S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/20/2015 - 05:30

వచ్చే ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టి అమలుపై మాజీ మంత్రి ఆనంద్ శర్మ

12/20/2015 - 05:29

రాబోయే పదేళ్లలో జిడిపి 7 శాతమైతే సాధ్యమే
కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా

12/20/2015 - 05:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్‌ఎఫ్‌డిఎ) నుంచి దేశీయ ఔషధరంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఓ వార్నింగ్ లెటర్ అందుకుంది. గుజరాత్‌లోని హలోల్ ఉత్పాదక కేంద్రంలో తయారవుతున్న ఔషధాల విషయంలో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఈ లెటర్‌లో సన్ ఫార్మాను యుఎస్‌ఎఫ్‌డిఎ హెచ్చరించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఉత్పాదక కేంద్రంలో యుఎస్‌ఎఫ్‌డిఎ అధికారులు తనిఖీలు చేశారు.

12/19/2015 - 05:33

ముంబయి, డిసెంబర్ 18: దేశీయ ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర.. పెట్రోల్ తయారీ కార్ల రంగంలోకి అడుగుపెట్టింది. కెయువి 100 ఎస్‌యువితో మహీంద్ర సంస్థ తమ తొలి పెట్రోల్ ఆధారిత కారును తీసుకొస్తోంది. జనవరి 15న దీన్ని మార్కెట్‌కు పరిచయం చేస్తుండగా, ఈ మోడల్ పెట్రోల్‌తోపాటు డీజిల్‌తోనూ నడవనుంది.

12/19/2015 - 05:30

కర్నూలు, డిసెంబర్ 18: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ సమీపంలో విద్యాసంస్థల సముదాయానికి కేటాయించిన 900 ఎకరాల భూమిలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు నెలకొల్పడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎడ్యుకేషనల్ హబ్ పేర ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 120 ఎకరాలు కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన విషయం విదితమే.

12/19/2015 - 05:30

ఒంగోలు, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పరిపాలనా పరమైన సంస్కరణలపై దృష్టి సారించారు. అందులో భాగంగా రెండు, మూడు జిల్లాలకు చెందిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆర్‌డిడి), రీజనల్ డైరెక్టర్ కార్యాలయాలను తొలగించి వాటిని రాష్ట్ర కార్యాలయాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

12/19/2015 - 05:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) జిడిపి వృద్ధిరేటు అంచనాను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. 8.1-8.5 శాతం నుంచి 7-7.5 శాతానికి తీసుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఆర్థిక సర్వేలో ఈసారి జిడిపి 8.1-8.5 శాతంగా నమోదవుతుందని అంచనా వేసిన విషయం తెలిసిందే.

12/19/2015 - 05:28

ముంబయి, డిసెంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులపాటు లాభాల్లో నడిచిన సూచీలు ఈ వారం ట్రేడింగ్ చివరి రోజైన శుక్రవారం మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 284.56 పాయింట్లు క్షీణించి 25,519.22 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 82.40 పాయింట్లు కోల్పోయి 7,761.95 వద్ద నిలిచింది.

12/19/2015 - 05:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: వీసా ఫీజుల పెంపు ప్రభావం భారతీయ ఐటి పరిశ్రమ ప్రగతిపై ఉండబోదని శుక్రవారం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అన్నారు. భారతీయ ఐటి సంస్థలు తరచూ ఉపయోగించే హెచ్-1బి, ఎల్-1 వీసాలపై అమెరికా కాంగ్రెస్ ప్రత్యేక ఫీజు పేరిట 4,500 డాలర్లను విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2,000 డాలర్లా లేదా 4,000 డాలర్లా అన్నది ముఖ్యం కాదని, కస్టమర్లకు సేవలందించడమే ముఖ్యమన్నారు.

12/19/2015 - 05:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికాం సంస్థ రిలయన్స్ జియో 4జి సేవలు తొలుత రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులకే అందనున్నాయి. ఈ నెల 27న రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ముఖేశ్ తండ్రి అయిన ధీరుభాయ్ అంబానీ పుట్టినరోజు సందర్భంగా రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులందరికీ 4జి సేవలను అందుబాటులోకి తేనుంది రిలయన్స్ జియో.

Pages