S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/29/2016 - 08:30

న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి నుంచి నిరుద్యోగ చందాదారులు తమ మొత్తం ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించాలని, లేదంటే వారి ఖాతాల్లో ఉంచిన సొమ్ముకు వడ్డీ అయినా చెల్లించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు చెందిన భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) సహా పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

02/29/2016 - 08:30

ముంబయి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో కనీస ఆదాయ పన్ను (ఐటి) మినహాయింపు పరిమితిని 3 లక్షల రూపాయలకు పెంచుతుందని మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) విభాగం అంచనా వేస్తోంది.

02/28/2016 - 06:45

న్యూఢిల్లీ: ‘ఫ్రీడమ్ 251’.. సంచలనాలకు కేంద్ర బిందువు ఈ 3జి స్మార్ట్ఫోన్. ప్రపంచంలోనే అంత్యంత చౌక స్మార్ట్ఫోన్‌గా దేశీయ మొబైల్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ దీన్ని గతవారం పరిచయం చేయగా, ఈ ఫోన్ ప్రకటన వెలువడిన దగ్గర్నుంచి రోజుకో కొత్త వార్త ఉంటూనే ఉంటోంది. ఇప్పుడు తాజా వార్తేమిటంటే?

02/28/2016 - 06:41

న్యూఢిల్లీ: రాబోయే క్లిష్ట పరిస్థితుల మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిపథంలో నిలబెట్టడానికి ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ)అరవింద్ సుబ్రమణ్యన్ అన్నారు. కఠినమైన సంస్కరణల ద్వారానే అధిక వృద్ధిరేటును అందుకోగలమన్న ఆయన దాన్ని ఏ మంత్ర దండంతోనో సాధించలేమని వ్యాఖ్యానించారు.

02/28/2016 - 06:40

షాంఘై: దిగజారిన ఎగుమతులు, విదేశీ వాణిజ్య అవకాశాలను పెంపొందించుకోవడానికి వీలుగా కరెన్సీ విలువ తగ్గింపునకు పాల్పడుతోందన్న ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. శుక్రవారం రాత్రి ఇక్కడ ముగిసిన జి20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో చైనా పైవిధంగా స్పష్టం చేసింది. ఒక్కసారిగా యువాన్ విలువ తగ్గడంలో తమ ప్రమేయమేమీ లేదని పేర్కొంది.

02/28/2016 - 06:40

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం నష్టాల్లో ముగిశాయి. ఆర్థిక సర్వే 2015-16 సందర్భంగా శుక్రవారం లాభాలను అందుకున్న సూచీలు.. అంతకుముందు మూడు రోజులు మాత్రం నష్టాలకే పరిమితమయ్యాయి.

02/28/2016 - 06:39

న్యూఢిల్లీ: ఇండియా టుడే గ్రూప్‌లోని ఈ-కామర్స్, టివి షాపింగ్ సంస్థల్లో జీ మీడియా కార్పొరేషన్ 80 శాతం వరకు వాటాలను కొనుగోలు చేస్తోంది. నష్టాల్లో నడుస్తున్న టుడే మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్, టుడే రిటైల్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో 165.78 కోట్ల రూపాయలతో జీ మీడియా వాటాలను కొంటోంది.

02/27/2016 - 03:13

* వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) జిడిపి వృద్ధి 7-7.75 శాతం
* ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) జిడిపి వృద్ధి 7.6 శాతం
* ఎగుమతులు పుంజుకుంటే 8-10 శాతానికి జిడిపి వృద్ధిరేటు
* ప్రపంచ ఆర్థిక మాంద్యంలో సుస్థిరతకు సిసలైన చిరునామా భారత్
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో 35 డాలర్ల వద్ద బ్యారెల్ ముడిచమురు ధర
* ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యారెల్ ముడిచమురు సగటు ధర 45 డాలర్లు

02/27/2016 - 02:56

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలతో రాబోయే 2-5 ఏళ్లలో భారత జిడిపి వృద్ధిరేటు 8-10 శాతానికి చేరుకోగలదని ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వే 2015-16ను ప్రవేశపెట్టిన అనంతరం సుబ్రమణ్యన్ ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.

02/27/2016 - 02:55

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్‌ఎల్) చైర్మన్ పదవి నుంచి తప్పుకునే క్రమంలో డియాజియో-విజయ్ మాల్యా మధ్య కుదిరిన 515 కోట్ల రూపాయల ఒప్పందంపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దృష్టి సారించింది.

Pages