S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/31/2016 - 07:42

న్యూఢిల్లీ, జనవరి 30: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 185 కోట్ల రూపాయలుగా నమోదైంది.

01/31/2016 - 07:42

ముంబయి, జనవరి 30: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. 3 వారాలుగా నష్టాల్లోనే కదలాడుతున్న సూచీలు ఎట్టకేలకు కోలుకోగా, శుక్రవారం నమోదైన లాభాలతోనే గడచిన వారం నష్టాలు తప్పడం గమనార్హం. ఈ నెలలో లాభాల్లో ముగిసిన తొలి వారం కూడా ఇదే అయ్యింది.

01/30/2016 - 05:52

కోల్‌కతా, జనవరి 29: వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) భారత జిడిపి వృద్ధిరేటు 8 శాతం అందుకోవడం సాధ్యమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుదల, ఆశాజనకమైన వర్షపాతం మధ్య వృద్ధిరేటు 8 శాతం నమోదవగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కీలక బిల్లుల అమలు విషయంలో ప్రతిపక్షాల తీరునూ విమర్శించిన జైట్లీ..

01/30/2016 - 05:49

విశాఖపట్నం, జనవరి 29: అంతర్జాతీయ మార్కెట్ ఈ ఏడాది అనేక ఒత్తిళ్లకు గురికావల్సి వస్తుందని మారిటైమ్ గేట్‌వే మాగ్జైన్ ఎడిటర్ అండ్ పబ్లిషర్ రాంప్రసాద్ అన్నారు. ఈస్ట్‌కోస్ట్ మారిటైమ్ బిజినెస్ సమ్మిట్ శుక్రవారం విశాఖలో జరిగింది. ఈ సదస్సును ఏర్పాటు చేసిన రాంప్రసాద్ ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రపంచ మార్కెట్ చాలా ఒడిదుడుకుల్లో ఉందన్నారు.

01/30/2016 - 05:47

హైదరాబాద్, జనవరి 29: నీటిపారుదల ప్రాజెక్టులతోపాటు వౌలిక సదుపాయాల కల్పన తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపాన్ బృందాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కోరారు. రాష్ట్రంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని, పరిశ్రమల స్థాపనకు విరివిగా భూములు కేటాయిస్తున్నట్టు రాజీవ్ శర్మ బృందానికి వివరించారు.

01/30/2016 - 05:46

ముంబయి, జనవరి 29: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 401.12 పాయింట్లు లాభపడి 24,870.69 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 138.90 పాయింట్లు అందుకుని 7,563.55 వద్ద నిలిచింది. దీంతో ఈ ఏడాది తొలిసారిగా ఈ వారం మార్కెట్లు లాభాల్లో ముగిసినట్లైంది.

01/30/2016 - 05:45

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌టిపిసి స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 18.90 శాతం క్షీణించింది. 2,492.87 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 3,074 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఎన్‌టిపిసి తెలియజేసింది.

01/29/2016 - 08:25

న్యూఢిల్లీ, జనవరి 28: రహదారుల నిర్మాణానికి సంబంధించి నియమ నిబంధనలను సరళతరం చేసిన ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 10 వేల కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులను అప్పగించాలని యోచిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం వెల్లడించారు.

01/29/2016 - 08:22

న్యూఢిల్లీ, జనవరి 28: అమెరికాలోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో భారతీయులు 800 కోట్ల డాలర్ల పెట్టుబడులతో కెనడియన్లు, చైనీయుల తర్వాత మూడో స్థానంలో నిలిచినట్లు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ గురువారం వెల్లడించింది.

01/29/2016 - 08:22

కర్నూలు, జనవరి 28: పర్యాటకులను ఆకర్శించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దేశ, విదేశాల్లో పర్యాటక రంగం అందిస్తున్న ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పలు పర్యాటక ప్రాంతాలు, జిల్లా కేంద్రాల్లో నూతన ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలని భావిస్తోంది.

Pages