనా తన కరెన్సీ యువాన్ వేగంగా పడిపోవడానికి అనుమతించడంతో అంతర్జాతీయ స్టాక్, కరెన్సీ మార్కెట్లన్నీ అమ్మకాల ఓత్తిడితో కొట్టుమిట్టాడడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా గురువారం భారీగా పతనమైనాయి.

01/08/2016 - 08:00

న్యూఢిల్లీ, జనవరి 7: సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులపై ద్వంద్వ పన్నుల విధానంనుంచి ఊరట కల్పించాలని, అంతర్జాతీయ మార్కెట్‌లో చేపడుతున్న రక్షణాత్మక చర్యల కారణంగా తమకుకూడా రక్షణ కల్పించాలని భారతీయ ఐటి పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. ‘సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులపై ద్వంద్వ పన్నుల విధింపుపై మా భయాలను ప్రభుత్వానికి తెలియజేసాం.

01/08/2016 - 07:58

గుంటూరు, జనవరి 7: రాజధాని అమరావతిలో నివసిస్తున్న ప్రజల అభిమతానికి అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు వెళుతుందని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ పేర్కొన్నారు. గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ఆంధ్రభూమి ప్రతినిధికి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజధానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Pages