S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

05/05/2018 - 00:14

ఎటువంటి నిర్దేశిత అజెండా, దౌత్య ప్రణాళిక లేకుండా ప్రధాని మోదీ చైనాలో పర్యటించి, ఆ దేశ అధ్యక్షుడు జింగ్ పింగ్‌తో సమాలోచనలు జరపడాన్ని చారిత్రక సంఘటనగానే భావించాలి. ఈ సమావేశం జరగడానికి చైనా వైపు నుంచే చొరవ ఉన్నట్లు తెలుస్తున్నది. 1962 యుద్ధం తర్వాత బహుశా తొలిసారి చైనా భారత్‌తో సంబంధాలను మెరుగు పరచుకోవాలనే ఆసక్తిని కనపరచిన్నట్లు కనిపిస్తున్నది.

05/02/2018 - 23:48

ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు మధ్య సంబంధాలు చెడినప్పుడు లేదా అధికారంలో ఉన్న పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు
గవర్నర్ వ్యవస్థపై దాడి చేయడం సర్వసాధారణమైంది. ‘రాజ్‌భవన్’ను లక్ష్యంగా చేసుకుని నోరుపారేసుకోవడం రాజకీయ నాయకులకు

05/02/2018 - 00:00

తరాలు మారుతున్నా పరిష్కారం కాని వివాదాలు ఎనె్నన్నో.. న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి.. సామాన్యుడికి న్యాయం దక్కేసరికి దశాబ్దాలు గడుస్తున్నాయి.. అమూల్యమైన సమయం గడిచిపోయాక న్యాయం చేకూర్చినా, వాటి ప్రతిఫలాలు అనుభవించే స్థితి దాటిపోతోంది. జనాభాకు సరిపడా న్యాయస్థానాలు ఏర్పాటు చేసే పరిస్థితులు కరువై, కుంటినడకన కేసులు నడుస్తున్నాయి.

04/27/2018 - 23:35

ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పనిచేయగల జర్నలిజం అత్యంత కీలకమని మనందరికీ తెలుసు. పత్రికాస్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది. ఏ దేశంలో అయితే మీడియా స్వేచ్ఛగా, పార దర్శకంగా, వత్తిడులు లేకుండా పనిచేయగలదో ఆ దేశం లో ప్రజాస్వామ్యం పరిపుష్టి చెందగలదని భావిస్తుంటాం. ప్రజాస్వామ్యాన్ని మనం ఒక సైద్ధాంతిక అంశంగా కోరుకోవడం లేదు.

04/26/2018 - 23:16

రెండు జిల్లాల పార్టీ’ అని అవహేళన చేసిన వారు విస్తుపోయేలా నాలుగేళ్ల వ్యవధిలోనే మహావృక్షంగా విస్తరించిన ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ తన 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశానికి కొత్త దిశను చూపడానికి సన్నద్ధం అవుతోంది. ‘కాంగ్రెస్ రహిత, బీజేపీయేతర..’ అంటూ ఇంత కాలం సాగిన రాజకీయాలకు భిన్నంగా- దేశ సమగ్రాభివృద్ధే ప్రధాన సిద్ధాంతంగా వినూత్న రాజకీయాలకు నాంది పలికేందుకు తెరాస ప్లీనరీకి సర్వం సిద్ధమైంది.

04/25/2018 - 23:36

దేశ రాజకీయాలను శాసించి, జాతీయ సమగ్రతను, సంస్కృతిని సుసంపన్నం చేసిన దక్షిణాది నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. వీరిలో కొందరు ఉన్నతమైన రాష్టప్రతి, ప్రధానమంత్రి పదవులను నిర్వహించారు. మరి కొందరు కాంగ్రెస్, భాజపా, జన్‌సంఘ్, ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో కీలక పదవులను చేపట్టి వనె్న తెచ్చారు. రాజకీయాల్లో అధికారం ఇస్తే పుచ్చుకునే వారుంటారు, ఇవ్వకపోతే లాక్కొనే వారూ ఉంటారు.

04/25/2018 - 03:55

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం తిరస్కరిస్తున్నట్టు ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్ హోదాలో ప్రకటించారు. ఇపుడు ఏం జరగబోతోంది? దీనిని సుప్రీం కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందా? ఉంటే ఎంతవరకూ ఉంది? ఆ తర్వాత ఏం జరగబోతోంది? అనే ప్రశ్నలు రాజ్యాంగం న్యాయవ్యవస్థకు ఇచ్చిన స్వేచ్ఛను నిలదీస్తున్నాయి. విపక్షాలు ఈ అంశంపై సుప్రీంను ఆశ్రయిస్తామని అంటున్నాయి.

04/21/2018 - 23:57

గర్భం దాల్చిన మూడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు గైనకాలజిస్టును సంప్రదిస్తూ, వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేయంచుకుంటూ, మందులు వాడుతూ, చలాకీగా ప్రసవం అయ్యే ముందు రోజు వరకు ఇంటి పనులు చక్కబెడుతూ, ఆఫీసుకు వెళ్లి వస్తూండే 40 శాతం గర్భవతులకు- కాన్పు సమయం ఆసన్నమైన వెంటనే డాక్టర్ గారు నొసలు చిట్లించి గంభీరంగా చెప్పే ఆ రెండు వాక్యాలు నిరాశ కల్పిస్తాయి.

04/21/2018 - 00:04

ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండడంతో రాజకీయ పక్షాల, ప్రజానీకం దృష్టి ఎన్నికలపైనే ఉండడంతో అభివృద్ధి మరుగున పడుతోందని ప్రధాన మంత్రి మోదీ అంటున్నారు. దీనికి విరుగుడుగా లోక్‌సభ, అసెంబ్లీ లకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ఆలోచనను ఆయన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఈ ప్రతిపాదనపై ఆయన వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

04/18/2018 - 23:42

‘‘నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్ర పోనివ్వను..’’

Pages