S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/24/2015 - 05:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా అవినీతి నిరోధక చట్టాన్ని సవరించే ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటించారు.

12/24/2015 - 05:33

మెదక్, డిసెంబర్ 23: మెదక్ జిల్లాలోని మెదక్, నిజామాబాద్ జిల్లా బోధన్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని నిజాం దక్కన్ సుగర్స్ లిమిటెడ్ పరిశ్రమలను లే ఆఫ్ చేస్తున్నట్లు మెదక్ ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమ ప్రధాన గేటుకు బుధవారం నోటీసు అంటించారు. దీంతో కార్మికులు నివ్వెరబోయారు.

12/24/2015 - 05:32

ముంబయి, డిసెంబర్ 23: ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్ సాంకేతిక సమస్యల్లో చిక్కుకుంది. ఎల్‌ఐసి నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఆ కంపెనీ స్టాక్స్ నిర్ణీత సమయంలోగా ధ్రువీకరణ కాకపోవడమే దీనికి కారణం. దీంతో ఈ వ్యవహారాన్ని మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబికి నివేదించారు.

12/24/2015 - 05:31

జైపూర్, డిసెంబర్ 23: వరసగా రెండో త్రైమాసికంలో సైతం జిడిపి గణాంకాలు మెరుగుపడ్డంపై సంతోషం వ్యక్తం చేసిన నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగరియ ఈ ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ 8 శాతానికి పైగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో జిడిపి వృద్ధి 7.2 శాతంగా ఉండగా, ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఇది 8 శాతాన్ని దాటవచ్చని భావిస్తున్నట్లు పనగరియ చెప్పారు.

12/24/2015 - 05:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: పరోక్ష పన్ను సంస్కరణ అయిన వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) అమలు ఎప్పటినుంచి జరుగుతుందో చెప్పడం కష్టమని, ఎందుకంటే ఇది ప్రధానంగా చట్టసభ ప్రక్రియపై అధారపడి ఉండడమే దీనికి కారణమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అన్నారు. ఇది ప్రధానంగా చట్టసభల క్యాలెండర్‌పై ఆధారపడి ఉంటుంది. అందువల్ల జిఎస్‌టి బిల్లును ఎప్పుడు పార్లమెంటులో ప్రవేశపెడతారు?

12/24/2015 - 05:30

విజయవాడ, డిసెంబర్ 23: దేశంలో ఖనిజ ఆధారిత పరిశ్రమల స్థాపనకు రెండవ అనుకూల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్యాంకు గుర్తింపు లభించిందని భూగర్భ, ఖనిజ వనరుల శాఖ కార్యదర్శి యం.గిరిజా శంకర్ పేర్కొన్నారు. 2016 జనవరి, 10 నుండి 12 వరకు విశాఖపట్నంలో పారిశ్రామిక శిఖరాగ్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

12/24/2015 - 05:30

విశాఖపట్నం, డిసెంబర్ 23: విశాఖ ఆర్‌కె బీచ్ కోత నివారణకు ఇసుక నింపటం (డంపింగ్) ఒక్కటే పరిష్కారం కాగలదని స్పష్టమైంది. బీచ్ కోతను నివారించేందుకు తాత్కాలిక, శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న యంత్రాంగం తాజాగా విదేశీ సంస్థ అధ్యయనం మేరకు తీరంలో భారీస్థాయిలో ఇసుక నింపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

12/24/2015 - 05:29

ముంబయి, డిసెంబర్ 23: విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు అద్భుతంగా ఉన్న అమెరికా గణాంకాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిసాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 260 పాయింట్లు వృద్ది చెందగా జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 80 పాయింట్లు లాభపడింది. డిసెంబర్ 3 తర్వాత అంటే దాదాపు 3 వారాల తర్వాత ప్రధాన సూచీలు ఇంత గరిష్ఠస్థాయిని తాకడం ఇదే మొదటిసారి.

12/23/2015 - 05:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వంటి కొన్ని కీలక బిల్లులకు పార్లమెంట్‌లో మోక్షం లభించకపోవడంతో దేశంలో గత కొద్ది నెలల నుంచి విధాన సంస్కరణల అమలు వేగం తగ్గిందని, ఆర్థిక వ్యవస్థపై ఇది దీర్ఘ కాలం పాటు ప్రతికూల ప్రభావం చూపుతుందని పారిశ్రామిక విభాగం పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పిహెచ్‌డిసిసిఐ) మంగళవారం స్పష్టం చేసింది.

12/23/2015 - 05:29

రాజమండ్రి, డిసెంబర్ 22: రైళ్ల వేగాన్ని పెంచడానికి వీలుగా దువ్వాడ-విజయవాడ రైలు మార్గాన్ని మరింత పటిష్టపరిచామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త చెప్పారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం దువ్వాడ నుండి రాజమండ్రి వరకు రైల్వే స్టేషన్లు, వివిధ విభాగాల్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం రాజమండ్రిలో విలేఖర్లతో ఆయన మాట్లాడారు.

Pages