S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

09/23/2018 - 01:20

‘బఫూన్’ అంటే విదూషకుడు అని అర్థం. సర్కస్‌లో వీళ్లు హాస్యం పండిస్తూ వీక్షకులను నవ్విస్తూ ఉంటారు. ఇటీవల ఒక సభలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘పెద్ద బఫూన్’ అని వ్యాఖ్యానించారు. దాంతో కాంగ్రెస్ వారికి ఆగ్రహం కలిగింది. ‘నీవే అతిపెద్ద బఫూన్‌వి’అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి కుంతియా ఎదురుదాడికి దిగారు.

09/22/2018 - 00:23

ప్రపంచంలోనే ఒక ప్రముఖ ఔషధ పరిశ్రమ కేంద్రంగా హైదరాబాద్ పేరొందింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఔషధ పరిశ్రమల స్థాపనకు ఇక్కడ పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపు తున్నారు. ఈ ఆసక్తిని సొమ్ము చేసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివారులలో శ్రీశైలం రోడ్‌పై సుమారు 20 వేల ఎకరాలలో ఫార్మా సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నది.

09/20/2018 - 01:47

నల్లగొండ జిల్లాలో జరిగిన తాజా పరువు హత్య సంఘటన యావత్ సమాజాన్ని ఒక్క కుదుపు కుదిపింది. గర్భవతి అయిన మహిళ కళ్లెదుటే భర్తను దారుణంగా నరికి చంపడం భీతావహ పరిస్థితిని సృష్టించింది. పరువు హత్యలు భారతీయ సమాజానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచం అంతటా ఉన్నాయి. ప్రతి సమాజంలోనూ ఐశ్వర్యవంతుడు తన కుమార్తెను పేదవాడితో పెళ్లి చేసేందుకు నిరాకరిస్తాడు. దీంతో ఘర్షణ మొదలై హత్యలకు దారితీస్తుంది.

09/19/2018 - 01:04

‘ఏదో.. వాళ్లు సమాచారం అడుగుతారు, ప్రభుత్వానికి ఇబ్బంది లేనిది వెంటనే ఇచ్చేయమని చెబుతాం, ఇవ్వలేదనుకోండి.. ఆ దరఖాస్తు వివిధ దశల్లో ఏడాదిపాటు తిరుగుతుంది. ఏడాది గడచిన తర్వాత అనేక మార్లు ఆ పిటిషన్లను సమీక్షించి అప్పటికీ ఆ అధికారి సమాచారం ఇవ్వకపోతే వెయ్యి రూపాయిలో, రెండు వేల రూపాయిలో జరిమానా వేస్తాం.. అంతకు మించి ఇందులో అర్థం కనిపించడం లేదు. అనవసరంగా సమాచారం అడిగేవారు ఎక్కువయ్యారు..

09/18/2018 - 00:14

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రాజకీయ పార్టీలు సృష్టించిన పరిస్థితుల కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి గురించి, మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు, విజయాల గురించి ప్రజలకు నిజాలు తెలియడం లేదు. మీడియా ద్వారా వాస్తవాలు తెలుస్తాయని ఆశించినవారికి నిరాశే మిగులుతోంది. లోతుగా ఆలోచిస్తే, కేంద్ర ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని ప్రతిరోజూ అనకపోతే- తమకు మనుగడ లేదని రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి.

09/16/2018 - 00:08

‘కాపిటల్’ పేర కారల్ మార్క్స్ 170 ఏళ్ళ క్రితం ఓ గ్రంథం రాశారు. తరతరాలుగా సమాజంలో జరుగుతున్న క్రయవిక్రయాలు, భూసంబంధాలు ఇతరత్రా విషయాలను ఆయన అందులో విశే్లషించారు. ఆ రచనను తెలుగులోకి తర్జుమాచేశారు. తెలుగు భాషపై సాధికారత తమకే గలదని విశ్వసించే వారి దగ్గరనుంచి మార్క్స్ అంటే పడి చచ్చేవారివరకు ఎందరో కాపిటల్‌ను ‘పెట్టుబడి’గా పేర్కొన్నారు.

09/15/2018 - 00:08

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ చేపట్టిన తర్వాత సుదీర్ఘకాలం ఈ పదవిలో ఉన్న సోనియా గాంధీ ఇక దాదాపు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతారని అందరూ భావించారు. ఆందోళన కలిగిస్తున్న ఆమె ఆరోగ్యం కూడా అందుకు కారణం కాగా, కొంత స్వతంత్రత ఇస్తేగానీ రాహుల్ ఒక నాయకుడిగా ఎదగలేరని ఆమె కూడా భావించడమే ప్రధాన కారణం.

09/13/2018 - 00:04

అధికారం అనుభవిస్తున్న నాయకులు రాజకీయ లబ్ధికో, కొన్ని వర్గాల ఒత్తిళ్ల ఫలితంగానో- హంతకులను వదిలేసేలా నిర్ణయాలను తీసుకుంటే దేశంలో ఇక దర్యాప్తు సంస్థలు ఎందుకు? న్యాయస్థానాలు సుదీర్ఘం కాలం పాటు విచారించి దోషులుగా నిర్ధారిస్తే, శిక్షలను అమలు చేయకుండా తాత్సారం చేయడం వల్ల రాజ్యాంగాన్ని పరిరక్షించినట్లవుతుందా? దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగి 27 సంవత్సరాలు గడిచింది.

09/11/2018 - 23:59

‘సైనిక దళాలకు ప్రత్యేకాధికారాల చట్టం’ సెగ సుప్రీం కోర్టును తాకింది. ‘ప్రత్యేకాధికారాలు’ వినియోగించుకుంటున్న సైన్యంపై కేసులు నమోదు కావడంతో ఈ వ్యవహారం కాస్తా సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనకు వచ్చింది. శాంతిభద్రతల పరిరక్షణకు తాము తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తూ కేసులు నమోదు చేయడాన్ని , తమను ప్రాసిక్యూట్ చేయడాన్ని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో సైన్యం సుప్రీంలో కేసులు నమోదు చేస్తోంది.

09/11/2018 - 00:06

ఒక విషయాన్ని మనమంతా నేడు గమనిస్తున్నాం. ఏ రంగంలోనూ సంస్కారమనేది ఇప్పుడు కనపడడం లేదు. రాజకీయ నాయకులు ఈ విషయంలో మరీ ముందున్నారు. దురదృష్టమేమిటంటే- మిగతా రంగాలు కూడా దాదాపుగా రాజకీయ నాయకుల స్థాయికి చేరటానికి తహతహలాడుతున్నట్టు అనిపిస్తోంది.

Pages