S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/07/2016 - 17:45

ముంబయి : చైనా స్టాక్ మార్కెట్ల పతనం భారత స్టాక్‌మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 554 పాయింట్లు నష్టపోయి 24,851 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 7,568 వద్ద ముగిసింది.

01/07/2016 - 06:11

న్యూఢిల్లీ, జనవరి 6: నల్లధనం వెలికితీతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. స్వచ్చంధ నల్లధన వివరాల వెల్లడి కార్యక్రమాన్ని గత ఏడాది చేపట్టినది తెలిసిందే. ఈ సందర్భంగా ప్రకటించిన ఆస్తులకు సంబంధించి మొత్తం 2,428.4 కోట్ల రూపాయల పన్నులను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. 2015 డిసెంబర్ 31 వరకు పన్నులు, జరిమానాల రూపంలో ఈ మొత్తాన్ని అందుకున్నట్లు ఓ ప్రకటనలో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి) తెలిపింది.

01/07/2016 - 06:09

న్యూఢిల్లీ, జనవరి 6: ఉద్యోగ సృష్టికి, వ్యాపార, పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కొత్త వెంచర్లకు 8,000 కోట్ల రూపాయల రుణ సదుపాయానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యంగా తక్కువ వడ్డీకి ఎస్‌సి, ఎస్‌టి మహిళా ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలకు రుణాలను అందించడానికి ‘స్టాండప్ ఇండియా’ పథకాన్ని ప్రకటించింది మోదీ సర్కారు.

01/07/2016 - 06:09

గుంటూరు, జనవరి 6: తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి యోగ్యమైన ప్రదేశాన్ని గుర్తిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించటంతో రాజధాని గ్రామాల ప్రజలు తర్జనభర్జన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయ నిర్మాణాలను చేపట్టేందుకు అవసరమైన మట్టి నమూనాలను సేకరించి భవన నిర్మాణాలకు పటిష్ఠమైన నేలను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.

01/07/2016 - 06:08

న్యూఢిల్లీ, జనవరి 6: ఒకప్పుడు ఎంతో పాపులర్ అయిన హెచ్‌ఎంటి వాచీలను తయారు చేసే విభాగంతోపాటుగా నష్టాలు వస్తున్న హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (హెచ్‌ఎంటి)కి చెందిన మూడు విభాగాలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. మూసివేయాలని నిర్ణయించిన మిగతా రెండు యూనిట్లలో హెచ్‌ఎంటి చినార్, హెచ్‌ఎంటి బేరింగ్స్ విభాగాలున్నాయి.

01/07/2016 - 06:07

న్యూఢిల్లీ, జనవరి 6: రాబోయే బడ్జెట్‌లో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించే అంశంలో స్పష్టమైన ప్రణాళిక ఉండాలని దేశీయ పారిశ్రామిక రంగం ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం పారిశ్రామిక సంఘాలైన సిఐఐ, ఫిక్కీ అధిపతులు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల సమావేశాల్లో పాల్గొన్నారు.

01/07/2016 - 06:07

హైదరాబాద్, జనవరి 6: సౌర, పవన విద్యుత్ ద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని సాధించడం సాధ్యమవుతుందని తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ జస్టిస్ బి చంద్రకుమార్ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు సౌర, పవన విద్యుత్‌ను వినియోగించుకుని దూరదృష్టితో తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు వీలవుతుందని ఆయన సూచించారు.

01/07/2016 - 06:06

ముంబయి, జనవరి 6: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి అందుకున్న ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలపాలయ్యాయి. ఈ వారం ఆరంభం నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్న సూచీలు.. సోమవారం భారీ స్థాయిలో పతనమైనది తెలిసిందే. మంగళవారం కూడా నష్టాలను అందుకోగా, బుధవారం అదే దారిలో నడిచాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 174.01 పాయింట్లు పడిపోయి 25,406.33 వద్ద ముగిసింది.

01/06/2016 - 17:11

ముంబయి : స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 174 పాయింట్లు నష్టపోయి 25,406 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 7,741 సూచీ వద్ద ముగిశాయి.

01/06/2016 - 06:58

రాజమహేంద్రవరం, జనవరి 5: గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి గల అవకాశాలు, రాజమహేంద్రవరం విమానాశ్రయ అభివృద్ధి అనే అంశాలపై మంగళవారం సదస్సు జరిగింది.

Pages