S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/04/2016 - 07:05

లండన్: భారతీయ ఐటి రంగ దిగ్గజం, ప్రముఖ బహుళజాతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్).. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) సేవల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. ఈ మేరకు ఓ ప్రధాన గ్లోబల్ బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ బుధవారం వెల్లడించింది.

02/03/2016 - 06:20

ముంబయి, ఫిబ్రవరి 2: కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ). మంగళవారం ఇక్కడ ఆర్‌బిఐ ప్రధాన కార్యాలయంలో జరిపిన ఆరో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లపై నిర్ణయం ప్రభుత్వపైనే ఆధారపడి ఉందన్న సంకేతాలనిచ్చారు గవర్నర్ రఘురామ్ రాజన్. రాబోయే బడ్జెట్, అందులో పెట్టే ప్రతిపాదనల ప్రకారం తమ ద్రవ్యసమీక్ష ఇకముందు ఉంటుందని చెప్పకనే చెప్పారు రాజన్.

02/03/2016 - 06:17

ముంబయి, ఫిబ్రవరి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. తాజా ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) యథాతథంగా ఉంచడం మదుపరులకు రుచించలేదు. ఫలితంగా అమ్మకాలకు దిగగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 285.83 పాయింట్లు పతనమై 24,539 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 100.40 పాయింట్లు క్షీణించి 7,455.55 వద్ద స్థిరపడింది.

02/03/2016 - 06:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గడచిన రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి క్షీణించిందని, మళ్లీ అది పుంజుకుంటేనే వృద్ధిరేటు పరుగులు పెడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2016 సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

02/03/2016 - 06:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: నిర్మాణ రంగంలో వాణిజ్యపరమైన వృద్ధి బెంగళూరులో అత్యధికంగా ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెఎల్‌ఎల్ తెలిపింది. ఈ విషయంలో ఆసియా-పసిఫిక్ దేశాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచిందని, ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానంలో ఉందని మంగళవారం ఓ ప్రకటనలో జెఎల్‌ఎల్ ఇండియా వెల్లడించింది. మొదటి మూడు స్థానాల్లో లండన్, సిలికాన్ వ్యాలీ, డబ్లిన్ ఉన్నాయని పేర్కొంది.

02/03/2016 - 06:15

విజయవాడ, ఫిబ్రవరి 2: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపాన వి2సి గ్రూప్ త్వరలో ‘ఇంటిగ్రేటెడ్ కోకో పార్కు’ నెలకొల్పనున్నది. వి2సి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ డివి రామ్‌కుమార్ నేతృత్వంలో ప్రతినిధి బృందం మంగళవారం విజయవాడలోని సిఎంఓలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయి చర్చించింది.

02/03/2016 - 06:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ లీఇకో మంగళవారం ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌పై నిర్వహించిన 4జి లీ 1ఎస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు విశేష స్పందన లభించింది. ప్రారంభించిన కేవలం రెండు సెకన్లలోనే 70 వేలకుపైగా అమ్ముడైపోయాయి. ‘లీ 1ఎస్‌కు లభించిన స్పందన అత్యద్భుతం. 70,000 యూనిట్లను అమ్మకానికి పెట్టాం.

02/02/2016 - 02:41

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సోమవారం తమ ప్రతిష్ఠాత్మక 150 సిసి బైక్ ‘వి’ని ఆవిష్కరించింది. భారత తొలి యుద్ధవిమాన నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నుంచి తీసిన లోహంతో ఈ బైక్‌లను బజాజ్ తయారు చేస్తున్నది తెలిసిందే. కాగా, ఈ బైక్ అమ్మకాలు వచ్చే నెల మార్చి నుంచి మొదలవనుండగా, అప్పుడే దీని ధరను బజాజ్ ప్రకటించనుంది.

02/02/2016 - 02:38

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. తమ ప్రయాణికులకు సోమవారం ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. విమాన రాకపోకల్లో చోటుచేసుకునే అసౌకర్యాలకుగాను ప్రయాణికులకు రీయింబర్స్‌మెంట్ సదుపాయాన్ని కల్పించింది. ముందే బుక్ చేసుకున్న మార్గాల్లో విమానాలు రద్దైనా, ఆలస్యమైనా ప్రయాణికులకు మరో ఫ్లైట్ టిక్కెట్ కోసం రీయింబర్స్‌మెంట్ ఉంటుందని ప్రకటించింది.

02/02/2016 - 02:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ‘జైలు జీవితం బాధాకరం. ఒంటరితనాన్ని మిగిల్చింది.’ అన్నారు సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిధులను సమీకరించారన్న కేసులో దాదాపు రెండేళ్లుగా తీహార్ జైళ్లో సుబ్రతా రాయ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉంటున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే సహారా 39వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన ఒక పుస్తకాన్ని విడుదల చేశారు.

Pages