S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

09/24/2017 - 00:28

‘నాకుతెలిసి రచయితలు సమాజాన్ని చైతన్యం చేయడానికే ఉంటారు. వారి లక్ష్యం, రచనలు ఆ దిశగానే సాగుతుంటాయి. కానీ కొందరిని విద్వేషిస్తూ, సమాజంలో చిచ్చు రేపేవారు రచయితలు అనిపించుకోరు. రచయితలకు చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తించడం సరికాదు. చేతిలో పెన్ను ఉంది కదా అని ఏదంటే అది ఎవరిమీదంటే వారిపైన రాయడం రచయితల లక్షణం కాదు. రచయితలకు ప్రత్యేక చట్టాలేమీ ఉండవు. వైశ్యులు స్వభావసిద్ధంగా ఎవరి జోలికీ వచ్చేవారు కాదు.

09/22/2017 - 23:33

ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎవ్వరు చేయనన్ని విదేశీ పర్యటనలను చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఆయనను గొప్ప నాయకుడిగా ప్రజలముందు ఉంచడం కోసం ఒక వంక కేంద్ర ప్రభుత్వం, మరోవంక బిజెపి విశేష ప్రయత్నాలు చేస్తున్నాయి.

09/22/2017 - 00:08

ఒకపట్టణంలో గొప్ప మేధావిగా పేరొందిన ఒక వ్యక్తి వుండేవాడు. అదే పట్టణంలో మూర్ఖుడుగా చెలామణి అవుతున్న ఓ అవివేకి కూడా ఉన్నాడు. ఓరోజు ఈ అవివేకి తెలివిగల మేధావి దగ్గరకువచ్చి , తాను తెలివిగల వాడిగా కావడానికి ఏదైనా దారి చూపించమన్నాడు. అందుకు ఆ అపరమేధావి ‘నీవు తెలివిగలవాడిగా మారాలనుకుంటున్నావా! లేక అలా కన్పించాలనుకుంటున్నావా? అన్నాడు. ఎందుకంటే తెలివిగల వారిలా కావడం ఒక సుదీర్ఘ ప్రక్రియ.

09/20/2017 - 21:57

బర్మాలోని ‘రోహింగియా’ ప్రజలు మన దేశానికి ఇతర దేశాలకు వలసలెత్తడానికి ప్రాతిపదిక ‘రోహింగియా’లలోని జిహాదీ బీభత్సకారులు! బర్మాను మత ప్రాతిపదికపై విభజించాలని ‘కలలు’ కంటున్న జిహాదీలు క్రీస్తుశకం 1948 నుంచి బర్మాలోని అధిక సంఖ్య బౌద్ధులపై హత్యాకాండ కొనసాగించారు, ఇప్పటికీ కొనసాగిస్తూన్నారు! బర్మాను విభజించాలన్న ‘పగటికల’ అఖండ భారత విభజనతో ముడివడివుంది!

09/20/2017 - 01:15

బహుశా ప్రపంచ చరిత్రలో తెలంగాణ విముక్తి ఉద్యమమంతటి అద్భుతమైన పోరాటం మరొకటి లేకపోవచ్చు, పోరాటం ముగిసి ఏడు దశాబ్దాలు గడిచిన తరువాత కూడా అది విలీనమా? విమోచనమా? విముక్తినా? అనే చర్చలు సాగిన అంశమూ చరిత్రలో మరోటి ఉండి ఉండదు. తెలంగాణ సాయుధ పోరాటం ముగిసిన ఏడు దశాబ్దాల తరువాత కూడా ఇది విలీనమో విముక్తో? ఆక్రమణలో మేధావులు తేల్చ లేకపోతున్నారు. ఎవరికి వారే బలమైన వాదనలు వినిపిస్తున్నారు.

09/18/2017 - 23:58

ఇటీవల దక్షిణ భారతంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అందులో మొదటిది బెంగుళూరులో గౌరీ లంకేష్ హత్య. ఈమె లంకేష్ అనే సుప్రసిద్ధ జర్నలిస్టు కుమార్తె. తండ్రి తర్వాత తానే పత్రికా నిర్వహణ బాధ్యత వహించింది. మొదటినుంచి వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రతి సంచికలోను విమర్శిస్తూ వుండేది.

09/18/2017 - 01:00

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఒడిస్సాలోని స్థానిక రాజకీయ గూండాల అక్రమాల్ని రిపోర్టు చేసినందుకు ఓ స్థానిక దినపత్రిక రిపోర్టర్ భార్య అయిన చాచిరాణిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపారు. నాడు ఇదో సంచలన వార్త! ఎంత నిజాయితీపరులైన జర్నలిస్టులుగాని ఇలాంటి ఘటనలతో తిరిగి ఇదే వృత్తిని కొనసాగించే సాహసం చేయలేరు. పైగా జీవచ్చవంలా మారిపోతారు. లేదా ఆత్మహత్య చేసుకుంటారు.

09/17/2017 - 02:27

ప్రశ్నించేందుకే పార్టీ పెడుతున్నానని మూడేళ్ల క్రితం తెరపైకి వచ్చిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మూడేళ్ల సంబరం సందర్భంగా చేసిన ట్వీట్ ముచ్చటేసింది. ‘మూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం మొదలు పెట్టిన నాకు దారంతా గోతులు. చేతిలో దీపం లేదు. ధైర్యమే కవచంగా ఒకే గొంతుకతో మొదలుపెట్టా.

09/16/2017 - 02:14

బ్రిటిష్‌వారు దేశం వదలి వెళ్లిపోవటంతో, అప్పటివరకు వారి సామంత రాజుగా కొనసాగిన తాను ఇక స్వతంత్ర రాజ్యాధిపతినని విర్రవీగిన నిజాం మెడవంచి, భారత్‌లో విలీనం కావడం తప్ప గత్యంతరం లేని పరిస్థితులను సృష్టించడంతో 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగింది. మతోన్మాదం సృష్టించిన తీవ్ర అరాచక పాలన నుండి ప్రజలు విముక్తులయ్యారు.

09/14/2017 - 23:38

ఓనిజాము పిశాచమా!
కానరాడు! నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ!

Pages