S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

02/22/2018 - 07:04

వచ్చే ఏడాది ఎన్నికలు కావడం వల్ల సహజంగానే రాజకీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, లాభ నష్టాలను బేరీజు వేసుకుంటుంది. వామపక్ష పార్టీలకు బలం
లేకపోయినా అన్ని శక్తులను కూడదీసుకుని రాష్ట్రప్రయోజనాలకు

02/21/2018 - 06:30

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన ‘తిమింగలాల’ ఆస్తుల చిట్టా చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఓ అవినీతి అధికారి ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు! ఉద్యోగుల ఆస్తులే ఇలా ఉంటే రాజకీయ నాయకుల ఆస్తుల సంగతి వేరే చెప్పాలా? దేశంలో కోటి రూపాయల ఆస్తి దాటని ముఖ్యమంత్రులు ఉన్నారంటే ఆశ్చర్యకరమే.

02/19/2018 - 23:13

ఇటీవల ఉన్నట్లుండి ‘ఉత్పత్తి’ అనే అంశం చర్చనీయమైంది. ‘ఉత్పత్తి కులాలు గొప్పవి.. అవి నిర్లక్ష్యానికి గుర

02/17/2018 - 23:30

దేశంలో అందరికీ ఉచిత వైద్యం లభ్యం కానందున ముఖ్యంగా వైద్య ఖర్చుల పేరిట తలసరి ఆదాయంలో పదిశాతం వెచ్చిస్తున్నందున, ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలలో ఏటా రూ.15,000 లేదా నెలకు రూ.1,250 చొప్పున ‘టాక్స్ ఫ్రీ మెడికల్ రీ ఎంబర్స్‌మెంట్’ విధానాన్ని కొనే్నళ్ల క్రితం ప్రవేశపెట్టింది. ప్రభుత్వం సదుద్దేశంతో అమలు చేస్తున్న మెడికల్ రీ ఎంబర్స్‌మెంట్ వల్ల లక్షలాది మంది ఉద్యోగులు లబ్ది పొందుతున్నారు.

02/17/2018 - 05:55

నెల్లూరు జిల్లా దుగరాజపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి భద్రతా కారణాల రీత్యా ‘్భరత అంతరిక్ష పరిశోధనా సంస్థ’ (ఇస్రో) అభ్యంతరం చెబుతుండడంతో ప్రకాశం జిల్లాలో రామాయపట్నం వద్ద నౌకాశ్రయం నెలకొల్పే యోచన మరోసారి తెరపైకి వచ్చింది. సహజ సిద్ధమైన వనరులు ఉన్నప్పటికీ రామాయపట్నం ప్రాంతం చిరకాలంగా అభివృద్ధికి నోచుకోలేదు.

02/15/2018 - 23:45

భారత్ ఎంత మహోన్నతమైందో, అన్ని ఎదురు దెబ్బలూ తిన్నది. పడిలేస్తూ తన అంతర్గత సంస్కృతిని, ఆలోచనలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ, కొత్తరూపంలో వ్యక్తీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నది. దానికి కారణం ఇక్కడి బహు సంఖ్యాకులైన హిందూ జాతి మాత్రమే. 800 ఏళ్లు ముస్లింలు, 200 ఏళ్లు క్రైస్తవులు పాలించినా మన దేశంలోని హిందూ ప్రజలు తమ మతాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు.

02/15/2018 - 00:51

రాయలసీమలో హైకోర్టు సాధన కోసం చేపట్టిన ఉద్యమం ఇంకా తొలిదశలోనే ఉంది. ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ గొంతెమ్మ కోరికేమీ కాదు. హైకోర్టు బెంచిని రాయలసీమలోని ఏ నగరంలో ఏర్పాటు చేసినా యావదాంధ్ర ప్రజలు స్వాగతిస్తారు. గతంలో అనేక అంశాలపై ఆయా ప్రాంతాలు భిన్న స్వరాలు వినిపించడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతవాసులు కోరారు.

02/13/2018 - 23:27

ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ విషయమై కేంద్రప్రభుత్వంపై సుప్రీంకోర్టు- ‘మేం చెత్త ఏరుకునే వాళ్లమేం కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తే న్యాయమూర్తుల ఆవేదన, బాధ ఇట్టే అర్థమైపోతుంది. గణాంకాలు చూస్తే సామాన్యులు సైతం గుండెలు బాదుకునే పరిస్థితే. నిజమైన గణాంకాలను బయటకు రానివ్వడం లేదని కూడా ఇటీవల ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ సైతం మనసులోమాట వెల్లడించింది.

02/13/2018 - 02:29

మనం ఒక కుక్కపిల్లను తెచ్చి, దానికి రోజూ తిండి పెట్టి ఇంటికి కాపలాగా పెట్టుకుంటాం. అది దొంగలు వచ్చినప్పుడు మొరగటం లేదు సరికదా, ఇంట్లో వాళ్లనే కరిచిందనుకోండి.. మరి ఇంకేమి కాపలా? 1962లో రక్షణమంత్రి కృష్ణమీనన్ హయాంలో చాలా దుర్మార్గాలు జరిగాయి. ముఖ్యంగా సైన్యం ఉపయోగించే ‘మిలటరీ జీపుల కొనుగోలు’లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి.

02/11/2018 - 00:09

వేసవి రాకముందే తెలంగాణలో రాజకీయంగా ఉక్కపోతలు మొదలయ్యాయి. అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిత్యం సవాళ్లు,ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్నికల కోలాహలం ప్రారంభమవుతుంది. ‘ఎన్నికల బడ్జెట్’ను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోతోంది.

Pages