S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/21/2016 - 08:28

న్యూఢిల్లీ: వ్యవసాయం, ఉపాధి, పేదరిక నిర్మూలన అంశాలపై రాబోయే వార్షిక బడ్జెట్ దృష్టి పెట్టనుందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయం త్ సిన్హా తెలిపారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. ఈ నెల 29న దీన్ని పార్లమెంట్‌కు తీసుకొస్తున్నారు.

02/21/2016 - 08:28

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి చౌక ఉత్పత్తులు అవసరమని, ఆ దిశగా పారిశ్రామిక రంగం ముందుకెళ్ళాల్సి ఉందని పతంజలి సంస్థ అధినేత, యోగా గురువు రామ్‌దేవ్ బాబా అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సాహించాలన్నారు.

02/21/2016 - 08:26

హైదరాబాద్: ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ శిక్షణ-పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని 18.51 కోట్ల రూపాయల వ్యయంతో పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యేందుకు మారుతీ సుజికీ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేస్తారు.

02/21/2016 - 08:26

గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపిసి వద్ద 1,600 మెగావాట్ల విద్యుత్ యూనిట్ల నిర్మాణ పనులు చేపట్టామని, యూనిట్లను 2020 నాటికి పూర్తి చేసి ఉత్పత్తి దశలోకి తెస్తామని ఎన్టీపిసి ఇడి మహాపాత్ర తెలిపారు.

02/21/2016 - 08:25

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస రెండు వారాల నష్టాలకు బ్రేక్‌వేస్తూ గడచిన వారం లాభాల్లో ముగిశాయి. వచ్చే వారంతో ఫిబ్రవరి ఫ్యూచర్స్, ఆప్షన్స్‌కున్న గడువు ముగియనున్న క్రమంలో అంతర్జాతీయ సానుకూల సంకేతాల మధ్య మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు.

02/20/2016 - 03:04

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే 2016-17 సార్వత్రిక బడ్జెట్ పత్రాల ముద్రణ కార్యక్రమం ‘హల్వా ఉత్సవం’తో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ ఉత్సవంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఆ శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పాల్గొన్నారు.

02/20/2016 - 03:03

ముంబయి, ఫిబ్రవరి 19: ముంబయిలో గురువారం ముగిసిన ‘మేక్ ఇన్ ఇండియా’ ఫెయిర్‌లో భారీగా 222 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు (ఎంఓయులు) కుదిరాయి. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమై వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి విదేశీ సంస్థల హాజరు పలుచగా ఉండటాన్ని చూస్తుంటే పైన పేర్కొన్నంత భారీ మొత్తంలో పెట్టుబడులు రాకపోవచ్చని స్పష్టమవుతోంది.

02/20/2016 - 03:02

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: తమ బకాయిల్లో కొంతమేరకైనా రాబట్టుకోవడం కోసం నష్టాల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆస్తులను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్(ఎఆర్‌సిఎస్)కు విక్రయించాలని కనీసం నాలుగు బ్యాంకులు అనుకుంటున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌నుంచి రావలసిన రూ 6,963 కోట్ల బకాయిలను రాబట్టుకోవడానికి ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం అష్టకష్టాలు పడుతోంది.

02/20/2016 - 03:01

ముంబయి, ఫిబ్రవరి 19: లావాదేవీల చివర్లో పెద్ద ఎత్తున కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం ప్రారంభంలో నష్టాలనుంచి బైటపడి సెనె్సక్స్ 60 పాయింట్ల స్వల్ప లాభంతో మగిసేందుకు దోహదపడ్డాయి. బ్యాంకింగ్, బ్లూచిప్ కంపెనీల షేర్లు చక్కటి లాభాలు ఆర్జించడంతో అక్టోబర్ తర్వాత మార్కెట్లు తొలిసారిగా వారంలో మంచి లాభాలు ఆర్జించేలా చేశాయి.

02/20/2016 - 03:00

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ప్రస్తుతం ఉన్న మూడు కోల్ వాషరీలకు అదనంగా రానున్న రోజుల్లో మరో మూడు వాషరీలను నెలకొల్పనున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ తెలిపారు. పర్యావరణ శాఖ నిబందనలకు లోబడి ఇప్పటికే నాణ్యమైన బొగ్గు వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తున్నామని ఆయన వివరించారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీకి సింగరేణి సంస్థ తరఫున శ్రీధర్ హాజరై నివేదికను సమర్పించారు.

Pages