S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

06/24/2017 - 01:01

ప్రజాస్వామ్య భారతదేశంలో 42 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక చీకటి అధ్యాయానికి తెరలేచింది. ఇందిరాగాంధీ తన స్వప్రయోజనాలకోసం చేసిన సిఫార్సులతో, అప్పటి రాష్టప్రతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అప్పట్లో అందరూ భయపడుతున్నట్లుగానే 1975 జూన్ 26న (25వ తేదీ అర్ధరాత్రి) ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జన్సీ ప్రకటించింది.

06/23/2017 - 00:42

రెండు నెలల క్రితం హైదరబాద్‌లో సిపిఎం వాళ్లు తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘సమర సమ్మేళనం’ నిర్వహించారు. ఆ తర్వాత కెటిఆర్, హరీశ్‌రావు ‘కేసీఆర్‌ను మించిన కమ్యూనిస్టు’ ఇంకెవరూ లేరన్నారు. ఇటీవల శ్రీత్రిదండి చినజీయర్ స్వాముల వారు సైతం ‘నేనూ కమ్యూనిస్టునే’ అన్నారు. నిజంగా.. కమ్యూనిజం అంత పవిత్రమైనదా?

06/21/2017 - 01:45

ఎవరైనా తమ లోపలి భావాలను అనుభవించడానికి మించిన అనుభూతి మరొకటి ఉండదు. అందుకు దగ్గర దారి ‘యోగ’. యోగ అనేది మతం కాదు. విజ్ఞాన శాస్త్రం, మానవత్వంతో కూడిన లాభదాయకమైన శారీరక సాధన. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ తెలివైన విజ్ఞాన శాస్త్రంలోకి ప్రవేశించింది. భారతదేశం యోగ, ధ్యానం, తత్త్వశాస్త్రం, జ్ఞానం, సంస్కృతి, ఆధ్యాత్మికత కలిగిన ప్రాంతంగా పాశ్చాత్యదేశాలు ఎన్నడూ పరిగణించలేదు.

06/20/2017 - 01:09

‘రోహింగ్యా’లు మయన్మార్‌లోని రాఖినీ రాష్ట్రంలో నివసించే ముస్లింలు. ఇటీవలి కాలంలో కాశ్మీర్ ప్రాంతంలో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీరు వలసల రూపంలో పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, దిల్లీ మీదుగా వచ్చి కాశ్మీర్‌లోని జమ్మూ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. మన దేశంలోకి అక్రమంగా చొరబడుతూ వీరు ఇలా స్థిరపడటంలో కాశ్మీరీ ముస్లింల సహకారం వీరికి దండిగా ఉంది.

06/19/2017 - 01:40

పోటీ, నాణ్యత ఉత్పత్తికి, మార్కెట్‌కు సంబంధించిన మాటలు. మానవీయత, నిజాయితీ, నిబద్ధత, జవాబుదారీతనం, హేతుబద్ధత, మానవ వనరులకు సంబంధించిన పారిభాషిక పదాలు. ఈ రెండు ఒకదానికొకటి సంబంధించినవి కాకపోగా, సమాంతరాలు కూడా కావు. పెట్టుబడి అనే ఆర్థిక పదం మానవ వనరులను ఉత్పత్తికి సంబంధించిన అంశంగా మార్చివేసింది. విద్యారంగాన్ని పూర్తిగా విషపూరితం చేసింది.

06/18/2017 - 01:16

ఓ దక్షిణాది ఆంగ్ల దినపత్రిక తన మొదటి పేజీ ప తాక శీర్షికలో అరచి గగ్గోలు పెట్టింది- ‘మధ్యప్రదేశ్‌లో రెండు రోజుల్లో ఇద్దరు కర్షకుల ఆత్మహత్య’ చేసుకున్నారని! హైదరాబాద్‌లోని మిగతా ఆంగ్ల దినపత్రికల్లో ఆ రోజు ఈ వార్తే కనిపించలేదు. ఏ వార్తకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆ పత్రికల స్వేచ్ఛకు సంబంధించిన అంశమే.

06/17/2017 - 02:03

‘నా దృష్టిలో ఒక గోవుని చంపడమంటే ఒక మనిషిని హత్య చేసినంత పాపం చేయడమే.. స్వరాజ్య ఉద్యమం కన్నా గోరక్షా ఉద్యమమే నాకు అత్యంత ప్రధానమైనది..’ అని స్వాతంత్య్ర సంగ్రామ కాలంలోనే జాతిపిత గాంధీజీ అన్నారు.

06/16/2017 - 00:35

‘కాంతులు విరజిమ్మే భారతదేశం.. అంధకార బంధురమై అల్లల్లాడే భారతదేశం, ఎడ్లబళ్లలో ప్రయాణించే ప్రాచీన భారతదేశం.. అంతరిక్షంలోకి రాకెట్లను పంపే అధునాతన భారతదేశం. భారత్ అంటే ఏమిటి? అది ఓ దృగ్విషయమా? ఒకనాటి విహంగ మా? ఈ దేశాన్ని ఎలా విశదీకరించాలి? వేలకొద్ది వాగులూ, వం కలూ ప్రవహించే ఈ భూమి. అనేకమంది మార్మికులకూ, చక్రవర్తులకూ, అసాధారణ నైపుణ్యం గలవారికీ, తారలనే కిందకు దించగల సంగీత సామ్రాట్టులకు ఆలవాలం ఇది.

06/15/2017 - 01:29

‘వెన్నవంటి భరతజాతి
వెన్నున నిప్పంటించిన
దెవ్వరు నువ్వేనా?
కొవ్వెక్కిన నవ చైనా?
సామ్యవాదమను పేరిట
సామ్రాజ్య పిపాస దీర్చ
నెంచు కుటిల జాతీ!
ఇదా రాజనీతి..?’

06/14/2017 - 02:23

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కాశ్మీర్ బ్రాహ్మణ పండిట్ల కు టుంబంలో పుట్టినా ఏ ఛాందసాలనూ తన దరికి చేరనీయలేదు. ‘పండిట్’ అంటే వేద పండితుడు కాదు, లోకం పోకడను, ప్రపంచ పరిణామాలను ఎరిగిన పండితుడు. తన దేశానికేం కావాలో, తన ప్రజల మనోభావాలేంటో నెహ్రూ అర్థం చేసుకున్నంతగా- ఒక్క అంబేద్కర్ తప్ప మరే నేతలూ అర్థం చేసుకోలేదు. దేశ స్వాతంత్య్రం కోసం తమ సర్వస్వాన్ని ధారబోసింది నెహ్రూ కుటుంబం.

Pages