S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/18/2018 - 22:44

ఒంగోలు, నవంబర్ 18: కొత్తపట్నం మండలంలోని తెలుగుతమ్ముళ్లు అంతర్మథనంలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి మండలంలో మెజార్టీ సాధించగలమా, లేక భారీనష్టాన్ని చవిచూడాల్సి వస్తుందా అన్న కోణంలో తెలుగుతమ్ముళ్లు అంచనా వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా మండలంలోని అనేక గ్రామాల్లోని తెలుగుతమ్ముళ్ల మధ్య అంతర్గత కుమ్ములాటలు జోరందుకున్నాయి.

11/18/2018 - 22:44

వెలిగండ్ల, నవంబర్ 18: మండలంలోని 21 పంచాయతీల్లో ఉపాధి పనులు కల్పించి వలసలు నివారిస్తామని జిల్లా డ్వామా అడిషనల్ డైరెక్టర్ భవాని తెలిపారు. ఉపాధిహామీ పథకం 10వ సామాజిక తనిఖీ ప్రజావేదిక స్థానిక మండల కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని కౌలు భూముల్లో రైతులు పండ్ల తోటల పెంపకం చేయకూడదన్నారు. భూమి యజమానులు మాత్రమే పండ్లతోట పెంపకానికి అర్హులని అన్నారు.

11/18/2018 - 22:43

జరుగుమల్లి, నవంబర్ 18: మండల పరిధిలోని వర్దినేనిపాలెంలో నూతనంగా నిర్మించిన దేవస్థానంలో టీటీడీ వారిచే ఆదివారం సాయంత్రం శ్రీనివాస కల్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వాహకులు పోకూరి ముసలయ్య, శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస కల్యాణ మహోత్సవ వేడుకలు కొండపి ఎమ్మెల్యే స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

11/18/2018 - 22:43

ఒంగోలు, నవంబర్ 18 : జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సరాసరిన 4.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా పొదిలి మండలంలో 37.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలిలా ఉన్నాయి.

11/18/2018 - 22:42

ఒంగోలు, నవంబర్ 18 : ఒంగోలు పారుశుద్ధ్య కార్మికులచే ఆర్‌టిఎఎస్, మైక్రోప్యాకెట్ విధానాన్ని బలవంతంగా అమలు చేయడాన్ని నిరసిస్తూ, కార్మికుల 22 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 19న మస్టర్ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. ఆదివారం స్థానిక ఎల్‌బిజి భవన్‌లో కె గోపి అధ్యక్షతన యూనియన్ నగర కమిటీ సమావేశం జరిగింది.

11/18/2018 - 22:41

మర్రిపూడి, నవంబర్ 18: కందిపంట నష్టపోయిన మండలంలోని రైతులకు ప్రభుత్వం 2017-18 సంవత్సరానికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద సుమారు ఏడుకోట్లరూపాయలు మంజూరు చేసింది. కానీ ఈ ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో వ్యవసాయశాఖ అధికారి అవకతవకలకు పాల్పడుతున్నాడంటూ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు పలు సందర్భాల్లో ఆరోపించారు.

11/18/2018 - 22:40

గజపతినగరం, నవంబర్ 18: శిల్పకళలకు నిలయంగా జయితి గ్రామం మారింది. మెంటాడ మండలంలోని జయితి గ్రామం శిల్పకళలకు ప్రసిద్ధిగాంచింది. శిలతో నిర్మించి తరతరాలుగా ఉన్న శిల్పగోపురాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. దీంతో జిల్లా ప్రజలే కాకుండా విదేశీయులు ఎక్కువ మంది ఈ శిల్పకళను చూడటానికి జయితి గ్రామం వస్తున్నారు. ఉత్తరాంద్రలో అపూర్వ శిల్పకళా సంపద ఉన్న దేవాలయాలలో జయితి శ్రీ భ్రమరాంభిక మల్లిఖార్జున ఆలయం ఒకటి.

11/18/2018 - 22:39

గజపతినగరం, నవంబర్ 18: అగ్రి గోల్డ్ బాధితులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెలగాటం ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ నాయకుడు బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఆదివారం ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తన స్వలాభం కోసం అగ్రిగోల్డ్ సంస్ధను నిర్వీర్యం చేసి లక్షలాది మంది ఖాతాదారుల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని తెలిపారు.

11/18/2018 - 22:37

కొత్తవలస, నవంబర్ 18: మండలంలోని 25 పంచాయతీలతోపాటు కోనమసివానిపాలెం పంచాయతీ కలిపి విద్యుత్ బకాయిలను సంబంధిత శాఖకు ఈనెల 25లోగా చెల్లించాలని కొత్తవలస విద్యుత్‌శాఖాధికారి బోకం రవి తెలిపారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పంచాయతీల వారీగా విద్యుత్ సంస్ధకు రావాల్శిన బకాయిల జాబితాను విడుదల చేశారు. 2017 మార్చినెల నుండి నవంబర్ 2018వరకు గల బకాయిలను వివరించారు. మొత్తం 34,55,980 రూపాయలని తెలిపారు.

11/18/2018 - 22:37

విజయనగరం, నవంబర్ 18: ప్రతీ ఏటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను స్థానిక గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. యువత సర్వతోముఖాభివృద్ధికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. విజ్ఞానానికి విరామకాల సద్వినియోగానికి విశేష జ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు మానవజీవితంలో విడరాని సంబంధం కలిగి ఉంటున్నాయి.

Pages