S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/28/2015 - 07:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి దూకుడు కొనసాగుతోంది. గత నెల నవంబర్‌లో దేశీయ మార్కెట్‌లో అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల్లో టాప్-10 మోడల్స్‌లో ఆరు మారుతి సుజుకికి చెందినవే ఉన్నాయి. మారుతి ఆల్టో ఎప్పటిలాగే తొలి స్థానంలో నిలిచింది. 21,995 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది నవంబర్‌లో 24,201 యూనిట్లు అమ్ముడైయ్యాయి.

12/28/2015 - 07:30

కోల్‌కతా, డిసెంబర్ 27: పెట్రోల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పట్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి రాబోవని ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) అరవింద్ సుబ్రమణ్యమ్ అన్నారు. ఆదివారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విలేఖరులతో మాట్లాడిన ఆయన జిఎస్‌టి అమల్లోకి వచ్చిన కొంతకాలం వరకు పెట్రోల్, పెట్రో ఉత్పత్తులపై జిఎస్‌టి వర్తించదన్నారు.

12/28/2015 - 07:30

ముంబయి, డిసెంబర్ 27: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోగల రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)లోని టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. ఆదివారం తమ గ్రూప్ ఉద్యోగులకు జియో బ్రాండ్ పేరిట 4జి సేవలను అందుబాటులోకి తెచ్చింది.

12/28/2015 - 07:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ప్రపంచ ఆర్థిక మందగమనంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు ఈ ఏడాది బాగుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు, ప్రత్యక్ష పన్నుల హేతుబద్ధీకరణ, వ్యాపార నిర్వహణ సులభతరం చేయడం వంటివి కొత్త సంవత్సరంలో తమ ప్రధాన లక్ష్యాలుగా ఆయన పేర్కొన్నారు.

12/28/2015 - 07:29

లండన్, డిసెంబర్ 27: భారత్ ఆర్థిక వ్యవస్థ 2030 తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఓ తాజా అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ బిజినెస్ అండ్ రిసెర్చ్ (సిఇబిఆర్) నివేదిక ప్రకారం 2029లో అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా అధిగమించనుంది. ఈ క్రమంలో అమెరికా రెండో స్థానానికి పడిపోగా, భారత్ మూడో స్థానానికి చేరనుంది.

12/27/2015 - 06:31

వరుసగా రెండో వారం లాభాల్లో స్టాక్ మార్కెట్లు
పెట్టుబడుల దిశగా విదేశీ మదుపరులు
వారాంతపు సమీక్ష
=================

12/27/2015 - 06:30

కోల్‌కతా, డిసెంబర్ 26: భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను ప్రపంచ బ్యాంక్ సవరించే అవకాశాలున్నాయని బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ బసు అన్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింప జేసుకోవడంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైన క్రమంలో ఆ ప్రభావం దేశ జిడిపి వృద్ధి అంచనాపై చూపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

12/27/2015 - 06:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఎకానమీ శ్రేణి ప్రయాణీకులకు మాంసాహారాన్ని అందించడం నిలిపివేయనుంది. 90 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకునే ప్రయాణీకులకు జనవరి 1 నుంచి విమానంలో మాంసాహార పదార్థాలను అందించబోవడం లేదని ప్రకటించింది. మరోవైపు ఎయిరిండియా తీసుకున్న నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.

12/27/2015 - 06:29

ఈ ఏడాది ఆర్థిక, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో చోటుచేసుకున్న కీలక అంశాల
సమాహారమే ఈ ‘వీడ్కోలు-2015’. స్టాక్, రూపాయి, బంగారం, ముడి చమురు
మార్కెట్ల వివరాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలన్నింటినీ
ఒక్కచోటికి చేర్చుతూ మీకందిస్తున్నాం
========================
స్టాక్ మార్కెట్లు డీలా

12/26/2015 - 06:43

విశాఖపట్నం, డిసెంబర్ 25: ఉత్తర కోస్తాలో కల్తీ మద్యం వరదలై పారుతోంది. ఇటీవల విజయవాడ నగరం కేంద్రంగా కల్తీమద్యం కాటుకు ఐదుగురు బలికాగా, మరికొంత మంది అమాయకులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒడిశా రాష్ట్రం నుంచి వెల్లువెత్తుతున్న రెక్టిఫైడ్ స్పిరిట్ (ఆర్‌ఎస్)తో ఇక్కడ మద్యం వ్యాపారులు చీప్ లిక్కర్‌ను తయారు చేస్తూ అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు.

Pages