S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/12/2016 - 07:44

న్యూఢిల్లీ, జనవరి 11: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త సిఇఒగా సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్ని బన్సల్ నియమితులయ్యారు. తన సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ స్థానంలో బిన్ని బాధ్యతలు చేపడుతుండగా, ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఇకపై సచిన్ బన్సల్ వ్యవహరించనున్నారు. బిన్ని బన్సల్ ఇప్పటిదాకా సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు.

01/12/2016 - 07:43

న్యూఢిల్లీ, జనవరి 11: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ప్లాస్టిక్, టెక్స్‌టైల్స్ సంస్థ సింటెక్స్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం 11.14 శాతం పెరిగి 180.09 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 162.03 కోట్ల రూపాయలుగా ఉంది.

01/12/2016 - 07:42

హైదరాబాద్, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైల్ ట్రేడ్ పాలసీ 2015-20ను సోమవారం ప్రకటించింది. ఐదేళ్ల కాలానికిగాను తెచ్చిన ఈ పాలసీకి సంబంధించి ఏపి సర్కారు ఓ జివో జారీ చేసింది. గతంలో ముంబయి రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన విజ్ఞప్తి దృష్ట్యా కొత్తగా ఏర్పడిన ఏపి ప్రభుత్వం ఈ జివో జారీ చేసింది.

01/12/2016 - 07:41

విశాఖపట్నం, జనవరి 11: సాగరతీరం పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల సహాయ మంత్రి వై సుజనా చౌదరి పిలుపునిచ్చారు. భాగస్వామ్య సదస్సులో భాగంగా రెండో రోజైన సోమవారం జరిగిన పోర్టుల అభివృద్ధితో ఆర్థికంగా ముందంజ అంశంపై చర్చలో ఆయన పాల్గొన్నారు.

01/12/2016 - 07:40

మహబూబ్‌నగర్, జనవరి 11: సుందర, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ప్రపంచం ముందు ఉంచుతామని, తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, వాటన్నింటినీ వెలుగులోకి తెచ్చి మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందులాల్ అన్నారు.

01/11/2016 - 16:07

ముంబయి: స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 109 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 24,825 వద్ద ముగిసింది. 38 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 7,568 వద్ద ముగిసింది.

01/11/2016 - 07:11

న్యూఢిల్లీ, జనవరి 10: కార్పొరేట్ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లోని మూడో త్రైమాసికాని (అక్టోబర్-డిసెంబర్)కి సంబంధించి విడుదల చేసే ఆర్థిక ఫలితాలపై ఆధారపడి ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

01/11/2016 - 07:08

న్యూఢిల్లీ, జనవరి 10: విదేశీ మదుపరులు ఈ నూతన సంవత్సరం దేశీయ మార్కెట్లలో పెట్టుబడులపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్ల కంటే రుణ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా రుణ మార్కెట్లలోకి 3,700 కోట్లకుపైగా పెట్టుబడులను తెచ్చారు.

01/11/2016 - 07:07

ముంబయి, జనవరి 10: ఆసియా ఖండంలో పురాతన స్టాక్ ఎక్స్‌చేంజ్ అయిన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ).. తనకంటూ సొంత పోస్టేజ్ స్టాంప్ గుర్తింపును పొందనుంది. ఈ మేరకు కేంద్ర టెలికాం, సమాచార, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ‘బిఎస్‌ఇ కోరిక మేరకు దానికి ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను జారీ చేస్తున్నాం. నేను చాలా ఆనందిస్తున్నాను. బిఎస్‌ఇ సేవలకు ప్రభుత్వ గుర్తింపు ఇది.’ అని అన్నారు.

01/11/2016 - 07:07

అమలాపురం, జనవరి 10: ఇంతవరకు నదులు, వాగుల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను గురించి విన్నాం... కానీ ఇప్పుడు సముద్ర తీరంలోనూ ఇసుకను మింగేస్తున్నారు కొందరు అక్రమార్కులు. గత కొంత కాలంగా పెరిగిన నిర్మాణ రంగ కార్యకలాపాలతో ఇసుక బంగారంగా మారిపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో సరికొత్తగా సముద్ర తీర ప్రాంతంలోని ఇసుకను సైతం అక్రమంగా తవ్వి విక్రయించేస్తున్నారు.

Pages