S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/09/2016 - 05:04

విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు ట్రస్టు సోలార్ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అయతే దీనికి అదనంగా మరో 5 మెగావాట్ల ప్లాంట్‌కు విశాఖపట్నం పోర్టు ట్రస్టు (విపిటి) ప్రతిపాదించింది. దీర్ఘకాలిక పచ్చదనం పెంపు ప్రణాళికలో భాగంగా దీన్ని ప్రతిపాదించారు.

03/09/2016 - 05:02

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. గత వారం నాలుగేళ్ల గరిష్ఠ స్థాయి లాభాలను సూచీలు అందుకున్నది తెలిసిందే. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 12.75 పాయింట్లు పెరిగి 24,659.23 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ అతి స్వల్పంగా 0.05 పాయింట్లు తగ్గి 7,485.30 వద్ద నిలిచింది. శుక్రవారం నిఫ్టీ 7,485.35 వద్ద స్థిరపడింది.

03/09/2016 - 05:00

న్యూఢిల్లీ: మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రకు ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం చెవలియెర్ డి లా లీజియన్ డి’హానర్ (నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్) దక్కింది. భారత్‌కు ఫ్రాన్స్ అంబాసిడర్ అయిన ఫ్రాంకోయిస్ రిచెర్ ఈ నెల 5న ఆనంద్ మహీంద్రకు ఈ అవార్డును అందించినట్లు ఓ ప్రకటనలో మహీంద్ర అండ్ మహీంద్ర మంగళవారం తెలిపింది.

03/09/2016 - 04:58

న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. దేశం విడిచి వెళ్లిపోకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వరంగ బ్యాంకర్ల పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది. వేల కోట్ల రూపాయలు బకాయిపడి, దేశం విడిచి వెళ్లిపోయేందుకు చూస్తున్నారంటూ ఎస్‌బిఐసహా 13 బ్యాంకులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. బ్యాంకుల తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి హాజరై ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

03/09/2016 - 04:58

న్యూఢిల్లీ: బ్యాంకుల రుణాలను ఎగవేసిన వారిని రాజ్యసభ ఎంపికకు అనర్హులుగా ప్రకటిస్తూ సభలో ఒక తీర్మానం చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌తోపాటు పలువురు ఇతర సీనియర్ నాయకులు ఈ ప్రతిపాదనను రాజ్యసభలో ప్రతిపాదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

03/09/2016 - 04:57

న్యూఢిల్లీ: జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌పై వచ్చిన నకిలీ వీడియోల వ్యవహారంపై దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నివేదిక వచ్చిన తరువాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వి హామీ ఇచ్చారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, ఇతర సభ్యులు ఈ అంశంపై జరిపిన చర్చకు ఆయన జవాబిచ్చారు.

03/08/2016 - 07:20

ముంబయి: మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోనున్న క్రమంలో సోమవారం భారతీయ వ్యాపార, పారిశ్రామిక, బ్యాంకింగ్ సంస్థలు మహిళా సాధికారతకు దన్నుగా నిలిచాయి. పూర్తిగా మహిళా బ్యాంక్ శాఖ, ఇంటి వద్దనుంచే ఉద్యోగం చేసే అవకాశం, ఉద్యోగాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత వంటి హామీలను బ్యాంకులు ప్రకటించాయి. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్..

03/08/2016 - 07:17

ముంబయి: ఆభరణాల వర్తకులు దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మెను నిరవధికంగా జరపాలని నిర్ణయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గత నెల 29న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో వెండియేతర నగలపై ఎక్సైజ్ సుంకాన్ని 1 శాతం విధించాలని ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 2 నుంచి సమ్మెబాట పట్టిన జ్యుయెలర్లు..

03/08/2016 - 07:16

ముంబయి: కింగ్ ఆఫ్ గుడ్‌టైమ్స్‌కు బ్యాడ్‌టైమ్స్ మొదలయ్యాయి. విజయ్ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. దీంతో ఈ లిక్కర్ వ్యాపారికి కొత్త చిక్కులు వచ్చిపడగా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ బ్యాంక్ నుంచి 900 కోట్ల రూపాయలకుపైగా తీసుకున్న రుణం ఎగవేతకు సంబంధించి మాల్యాతోపాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసు నమోదు చేసింది.

03/08/2016 - 07:15

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ రంగ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్‌జెఐఎల్).. రాబోయే ఐసిసి టి20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల సందర్భంగా ఆరు క్రికెట్ స్టేడియంలకు ఉచిత వైఫై సేవలను అందించనుంది.

Pages