S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

08/26/2018 - 03:44

కాదేదీ కవితకనర్హం అన్నాడు మన తెలుగు కవి. రాజకీయవేత్తలు ఈ రహస్యం గ్రహించారు. ఏ సంఘటన జరిగినా దానిని ఎన్నికల రాజకీయాలతో ముడిపెట్టి చూడటం మొదలుపెట్టారు. కేరళ రాష్ట్రంలో నూరు సంవత్సరాలుగా కనీవినీ ఎరుగని వరదలు వచ్చాయి. ఇది పాలకపక్షం సీపీఎం చేసిన దుర్మార్గపు నిర్ణయాల ఫలితమేననే ఆరోపణలు వచ్చాయి.

08/28/2018 - 14:32

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మృతి చెందడంతో భారత రాజకీయ రంగంలో ఒక శకం ముగిసినట్లు అందరూ భావించారు. రాజకీయాలకు, విశ్వాసాలకు అతీతంగా ఆయనకు మొత్తం జాతి ఘనమైన వీడ్కోలు పలికింది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి నేతలు మృతి చెందినప్పుడు ఒకవిధమైన భావోద్వేగంతో మొత్తం జాతి ప్రతిస్పందించింది. అప్పట్లో వారు కీలక పదవుల్లో ఉన్నారు. తమ పార్టీలో తిరుగులేని ఆధిపత్యం వహిస్తున్నారు.

08/23/2018 - 00:07

కేరళలో జల విలయం అపార నష్టం కలిగించడంతో దేశవ్యాప్తంగా మరోసారి పర్యావరణ పరిరక్షణ అంశం తెరపైకి వచ్చింది. భారీ వర్షాలు, వరదల తాకిడికి కేరళలో దాదాపు 500 మంది మృతి చెందగా, సుమారు రూ. 30వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. రమారమి 15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ‘దేవభూమి’గా, అక్షరాస్యతలో అగ్రగామిగా భాసిల్లుతున్న ఈ రాష్ట్రం నుంచి లక్షలాది మంది తమ జీవనోపాధికి గల్ఫ్ దేశాలకు వలస పోతుంటారు.

08/21/2018 - 23:34

మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో 44వ ఆర్టికల్ గురించి మరోసారి దేశవ్యాప్తంగా విస్తృత చర్చ మొదలైంది. ‘ఇదిగిదిగో.. ఉమ్మడి పౌరస్మృతి వచ్చేస్తోంది..’ అని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా, మరో పక్క ‘లా కమిషన్’ మాత్రం ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదంటోంది. ఉమ్మడి పౌరస్మృతికి రాజ్యాంగాన్ని సవరించాల్సిందేనా?

08/19/2018 - 00:22

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఎన్నో ఇబ్బందులు.. అయినా- అధికార,విపక్ష పార్టీల నాయకులు ఎవరికి తోచినట్లుగా వారు ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో చెప్పిన చాలా విషయాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొంతమంది నేతలు ‘అమరావతి’ పేరిట కొత్త రాజధాని కట్టవద్దన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదులో పదేళ్ల పాటు అసెంబ్లీ భవనాలు, ఇతర నిర్మాణాలను వాడుకోవచ్చు.

08/18/2018 - 00:12

వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓ డించాలనే విషయంలో ఒకే విధమైన ఏకా భిప్రాయం విపక్షాల్లో వ్యక్తం అవుతోంది. భాజపా మిత్రపక్షాలు సైతం అదే అభిప్రాయంతో ఉన్నాయి. భాజపాలోని పలువురు నేతలు కూడా మోదీ ప్రధానిగా కొనసాగడం పట్ల విముఖంగా ఉన్నారు. ఆయన ప్రధానిగా మరో ఐదేళ్లు కొనసాగితే దేశానికి, ప్రజలకు, పరిపాలనకు ఏదో ముప్పు వాటిల్లుతుందని వారెవ్వరూ ఆందోళన చెందడం లేదు.

08/16/2018 - 00:26

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించేందుకు బీజేపీయేతర పక్షాలు ఏకతాటిపైకి వస్తాయనుకోవడం ఎండమావి లాంటిదే. ఇటీవల లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా విపక్ష పార్టీల డొల్లతనం బయటపడింది. వాటి బలహీనతలు బహిర్గతమయ్యాయి. సాధారణంగా అవిశ్వాస తీర్మానం వల్ల అధికార పార్టీ లొసుగులు బయటపడాల్సి ఉంది. మోదీ సర్కారును ఇరుకున పెట్టడంలో కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ విఫలమయ్యాయి.

08/15/2018 - 00:02

ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది. విభి న్న భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, దృక్పథాలున్నా- అధిక జనాభాతో సతమతమవుతున్నా- భారతీయులు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించడాన్ని ప్రపంచం అబ్బురపడి చూస్తోంది. ఇంతటి సంక్లిష్ట సమాజం ఈ భూమిపై లేదంటే అతిశయోక్తి కాదు. విద్య, విజ్ఞానం, ఐటీ రంగం..

08/11/2018 - 23:43

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) ప్రారంభమై 93 ఏళ్లు కావస్తోంది. హిందూ సంఘటన ఆధారంగా దేశ పునర్నిర్మాణానికి కృషిచేస్తున్న ‘సంఘ్’ ప్రారంభం నుండీ ఎన్నో విమర్శలను, ఆరోపణలనూ ఎదుర్కొంటూనే ఉంది. ‘ఆర్.ఎస్.ఎస్. భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదు’-అన్నది ఆ విమర్శలలో ఒకటి. ఈ సంస్థ గురించి వాస్తవాలు తెలియనివారే అలా అసత్య ఆరోపణలు చేస్తుంటారు.

08/10/2018 - 23:00

ఆధునిక భారత దేశంలో సుదీర్ఘ కాలం ప్రజా జీవనంలో ఉండటమే కాకుండా, తాను నమ్మిన విశ్వాసాల కోసం రాజీలేని రీతిలో అసమాన పోరాటాలు జరుపుతూ, అర్ధ శతాబ్దం పాటు ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీకి బలమైన భూమిక ఏర్పాటు చేసిన యోధుడు కరుణానిధి. డా. బీఆర్ అంబేడ్కర్ వలే బాల్యంలో కుల వివక్ష, వేధింపులకు గురికావడంతో 13 ఏళ్ళ వయస్సు నుండే ఆయన ఎదురు తిరగడం, పోరాటాలకు కాలు దువ్వడం ప్రారంభించారు.

Pages