S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

01/28/2016 - 04:36

కాయధాన్యాలు నిజంగా నేలకు, మనుషులకు, భూమికి నిజంగా నాడి వంటివే. గాలిలో ఉన్న నత్రజనిని భూమిలో స్థాపితం చేయడం ద్వారా మన పంట పొలాలకు జీవాన్ని ఇచ్చేవి ఈ కాయధాన్యపు మొక్కలే. పురాతన నాగరికతలకు చెందిన ప్రజలు భూసారాన్ని పరిరక్షించుకోగలిగారంటే కేవలం ఈ కారణం వల్లనే. వ్యవసాయం కేవలం హరితవిప్లవం ద్వారానో లేక సింథటిక్ నత్రజని ఎరువుల ద్వారానో ప్రారంభంకాలేదు. వైవిధ్య వ్యవస్థల-పంట మార్పిడి- ద్వారా భారత్‌లోను..

01/27/2016 - 03:19

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓ ఏడాదిన్నర క్రితం వరకు, ఒకరి తరువాత మరొకరు అధికారంలో వున్న రాజకీయ పార్టీల నాయకులంతా, మేమంటే-మేం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామంటూ ప్రచారం చేస్తున్నారు. గత ఏబై ఏళ్లుగా అధికారంలో వుండి కూడా ఆ ఇరుపార్టీలు చేయలేని అభివృద్ధిని, తమ ఐదేళ్లపాలనలో చేసి చూపిస్తామని అధికార తెరాస పార్టీకి చెందిన నాయకులు చెప్తున్నారు.

01/25/2016 - 23:35

మనం తిరుమల కొండ ఎక్కుతుంటే ప్రతిచోట ‘్ధర్మోరక్షతి రక్షితః’ అనే సూక్తి కన్పడుతుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనలను రక్షిస్తుంది అని ఈ సంస్కృత సూక్తికి అర్ధం. అంటే భారత రాజ్యాంగాన్ని మనం రక్షిస్తే రా జ్యాంగం మనలను కాపాడుతుంది అని తాత్పర్యం. 2016 గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకొని వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంది.

01/24/2016 - 23:54

మరొక వారం రోజులలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో ఎవరు గెలవగలరన్నది ఆసక్తికరంగా మారటానికి పలు కారణాలున్నాయి. ఇది తెలంగాణలోనే గాక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆసక్తికరమైంది. అందుకు కూడా కొన్ని కారణాలున్నాయి. అట్లానే వివిధ కారణాలవల్ల ఈ ఎన్నికలు అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్షాలలోని కాంగ్రెస్‌కు, టిడిపి బిజెపి కూటమికి ముఖ్యమవుతున్నాయి.

01/23/2016 - 21:48

మళ్ళీ దళిత రాజకీయం తెలంగాణ రాజధాని హైద్రాబాద్ నడిబొడ్డున జడలు విప్పింది. హైద్రాబాద్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. చేస్తున్న వేముల రోహిత్ ఆత్మహత్యతో రాజకీయ పక్షాలన్నీ ఏకం అయ్యాయి. కొందరు అతన్ని అంబేద్కరిస్టు అన్నారు. కొందరు దళితుడన్నారు. కొందరు అతనితో తీవ్రవాదానికి జైకొట్టించారు. అతను ఉరివేసుకున్న తరువాత ఎర్రజెండాలతో ధర్నాలు చేస్తున్నారు.

01/22/2016 - 23:32

ఈ ప్రపంచంలో దుఃఖం అత్యధిక స్థాయిలో ఉండటానికి కారణం తృష్ణ. అంతులేని తృష్ణ అని 2500 ఏళ్ళ క్రితమే చెప్పాడు గౌతమబుద్ధుడు. ధన తృష్ణ, అధికార తృష్ణ, రాజ్యకాంక్ష లాంటివన్నీ మనిషి బతుకును దుఃఖమయం చేస్తున్నాయన్నది వాస్తవం. మనిషి బతుకును సుఖమయం చేసుకోవాలంటే కోరికలనన్నిటినీ చంపుకొని యోగిగా ఉండమని గౌతముడెప్పుడూ చెప్పలేదు. ఎక్కడా చెప్పలేదు.

01/21/2016 - 23:51

గత లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని విజయపథంవైపు నడిపించిన నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో రాజకీయ, పరిపాలన అనుభవంతో పార్టీలో అందరికన్నా సీనియర్ అయిన సుష్మాస్వరాజ్‌కు మంత్రివర్గంలో అసలు స్థానం లభిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంత్రివర్గ కూర్పు గురించి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అరుణ్‌జైట్లీతో సమాలోచనలు జరిపిన ప్రధానమంత్రి ఆమెను అసలు సంప్రదించలేదు.

01/21/2016 - 04:18

చివరికి గాలి పటాలను ఎగురవేయడానికి అవసరమైన ‘దారం’కూడ చైనా నుండి దిగుమతి కావడం ద్వైపాక్షిక వాణిజ్య ‘‘మైత్రి’’కి పరాకాష్ఠ! చైనానుండి గణేశుని విగ్రహాలు పదేళ్ల క్రితమే దిగుమతి అయిపోయాయి. ఫలితంగా మన దేశంలోని ఈ బొమ్మల తయారీ ‘పరిశ్రమ’ కొనే్నళ్లు మూలపడింది.

01/20/2016 - 05:11

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ఎలా అయినా ఉండవచ్చు, ఎన్నికలు జరగకముందే ఒక కీలకమైన విషయంలో మాత్రం ఈ ఎన్నికలు స్పష్టత నిచ్చాయి. కెసిఆర్ రాజకీయ వారసుడు ఎవరు? అనే ప్రశ్న ఉదయించక ముందే కెసిఆర్ వారసుడు కెటిఆర్ అని తేల్చేశాయి. ఎన్నికలు జరుగుతాయా? లేదా? జరిగితే ఎప్పుడు అని విపక్షాలు ఆయోమయంలో ఉన్న కాలంలోనే కెటిఆర్ హైదరాబాద్‌ను చుట్టు ముట్టేశారు.

01/18/2016 - 23:43

వేయేండ్లుగా భారత్ ఉగ్రవాదుల దాడికి గురిఅవుతూనే ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, బ్రిటన్, రష్యా, సిరియా, ఇరాక్, సౌదీ అరేబియాలకు కూడా విస్తరించింది. ఉగ్రవాదానికి హిందూ, ముస్లిం, క్రైస్తవ భేదాలు లేవు. ఇదొక పిశాచ తాండవం. ఇదొక భస్మాసుర హస్తం!! ‘‘బాబూ! ఉగ్రవాదం చాలా దుర్మార్గమైనది. తల్లిగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. అర్థిస్తున్నాను. ఐఎస్‌ఐఎస్ కార్యకర్తగా పనిచేయవద్దు.

Pages