S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

07/08/2016 - 03:17

అణుశక్తిని సాధించడం దేశ రక్షణ అవసరాలలో చాలా ముఖ్యమైనది. అణ్వాయుధాలు కలిగి వున్న దేశంగా ప్రపంచ పటంలో గుర్తింపు పొందడం వ్యూహాత్మకమైన చర్య. అవి ప్రయోగించకుండానే కలిగి వున్న దేశంగా పొరుగు దేశాలకు భయం కలిగించడమే ఆ వ్యూహం లక్ష్యం. మన ఇరుగు పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లు మన దేశంపై దాడులు చేసాయి. భూభాగాలను ఆక్రమించాయి. ఇప్పటికీ వాటితో మన సంబంధాలు అంత బాగాలేవు.

07/07/2016 - 07:08

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జూన్ నెల 26వ తేదీ నుంచి జూలై ఒకటవ తేదీ వరకు చైనాలో జరిపిన వాణిజ్య పర్యటన గొప్ప చారిత్రక సంఘటన! ఈ ‘వాణిజ్యం’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి, అవశేష ఆంధ్రప్రదేశ్ నుండి దశాబ్దులుగా చైనాకు దొంగగా ఎగుమతి అవుతున్న ఎర్రచందనం కలపతో ముడివడి ఉంది. ఈ ‘వాణిజ్యం’ ఏళ్లతరబడి చైనీయ ‘సంప్రదాయ వైద్యచికిత్స’ భోంచేస్తున్న మన పులులతో ముడివడి ఉంది.

07/06/2016 - 01:06

రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా సెప్టెంబర్ 4న తన పదవీ కాలం పూర్తయిన తరువాత తాను ఇంకా కొనసాగాలని కోరుకోవడంలేదని రఘరామ్ రాజన్ ప్రకటించగానే దేశంలో ఏదో పెద్ద ఉపద్రవం జరగబోతోందనే ఆందోళనలు బయలుదేరాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందా అన్నంత భయాందోళనలు కలగచేసారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి మేధావుల అవసరం లేదని రాహుల్‌గాంధీ అవహేళన చేసారు.

07/05/2016 - 04:39

హైదరాబాద్ నగరం ఐసిస్ గుప్పెట్లోకి వెళ్లిందనే విషయం ఇవ్వాళ కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వచ్చిందని అనుకోవటం పొరపాటు. 2015వ సంవత్సరం నిక్కీ జోసఫ్ అనే ఐసిస్ ఉగ్రవాద నాయకురాలిని అరెస్టుచేసినప్పుడే ఈ విషయం బహిర్గతమయింది. ఇంటిలిజెన్స్ వర్గాలు హైదరాబాద్ పాతబస్తీలో ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్ సెంటర్ ఉందని హెచ్చరించినా కాంగ్రెసు ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

07/04/2016 - 04:40

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని భవనాలకు గత బుధవారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం జరగటం, ప్రభుత్వ సిబ్బంది తమ కార్యాలయాలలోకి ఆనందోత్సాహాలతో ప్రవేశించడం, ఆ సంరంభాలను టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలతో గమనించడం శాశ్వతంగా గుర్తుండిపోయే దృశ్యాలు. ఆ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆలోచించిన వారికి బహుశా రెండు భావనలు కలిగివుంటాయి.

07/03/2016 - 02:08

పెద్దవాళ్లు చిన్నపిల్లల చేష్టలు చేస్తే ఎలా ఉంటుంది? ఏపి-తెలంగాణ ప్రభుత్వాల గొడవల్లా ఉంటుంది! హైకోర్టు విభజనపై తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న తగాదాల్లో ఇంతకూ తప్పెవరిది? పరిష్కారకర్త ఎవరన్నది బ్రహ్మపదార్ధం మాదిరిగా తయారయింది. అం దరూ తమ తప్పు లేదంటే తమ తప్పు లేదని అడ్డంగా వాదించేవారే. ఇద్దరినీ కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాల్సిన గవర్నర్ గుళ్లు, గోపురాలు, విందుల్లో బిజీగా ఉన్నారు.

07/02/2016 - 02:43

పెద్దలు బడికి-పిల్లలు పనికి అని అంటే, వ్యాసకర్తకు పిచ్చెక్కిందని అనుకోవచ్చు. సర్వశిక్షా అభియాన్ 2003 నుంచి దీనికి విలోమమైన నినాదాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చింది తెలిసిందే. ఈ నినాదానికి దశాబ్దన్నరకాలం పడితే, బ్రిటీషు కాలంనుంచే పోరు సలపగా, విద్య ఓ హక్కుగా మారడానికై వంద సంవత్సరాలు పట్టింది. చట్టంగా రూపొందడానికి ఏడు సంవత్సరాలు తీసుకుంటే, అమలుకు నిర్దేశించడానికై ఏడాది పట్టింది.

06/30/2016 - 23:50

ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థా యిల్లో రూపొందించే పాఠ్యపుస్తకాలు ఆయా తరగతులకు అనుకూలంగా ఉండేవిధంగా రచించాలి. పుస్తక రచనలో విషయ నిర్దిష్టత, యోగ్యత, ఔపయోగిత, అనుసరణీయత, ఆచరణయోగ్యత, బోధ నా సౌలభ్యం మొదలైన అంశాలను మూల్యాంకన అంశాలుగా గ్రహించి అత్యంత ప్రాధాన్యతనీయడం జరగాలి.

06/30/2016 - 04:57

స్వరూప ఏకత్వం అంతర్గత వైరుధ్యాలను తొలగించలేదనడానికి ఇటీవల బ్రిటన్ ప్రజలు చెప్పిన తీర్పు నిదర్శనం. ఐరోపా సమాఖ్య నుంచి నిష్క్రమించాలని జూన్ 23వ తేదీన బ్రిటన్ ప్రజలు నిర్ణయించడం చారిత్రక పునరావృత్తికి మరో ఆరంభం. ఐరోపాలోని వివిధ దేశాలవారు శతాబ్దులపాటు పరస్పరం కలహించడం చరిత్ర. రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, వ్యూహాత్మక ఆధిపత్యంకోసం ఐరోపా దేశాలవారు పోటీ పడడం ఈ చరిత్రకు ప్రాతిపదిక.

06/29/2016 - 00:17

గతంతో పోలిస్తే ప్రపంచం మొత్తం మరింత దౌర్భాగ్య స్థితిలోకి నెట్టివేతకు గురవుతోందా? లేక సరికొత్త సమతుల్యం వైపునకు ప్రయాణిస్తోందా? ‘బ్రెగ్జిట్’ ప్రజాభిప్రాయసేకరణ పుణ్యమాని బ్రిటన్ ఐరోపా సమాజం నుంచి వైదొలగుతున్నది. ఇదే సమయంలో బ్రిటన్ పరిణామాలు ఫ్రాన్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ‘‘ఫ్రెగ్జిట్’’కోరుకునే వారు తమ గళాలను సవరించుకుంటున్నా రు. వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Pages