S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

11/07/2017 - 23:50

వేధింపులకు పాల్పడేవారికి కఠిన శిక్షలకు సంబంధించిన సమగ్ర చట్టం భారతదేశంలో లేదనే చెప్పాలి. వేధింపులకు శిక్షలు ఉన్నా, వేధింపులు జరిగినట్టు రుజువు చేసేందుకు సాక్ష్యాధారాలు లేకపోవడంతో అవన్నీ కోర్టుల ముందు నిలవలేకపోతున్నాయి. పోలీసు కస్టడీలో నాలుగు గోడల మధ్య జరిగే వేధింపులను బాధితుడు రుజువు చేసుకునే స్థితి ఎన్నడూ లేకపోవడంతో యధేచ్ఛగా వేధింపులు జరుగుతున్నాయి.

11/06/2017 - 23:16

ప్రస్తుతం భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలల్లో హిందువులు మైనారిటీలో వున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ముస్లిములు మెజారిటీలో వున్నారు. అయినా రిజర్వేషన్ల చట్టం అక్కడ మైనారిటీ హిందువులకు వర్తించదు. నాగాలాండ్, అరుణాచలప్రదేశ్‌లల్లో క్రైస్తవులు మెజారిటీలో ఉన్నారు. ఐనా వారు రిజర్వేషన్ సౌకర్యాలు పొందుతున్నారు. పంజాబ్‌లో సిక్కులు ఆర్య సామాజికులు మెజారిటీలో ఉన్నారు. అక్కడ హిందువులు మైనారిటీలో ఉన్నారు.

11/06/2017 - 04:24

ఎవరివి, ఎవరివి ఈ సభలు?
జలగం బలగంవి ఈ సభలు!
ఎందుకు, ఎందుకు ఈ సభలు?
దొరల విందులకు ఈ సభలు!

11/05/2017 - 00:13

రాజకీయాలు అనుకోని మలుపు తిరిగితే ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా మారుతున్న పరిణామాలు చూస్తే అర్ధమవుతుంది. తెలంగాణ తెలుగుదేశం మాజీ సీమటపాకాయ్ కాస్తా కాంగ్రెస్ తాజా ఆటంబాంబుగా మారిన వైనం ప్రత్యక్షంగా తెలంగాణ, పరోక్షంగా ఏపి స్పీకర్లకు నైతిక సంకటంగా పరిణమించడం అనుకోని పరిణామమే మరి.

11/03/2017 - 23:08

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ చేపట్టడానికి రంగం సిద్ధం అవుతున్నది. కేవలం తల్లి సోనియా గాంధీ నుండి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడమే కాకుండా మొత్తం పార్టీలో నూతన తరం నాయకత్వం చేపట్టే విధంగా చేయడం కోసం రాహుల్ గాంధీ చాలాకాలంగా కసరత్తు చేస్తున్నారు. పార్టీలో కీలక అధికార కేంద్రాలు కూడా మారే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.

11/03/2017 - 00:50

‘నేను దేన్నైనా సాధించగలను. ఎందులోనైనా నేనే విజయం సాధిస్తాను. నేను చేయలేని పని ఈ ప్రపంచంలో ఏదీ లేదు’ అన్నాడు భర్త తన భార్యతో! ఈ డైలాగులు దూరం నుండి వింటున్న ఐదేళ్ల కొడుకు చింటూ గభాలున పరుగెత్తుకుంటూ వచ్చి ‘నాన్నా! నేను చెప్పింది చేయగలవా?’ అన్నాడు. ‘ఏంట్రా?’ అన్నట్టు మొహం పెట్టాడు తండ్రి. పరుగెత్తుకొంటూ వెళ్లిన చింటూ క్షణాల్లో ఇంట్లో ఉన్న కోల్గేట్ పేస్ట్ తీసుకొచ్చి, తండ్రి చేతికి ఇచ్చాడు.

11/01/2017 - 21:50

స్పెయిన్ దేశం నుంచి విడిపోవాలని ‘కాటలోనియా’ అన్న ప్రాంతంలో ఉద్యమం జరుగుతుండడం ఐరోపాలోని ‘్భషా’ వైరుధ్యాలకు మరో సాక్ష్యం! వైవిధ్యాల మధ్య సమన్వయం లేకపోవడం, వైవిధ్యాలు వైరుధ్యాలన్న ‘్భవం’ లేదా ‘భ్రాంతి’ ఆవహించడం ఐరోపాలోని వివిధ దేశాలలో కొనసాగుతున్న ‘విచ్ఛిన్న ఉద్యమాల’కు కారణం!

11/01/2017 - 00:48

ఎక్కడ చూసినా ఆధార్ గురించి చర్చ జరుగుతోంది. వచ్చే నెల ఆఖరులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ విశిష్ట సంఖ్య గోప్యత, భద్రత, వివిధ పథకాలకు అనుసంథానం అంశాలపై చర్చించనుంది.

10/30/2017 - 22:14

దేశంలో పరిస్థితులు నానాటికీ తీసికట్టు చందంగా మారిపోతున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. కొందరి చేష్టలు, ప్రకటనలు ఆందోళనకలిగిస్తున్నాయి. ఆయా పరిస్థితులపై వచ్చే ప్రశ్నలకు సమాధానాలు దొరకబట్టడం కష్టమే. జాతీయత, దేశభక్తి వంటివి గాలికి వదిలేశారు. సొంత అజెండాలతో అడుగులు వేస్తున్నారు. ఇవి ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిజేష్ మిశ్రాకు లోగడ పద్మ విభూషణ బిరుదునిచ్చి సత్కరించారు.

10/30/2017 - 00:39

కొడిగడుతున్న దీపం ఎప్పుడైనా ఆరిపోతుంది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల విద్యారంగం తీరు దీనికి భిన్నంగా లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడిందనే సంబరం లేక తెలంగాణలో, అవశేష (నిజానికి విశేష) రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్య పెనంపై నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. విభజన జరిగినవెంటనే ఇరు ప్రాంతాల్లో పునరుర్జీవం పొందాల్సిన విద్యారంగం మరింత పతనపు అంచులకు చేరుకుంది.

Pages