S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

01/01/2017 - 00:19

మెరుపులు, మరకలతో ఓ ఏడాది చరిత్ర గర్భం లో కలసిపోయింది. హెచ్‌సియులో రోహిత్ వేముల మృ తితో మొదలైన వివాదాల పరంపర పెద్దనోట్ల రద్దు, త మిళ ‘పురచ్చితలైవి’ జయలలిత అనుమానాస్పద మృ తితో 2016 ముగిసిపోయింది. రోహిత్ వేములను దళితుడిగా ప్రచారం చేసిన వామపక్షాలు చివరాఖరకు అతను దళితుడుకాదు, బీసీ అని తేలడంతో కంగుతినాల్సి వచ్చింది.

12/31/2016 - 00:19

లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదన ఎన్నికల నిర్వహణలో విప్లవాత్మక సంస్కరణలకు నాందిగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలతోపాటు శాసనసభల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహిస్తే అవినీతికి, విశృంఖల ధనప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతోపాటు ఎన్నికల ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. ఈ ప్రతిపాదనను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సైతం బలంగా సమర్ధించారు.

12/30/2016 - 00:13

‘ఆత్మహత్య కన్నా తీవ్రమైన తాత్త్విక సమస్య మరొకటి లే దు. జీవించడం అవసరమా? అనవసరమా? అనే వి షయం తత్త్వ శాస్త్రానికి సంబంధించిన మూలాధార ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతుంది. మిగతావన్నీ దాని తర్వాత వచ్చే విషయాలు’ అని అంటాడు ప్రపంచ ప్రఖ్యాత రచయిత ఆల్బర్ట్ కేమూ తాను రచించిన ‘మిథ్ ఆఫ్ సిసిఫస్’గ్రంథంలోని ‘ఆత్మహత్య, అసంబద్ధత’ అనే మొదటి అధ్యాయంలో.

12/29/2016 - 07:29

భాగ్యనగరంలోని ఒక రైతుబజార్ ప్రాంగణంలో ఆకుకూరలు, కూరగాయలు అమ్మే వారు కొలువుదీరి ఉన్నారు. ఎక్కువమంది విక్రేతలు గ్రామీణ మహిళలు. ఆ పక్కనే మహానగర పాలిక వారు ఏర్పాటుచేసిన భారీ ‘చెత్తబుట్ట’ కూడా ఉంది. భయంకరమైన చెత్త పొంగిపొరలుతూ ఉన్న దృశ్యాన్ని కూరలు కొనేవారు దర్శించక తప్పదు! ఎందుకంటే భరించరాని దుర్గంధం మన దృష్టిని ఆ ‘వ్యర్థ పదార్థ భాండారాగాం’ వైపు మళ్లించకమానదు!

12/27/2016 - 23:31

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు బలహీనపడటం 2014 ఎన్నికల నాటినుంచి కన్పిస్తున్నదే. ఆ బలహీనత ఎంతన్నది ఇపుడు పెద్దనోట్ల రద్దు తర్వాత మరింత బాగా స్పష్టమవుతోంది. ప్రధాని మోదీ తీసుకున్న ‘పెద్దనోట్ల రద్దు’ నిర్ణయం ప్రజలకు తాత్కాలిక ఇబ్బందులను కలిగిస్తున్నా, ఆ చర్య మునుముందు చాలా మేలు చేసేదీ, లేనిదీ ఇంకా స్పష్టం కావటం లేదు.

12/26/2016 - 23:45

అవును.. ఇది నమ్మలేని నిజం.. అది- దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీ కొలువుదీరే కుర్చీలకు అవతల- తారిక్ సిద్ధిఖీ అనే నేత ఈనెల 13న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటూ నిఘా కెమెరాలకు చిక్కాడు. దీనికి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారు? సిద్ధిఖీ ఒక్కడే కాదు..

12/26/2016 - 02:37

నల్లధనాన్ని వెలికి తీయాలంటే ‘నోట్ల రద్దు’ను ఆయుధంగా వాడాలని ‘ది కర్స్ ఆఫ్ క్యాష్’ (్దళ షఖూఒళ యచి ష్ఘఒ్ద) అనే పుస్తకాన్ని రాసిన అమెరికా రచయిత కెనె్నత్ రోగఫ్ (ళశశళఆ్ద గ్యయఛిచి) కూడా మన ప్రధాని మోదీ తీసుకున్న చర్యల్ని తప్పుపట్టాడు. ఓ క్రమపద్ధతిలో చేపట్టాల్సిన చర్యల్ని ఒకే మంత్రదండంతో సాధించాలనుకోవడం పిచ్చి చేష్టలుగా ఆయన అభివర్ణించడం గమనించాలి.

12/24/2016 - 23:36

‘మలి అడుగు వేయాలా? లేక
యుద్ధం నుంచి విరమించుకోవాలా?
ఏ దారి నేను పయనించాలి?
ఒక కల జన్మించి మరణించింది
వసంతకాలంలో తోట ఎండిపోయింది
ఎండుటాకులను ఏరుతూ కూర్చోవాలా?
కొత్త విశ్వాన్ని సృజించాలా..?
ఏ దారి నేను పయనించాలి?’

12/24/2016 - 00:59

దేశంలో సంస్కరణల పరంపర కొనసాగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణప్రదమైన ఎన్నికల ప్రక్రియను సంస్కరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. రెండు వేల రూపాయలకు మించి విరాళాలిచ్చే దాతల వివరాలను ప్రకటించాలని, గత పదేళ్లలో ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీచేయని పార్టీల గుర్తింపును రద్దుచేయాలని ఎన్నికల సంఘం సూచించింది.

12/23/2016 - 00:43

‘‘ఒంటరిగా వున్న వ్యక్తి ఒంటరితనం కారణంగా ఉన్మాదావస్థకు లోనవుతాడు. మానసిక స్వాస్థ్యాన్ని వివిధ ఉన్మాదాల సంయోగంగా అభివర్ణించవచ్చు-’’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త బెర్‌ట్రాండ్ రసెల్ తాను రచించిన ‘‘ప్రసిద్ధ వ్యక్తుల పీడకలలు’’ (నైట్‌సోర్స్ ఆఫ్ ఎమినెంట్ పెర్‌సన్స్) అనే గ్రంథంలో.

Pages