S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

04/14/2017 - 01:27

‘వంద తప్పలు చేస్తే గానీ శిశుపాల వధ’ జరగదు కాబట్టి కేసిఆర్ నూరు తప్పుల వైపు ప్రయాణం చేస్తున్నారు! ఇక్క డ ‘వధ’ అంటే తెరాస గద్దె దిగడమే! తాను ‘పంది’ అంటే ‘అ వును’ అనే వాళ్లు, ‘కాదు నంది’ అంటే కాదనే ‘వందిమాగధులు’ చుట్టూ చేరితే అది ‘కెసిఆర్ ప్రభుత్వం’ అవుతుంది. సరిగ్గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా అడుగులు వేశాడో, కేసిఆర్ అలాంటి ‘పాదయాత్ర’నే చేస్తున్నాడు.

04/13/2017 - 07:13

‘అశ్వని’ కురిస్తే అంతా నష్టం- అన్నది వ్యవసాయ ప్రపంచంలో మారుమోగిన ప్రాచీన సూక్తి. ‘్భరణి’ కురిస్తే ‘్ధరణి’ పండును- అన్నది సకాల వర్షాన్ని స్వాగతించే సూక్తి. అశ్వని, భరణి వంటి ‘కార్తె’లతో ముడివడిన సేద్యం గురించి, వర్షం గురించి మన దేశంలోని వ్యవసాయ శాస్త్ర పట్ట్భద్రులకు, స్నాతకోత్తర పట్ట్భద్రులకు తెలుసా? అన్నది సందేహం..

04/12/2017 - 01:10

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు సరిగ్గా మరొక రెండు వారాలలో ఈనెల 26వ తేదీన ప్రారంభం కానున్నా యి. మూడు రోజుల ఆరంభోత్సవాల తర్వాత వివిధ కార్యక్రమాలు మొ త్తం సంవత్సరం పొడవునా సాగనున్నాయి. ఉస్మానియాకు నూరేళ్లు పూర్తికావటం ఒక్క తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాలు రెండింటికీ గర్వించదగ్గ విషయం. ఇంకా బాగా చెప్పాలంటే మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఇరుగు పొరుగు రాష్ట్ర వాసులకు కూడా.

04/11/2017 - 00:41

సంజయ్‌లీలా బన్సాలీ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు. రాజస్థాన్‌కు చెందిన ‘చిత్తూరు రాణి పద్మిని’ జీవిత చరిత్ర ఆధారంగా ‘పద్మావతి’ అనే సినిమా నిర్మించాలని ఆయన సంకల్పించాడు. జనరంజకంగా ఈ చారిత్రక సినిమాను రూపొందించాలని తపన పడి, అందుకోసం కావలసిన స్క్రిప్టును కూడా తయారుచేసుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. చారిత్రక సినిమాలను తీయడం బాలీవుడ్‌లో కొత్తేమీ కాదు.

04/10/2017 - 00:49

గొల్ల శ్రీనివాస్ మేకల్ని, గొర్రెల్ని మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇది కూడా వార్తేనా? అనే సందేహం రావచ్చు! ‘మనిషి కుక్కను కరిస్తే’ వార్తెలా అవుతుందో శ్రీనివాస్‌ది అలాంటి వార్తనే! అట్టహాసంగా ‘బడిబాట’ చేపట్టిన రోజే చెరువులో పడిన గొర్రెల్ని రక్షించబోయి, మరో పెద్దమనిషితోపాటు శ్రీనివాస్ ఆకస్మికంగా మరణించాడు.

04/09/2017 - 01:20

కాశ్మీర్ బాటలో పశ్చిమ బెంగాల్ మాత్రమే ‘ఇస్లామీకరణ’ వైపు కదులుతోందని భావిస్తే మనం పొరబడినట్లే! తమిళనాడు సైతం ‘ఇస్లామీకరణ’కు ఏమంత దూ రంగా లేదనే చెప్పాలి. ‘జల్లికట్టు’ క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ తమిళనాట జరిగిన ఉద్యమం దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంది.

04/08/2017 - 07:07

రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజ్యాంగ స్ఫూర్తికి కలసికట్టుగా తూట్లు పొడవడాన్ని భారత దేశ ప్రజాస్వామ్య వాదులు ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర గవర్నర్, శాసన సభాపతి, ముఖ్యమంత్రి.. ముగ్గురూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవారే. రా జ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తామని వాగ్దానం చేసినవారే. అటువంటి ఆ ముగ్గురు నేతలూ నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ సాక్షిగా రాజ్యాంగం మీద అత్యాచారానికి పాల్పడ్డారు.

04/07/2017 - 07:13

సబర్మతీ ఆశ్రమంలోని వారందరినీ చంపారణ్‌కు గాంధీజీ పిలిపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తల్ని ఆహ్వానించారు. అందరూ కలిసి వీధులన్నింటినీ శుభ్రపరిచారు. పెంటకుప్పల్ని ఎత్తివేయడం, నీళ్లకుంటల్ని మట్టితో పూడ్చడం, పారిశుద్ధ్య కార్యక్రమాల ఆవశ్యకతను ఇంటింటికీ వెళ్లి బోధపరచడం వంటి కార్యక్రమాలన్నీ ఏకబిగిన సాగాయి.

04/06/2017 - 08:28

ఆవును కాని గోసంతతిని కాని హత్యచేసే వారికి పదునాలుగేళ్లపాటు జైలుశిక్షను విధించడానికి వీలుగా గుజరాత్ ప్ర భుత్వం చట్టాన్ని సవరించడం విప్లవాత్మక పరిణామం! నేరం ఋజువైనట్టయితే పదునాలుగేళ్లు కటకటాల వెనుక పడి ఉండాలన్న భయంతోనైనా ఆవులను చంపడం హంతకులు మానుకోవడానికి ఈ సవరణ చట్టం వీలు కలిగిస్తుంది. ఆవును పోషించడం పాలించడం పరిరక్షించడం పెంపొందించడం మన దేశంలో అనాదిగా జాతీయ సంప్రదాయం.

04/05/2017 - 01:30

మన దేశంలో పాతికేళ్లకు పైగా ఒక వెలుగు వెలిగిన ఫెడరలిస్టు (సమాఖ్య) రాజకీయాలకు నెమ్మదిగా గడ్డుదశ వస్తున్నదా? భారతీయ సమాజంలో వౌలికంగా ‘ఫెడరలిజం’ అనే స్థితి బలహీనపడుతున్నదని అనడం లేదిక్కడ. ఫెడరలిస్టు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. ఫెడరలిజం అనేది ఒక వైవిధ్య సమాజంలో ఉండే వౌలిక స్థితి.

Pages