S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/25/2016 - 07:52

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం బుధవారం కూడా కొనసాగింది. మంగళవారం 379 పాయింట్లు క్షీణించిన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్.. బుధవారం 321 పాయింట్లు దిగజారింది. గురువారం రైల్వే బడ్జెట్ పార్లమెంట్‌కు వస్తుండటం, ఫిబ్రవరి నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటం వంటివి మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేసింది.

02/25/2016 - 07:51

న్యూఢిల్లీ: దేశీయ విద్యుదుత్పాదక దిగ్గజం, ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌టిపిసి వాటా విక్రయంతో కేంద్ర ప్రభుత్వానికి 5,030 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఎన్‌టిపిసిలో 5 శాతానికి సమానమైన 41.22 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా రెండు రోజులపాటు సంస్థాగత మదుపరులకు, రిటైల్ మదుపరులకు ప్రభుత్వం విక్రయించింది.

02/25/2016 - 07:50

హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో వచ్చే నెల 16 నుంచి 20 వరకు ఇండియా ఏవియేషన్ 2016ను నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ 5వ అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఎగ్జిబిషన్, అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ తెలిపారు.

02/24/2016 - 07:22

న్యూఢిల్లీ: ఎన్‌టిపిసి వాటా విక్రయానికి మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రారంభమైన రెండు గంటల్లోనే ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యింది. రూ. 5,030 కోట్ల విలువైన 5 శాతం వాటాను ఎన్‌టిపిసి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా ఉపసంహరించుకుంటుండగా, మంగళవారం విదేశీ, దేశీయ సంస్థాగత మదుపరుల నుంచి పెద్ద ఎత్తున బిడ్లు దాఖలయ్యాయి. ఒక్కో షేర్ ధర రూ.

02/24/2016 - 07:19

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ కమిషనరేట్ల పరిధిలో రూ. 12,680 కోట్ల సుంకాన్ని అధికారులు వసూలు చేశారు. పది జిల్లాల్లో గత ఏడాది కంటే ఈ సంవత్సరం రూ. 854 కోట్లు అధికంగా వసూలైనట్టు సెంట్రల్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను జనవరి వరకు రూ. 12,680 కోట్లు వసూలవగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.

02/24/2016 - 07:18

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్.. తమ రుణగ్రహీతల్లో ఏకంగా సుమారు 900 సంస్థలని ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (విల్‌ఫుల్ డిఫాల్టర్లు)గా ప్రకటించింది. ఈ జాబితాలో విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యుయెల్లరీ, ఫరెవర్ ప్రీషియస్ జ్యుయెల్లరీ అండ్ డైమండ్స్, జూమ్ డెవలపర్స్, నాఫెడ్, ఎస్ కుమార్ నేషన్‌వైడ్ తదితర సంస్థలున్నాయి.

02/24/2016 - 07:17

న్యూఢిల్లీ: ప్రపంచ మొబైల్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ఫోన్ వ్యవహారాన్ని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్‌గా ఫ్రీడమ్ 251ను గత వారం భారతీయ మొబైల్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ మార్కెట్‌కు పరిచయం చేసినది తెలిసిందే. దీని ధర కేవలం 251 రూపాయలు. రెండు రోజులపాటు దీని బుకింగ్స్‌ను రింగింగ్ బెల్స్ స్వీకరించింది కూడా.

02/24/2016 - 07:17

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక పరిస్థితులపై మదుపరులలో కొరవడిన స్పష్టత, ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని మొండి బకాయిల భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. నాలుగు రోజులుగా లాభాలను అందుకుంటున్న సూచీలు.. విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలతో ఉదయం ప్రారంభం నుంచి నష్టాల్లోనే కదలాడాయి.

02/23/2016 - 07:59

హైదరాబాద: తెలంగాణలోని నిరుద్యోగులకు వివిధ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కామ్ సంస్థ ద్వారా భారీగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. తాజాగా సోమవారం మరో నాలుగు వందల మందికి ఉద్యోగ హామీ లభించింది.

02/23/2016 - 07:57

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద విద్యుదుత్పత్తి సంస్థ, ప్రభుత్వరంగానికి చెందిన ఎన్‌టిపిసిలో 5 శాతం వాటాను మంగళవారం కేంద్ర ప్రభుత్వం విక్రయానికి తెస్తోంది. ఒక్కో షేర్ 122 రూపాయలుండగా, ఈ వాటా అమ్మకంతో 5,029 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అందుకోనుంది. మొత్తం 41.22 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలు చేసే అవకాశం ముందుగా సంస్థాగత మదుపరులకు, తర్వాత రిటైల్ మదుపరులకు దక్కనుంది.

Pages