S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/23/2016 - 07:56

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా లాభాల్లో ముగిశాయి. వరుసగా సూచీలు నాలుగో రోజూ లాభాల్లోనే కొనసాగగా, రెండు వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్న సంకేతాల మధ్య చమురు, గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

02/23/2016 - 07:55

విజయవాడ: వచ్చే నవ్యాంధ్ర బడ్జెట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండబోతోంది. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా సులభ శైలిలో రూపొందిస్తున్నారు. సోమవారం విజయవాడ ఎ-1 కనె్వన్షన్ సెంటర్‌లో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 2016-17 బడ్జెట్‌లో ప్రతి పుట అందరికీ అర్థమయ్యేలా రూపకల్పన చేస్తున్నట్టు వివరించారు.

02/23/2016 - 07:52

మూతబడిన
మారుతి ప్లాంట్లు

02/22/2016 - 04:44

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు.. వాటి మార్కెట్ విలువను మించిపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన బ్యాంకుల మార్కెట్ విలువ రెండున్నర లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే, ఈ బ్యాంకుల మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) మాత్రం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం.

02/22/2016 - 04:41

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కనిష్ట స్థాయిలో కదలాడుతున్న నేపథ్యంలో మరో 3-5 సంవత్సరాలు తక్కువగానే ఉండొచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ అంచనా వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ అధినేత అయిన ముకేశ్.. ఆదివారం ఇక్కడ ఓ ప్రముఖ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పైవిధంగా అభిప్రాయపడ్డారు.

02/22/2016 - 04:41

ఒంగోలు: అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల ధరలు భారీగా పలుకుతుండటంతో కోస్తా జిల్లాల్లో ఇబ్బడిముబ్బడిగా సాగు చేస్తున్నారు. వర్షాకాలంలో ఆక్వాసాగు రైతులకు సిరుల వర్షం కురిపిం చడంతో, వేసవికాలంలో మళ్లీ సాగు చేసేందుకు రొయ్య రైతులు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ధరలు లేని సమయంలో వెనుకంజ వేసిన రైతులు, పారిశ్రామికవేత్తలు ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండటంతో సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

02/22/2016 - 04:40

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు అంతకంతకూ పెరిగిపోతున్నాయ. కొత్తగా పెట్టుబడులకు దూరంగా ఉండటమేగాక, గతంలో పెట్టిన పెట్టుబడులనూ విదేశీ మదుపరులు తిరిగి తీసేసు కుంటున్నారు. గడచిన మూడు వారాల్లో దాదాపు 4,600 కోట్ల రూపాయల పెట్టుబడులను భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గుంజేసుకున్నారు.

02/22/2016 - 04:39

న్యూఢిల్లీ: పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం తపాలా శాఖ 800 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనకు పబ్లిక్ ఇనె్వస్ట్‌మెంట్ బోర్డు (పిఐబి) ఆమోదం తెలిపింది. అంతేగాక నెల రోజుల్లోపే కేబినెట్ ముందుకు ఈ ప్రతిపాదన వెళ్లనుంది. ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పిఐబి పరిశీలించి తుది ఆమోదం కోసం కేబినెట్‌కు పంపిస్తుంది.

02/22/2016 - 04:38

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా ఒడిదుడుకులకు లోనుకావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నా రు. అయితే రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వే ఆధారంగా పెట్టుబడులపై మదుపరుల ఆలోచన మారవచ్చని పేర్కొంటున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు కూడా మార్కెట్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.

02/21/2016 - 08:31

న్యూఢిల్లీ: ఎక్సైజ్, ఆదాయ పన్ను (ఐటి) శాఖల దృష్టి ఇప్పుడు రింగింగ్ బెల్స్‌పై పడింది. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్ ‘ఫ్రీడమ్ 251’ను రింగింగ్ బెల్స్ ఇటీవల పరిచయం చేసినది తెలిసిందే. దీని ధర కేవలం 251 రూపాయలు. ఈ నేపథ్యంలో ఈ నోయిడాకు చెందిన సంస్థ ఆర్థికపరమైన అంశాలను ఎక్సైజ్, ఐటి శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Pages