S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

12/20/2017 - 01:13

‘అయితే ఏం చేస్తావ్...కోర్టుకు వెళ్తావా? నువ్వు కోర్టుకు వెళ్లి నా మీద కేసు వేసి నేను తప్పు చేశానని నిరూపించేలోగా నా పదవీ కాలం ముగిసిపోతుంది. ఇంకేం చేస్తావ్...

12/19/2017 - 01:14

ఎవరైనా సైద్ధాంతిక చర్చ చేయదలచుకున్నప్పుడు సిద్ధాంతాన్ని తర్కాన్ని ఉపయోగించాలి. అలా వాదంలో బలం లేనప్పుడు ‘వాది’ బలం ప్రదర్శింపబడుతుంది. వాది బలం ఉంటే బాహుబలం అని అర్థం.

12/18/2017 - 00:47

ఆదిమానవుడే అసలు సిసలైన శాస్తజ్ఞ్రుడు.. నిపుణుడు.. సృజనశీలి, సత్యానే్వషి, నిత్యానే్వషి..! ఈ అనే్వషణలో ప్రకృతితో పోరాడడం, స్వీయానుభవం వెరసి నేటి కోట్లాది ఆవిష్కరణలు.. అంటే మనసొప్పని మహానుభావులు దేశవ్యాపితంగానే కాదు, ప్రపంచవ్యాపితంగా కోకొల్లలు! రాజులో, రాణులో, తత్వవేత్తలో, నోబుల్ పురస్కార గ్రహీతలో, మహా రచయితలో, సామాజిక మేధావులో చరిత్ర నిర్మాతలు కారంటే ఒంటికాలిమీద లేచేవారుండవచ్చు!

12/17/2017 - 04:29

రాజకీయ విధానాలపై అపరిపక్వత, తన మార్గమేమిటో తనకే తెలియకపోయినా, తాను ఎవరి పక్షమన్న దానిపై తనకే స్పష్టత లేకపోయినా, తన వైఖరిపై తానే సంఘర్షించుకునేలా మాట్లాడే అలవాటు ఉన్నప్పటికీ జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఒక్కటి మాత్రం నిజం చెప్పారు. అమరావతి అభివృద్ధికి కులమే అడ్డని, విజయవాడలో కుల పరిస్థితులు మారకపోతే అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మించలేరన్న వ్యాఖ్యలు మనం మనుషులం అన్నంత నిజం.

12/16/2017 - 00:37

గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అన్న అంశం పక్కనబెడితే ఆ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ రాజకీయ పాఠాలు నేర్చుకునే అవకాశం రాహుల్ గాంధీకి దక్కింది. ఈ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం, దూకుడు, విమర్శల్లో పదును, ఆత్మవిశ్వాసం, పరిణతి కన్పించడం విశేషం. ముఖ్యంగా ఆ పార్టీతోపాటు విపక్షాలలో కూడా రాహుల్‌లో వచ్చిన మార్పు కాస్తంత నమ్మకాన్ని పెంచాయనే భావించాలి.

12/15/2017 - 01:15

మన దేశం నుండి ఓ ఉన్నతాధికారి జర్మన్ రాయబార కార్యాలయానికి వెళితే, అక్కడ ఎందరో శాస్తవ్రేత్తలు, గొప్పవాళ్ల పక్కన మన దేశస్థుడైన ఓ వ్యక్తి ఛాయాచిత్రం కన్పించింది. మన దేశపు ఉన్నతాధికారి ఆసక్తిగా అందులోని వ్యక్తిని గురించి ప్రశ్నించాడు? అక్కడి రాయబార కార్యాలయం అధికారులు ఆ ఫొటోలోని వ్యక్తిని గురించి వివరించారు. ‘‘ఆయన పేరు దండిభట్ల విశ్వనాథ శాస్ర్తీ. రాజమహేంద్రవరానికి చెందిన వేద పండితుడు.

12/13/2017 - 22:27

మొదలెరుగని మధుకిరణం
మళ్లీ మొలకెత్తుతోంది,
మది మదిలో మాతృగళం
మధురిమ చిలికిస్తున్నది..
కోటి యుగమ్ముల ఉదయం
కొత్త కొత్తగా ఉన్నది,
మేటి తెలుగు పూలతోట
పరిమళాల మెరసినది..

12/12/2017 - 23:38

ఇద్దరు మేజర్ల వివాహం రద్దు చేసే అధికారం న్యాయస్థానానికి ఉందా? అలాగే తండ్రిని నియంత్రించే హక్కు న్యాయస్థానానికి ఉందా?? నేను, మా సహ న్యాయమూర్తులు వందకు పైగా హెబియస్ కార్పస్ పిటీషన్లను విచారించి ఉంటాం... కాని తమ ఉమ్మడి అనుభవంలో ఇదో విలక్షణమైనది’ అని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా హదియా కేసును విచారిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవి.

12/12/2017 - 01:03

తమిళనాడులో శైవ బ్రాహ్మణులను అయ్యర్‌లు అని పిలుస్తారు. వైష్ణవ మతస్థులను అయ్యంగార్ అంటారు. కుమారి జయలలిత అయ్యంగార్ కుటుంబంలో జన్మించింది. మణిశంకర అయ్యర్ శైవ కుటుంబంలో పుట్టాడు. ఈయన మతం మార్చుకున్నాడు కాబట్టి హిందూ బ్రాహ్మణుడు కాదు. కమ్యూనిస్టులకు సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఇండియన్ నేషనలిస్టు కూడా కాదు. ఆది నుండి నెహ్రూ కుటుంబానికి ఈయన వీర విధేయుడు.

12/11/2017 - 01:57

‘మేము అట్టడుగు గిరిజన జాతికి చెందినవారం. మా భాషలో మాట్లాడటం అవమానంగా భావిస్తాం!’ అంటూ ఉత్తరాఖండ్ పర్వత శ్రేణుల్లో నివాసముండే వన్‌రాజ్ (వన్‌రావత్) గిరిజన తెగకు చెందిన మదన్‌సింగ్ అనే గిరిజనుడు ఓ పత్రికా జర్నలిస్టుతో అన్న మాటలివి. వారి భాష ‘రాజీ’ అంటారు. కాని, ఉపాధి, బతుకు తెరువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో, తమ మాతృభాషలో మాట్లాడడానికి వారు ఇష్టపడడం లేదు.

Pages